బుచ్చిబాబు టోర్నీ ఫైనల్: పటిష్ట స్థితిలో హైదరాబాద్
చెన్నై: ఆలిండియా బుచ్చిబాబు ఇన్విటేషన్ క్రికెట్ టోర్నమెంట్లో హైదరాబాద్ జట్టు తమ జోరు కొనసాగిస్తోంది. ఛత్తీస్‌గఢ్ జట్టుతో జరుగుతున్న ఫైనల్లో హైదరాబాద్ ప్రత్యర్థి జట్టుకు 518 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. మ్యాచ్ మూడో రోజు హైదరాబాద్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 70.2 ఓవర్లలో 281 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ రాహుల్ సింగ్ (68; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), రాహుల్ రాధేశ్ (41; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు.రోహిత్ రాయుడు భారీ సెంచరీఛత్తీస్గఢ్ బౌలర్ జీవేశ్ ఆరు వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు ఛత్తీస్‌గఢ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 70.2 ఓవర్లలో 181 పరుగులకు ఆలౌటవ్వడంతో హైదరాబాద్‌కు 236 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. హైదరాబాద్ బౌలర్లలో అనికేత్ రెడ్డి నాలుగు వికెట్లు తీయగా... రోహిత్ రాయుడు, తనయ్ త్యాగరాజన్‌లకు మూడు వికెట్ల చొప్పున లభించాయి. హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 118.4 ఓవర్లలో 417 పరుగులు చేసింది. రోహిత్ రాయుడు (155; 8 ఫోర్లు, 8 సిక్స్‌లు) భారీ సెంచరీ సాధించాడు. అభిరత్ (85; 10 ఫోర్లు, 1 సిక్స్), రాహుల్ రాధేశ్ (48; 7 ఫోర్లు) ఆకట్టుకున్నారు.టీమిండియా స్టార్లు సైతంకాగా తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ టోర్నీ ఆరంభ మ్యాచ్‌లలో టీమిండియా స్టార్లు శ్రేయస్ అయ్యర్, సర్ఫరాజ్ ఖాన్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం శ్రేయస్, సర్ఫరాజ్ దులిప్ ట్రోఫీ-2024తో బిజీగా ఉండగా.. సూర్య, ఇషాన్ గాయాల బారిన పడ్డారు. చదవండి: DT 2024: భారత ‘ఎ’ జట్టులోషేక్ రషీద్.. టీమిండియాతో చేరని సర్ఫరాజ్ ఖాన్!