నేడు కలెక్టర్‌గా రఘునందన్‌రావు బాధ్యతల స్వీకారం
నేడు కలెక్టర్‌గా రఘునందన్‌రావు బాధ్యతల స్వీకారం
కలెక్టరేట్ (మచిలీపట్నం), న్యూస్‌లైన్ : విజయదశమి ఘడియల్లో సోమ వారం బాధ్యతలు చేపడుతున్న కొత్త కలెక్టర్ ఎం.రఘునందన్‌రావుకు జిల్లా లోని పాత సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. జిల్లాలో ప్రభుత్వ యంత్రాం గాన్ని ప్రజలకు అనుకూలంగా నడిపిం చాల్సిన ఆయనకు సమస్యలు సవాళ్లు విసరనున్నాయి. ఇంతకుముందు కలెక్టర్లుగా పనిచేసిన ఎంతోమంది జిల్లా ప్రజల మన్ననలు అందుకుంటే, మరి కొంతమంది ప్రజలకు దూరంగానే మొక్కుబడిగా విధులు నిర్వర్తించారు.
వారంతా పాలనాయంత్రాంగంపై పట్టు లేకపోవడం, ప్రధాన సమస్యలపై దృష్టిపెట్టకపోవడం, కీలక అభివృద్ధి సాధించలేకపోవడం వంటి విషయాల్లో జనాదరణ పొందలేకపోయారు. ఇంకొంతమంది జిల్లాలో పనిచేసి ఇతర ప్రాంతాలకు బదిలీఅయినప్పటికీ ప్రజలు వారి ని మరవలేకపోతున్నారు. కలెక్టర్‌గా పనిచేసిన ఎస్.ఎ.ఎం.రిజ్వీ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. సౌమ్యుడు, వివాదరహితుడిగా పేరుతెచ్చుకున్న బుద్ధప్రకాష్ పనితీరు జిల్లాలోని ప్రజాప్రతినిధులకు నచ్చకపోవడంతో వచ్చిన 15 నెలల్లోనే సాగనంపారు.
సమస్యలు ఇవీ..
జిల్లాలో రాజకీయ, అధికార వర్గాలను శాసించే స్థాయిలో ఉన్న ఇసుక మాఫియా ఇబ్బందికరంగా మారింది. కోస్తాతీరంలోను, కొల్లేరు నడిబొడ్డున ఇబ్బడిముబ్బడిగా తవ్వుతున్న చెరువులు అధికార యంత్రాంగానికి సవాళ్లుగా మారాయి. అక్రమ చెరువుల క్రమబద్ధీకరణ కూడా అధికారులకు తలనొప్పిగా తయారైంది. ఇటీవల కురిసిన వర్షాలకు గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లోని రోడ్లు ధ్వంసమయ్యాయి. గ్రామాభివృద్ధి కోసం ఇటీవల ఎన్నికైన పంచాయతీ పాలకవర్గాలు నిధులు ఇస్తాయని ఎదురుచూస్తున్నారు.
మున్సిపాలిటీల్లో దాదాపు రెండేళ్లుగా పాలకవర్గాలు లేక అభివృద్ధి కుంటుపడింది. ఇక్కడ ప్రభుత్వ ప్రధాన శాఖలకు పూర్తిస్థాయి బాధ్యులు లేక ఇన్‌చార్జులతోనే పాలన మొక్కుబడిగా సాగుతోంది. జిల్లాలో శోభిల్లుతున్న మంగినపూడి బీచ్, హంసలదీవి సాగరసంగమం, కొల్లేరుతీరం, వేదాద్రి, కూచిపూడి తదితర ఆధ్యాత్మిక పర్యాటక ప్రాంతాలు అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్నాయి. జిల్లా ఖ్యాతిని ఇనుమడింపచేస్తున్న బందరులడ్డు, రోల్డుగోల్డు పరిశ్రమ, కలంకారీ, కొండపల్లి బొమ్మలు వంటి వాటికి మరింత తోడ్పాటునందించాల్సిఉంది.
గరికపాడు వద్ద స్వాగతం..
జగ్గయ్యపేట : జిల్లాకు వస్తున్న రఘునందన్‌రావుకు ఆదివారం జగ్గయ్యపేట మండలం గరికపాడు వద్ద అధికారులు స్వాగతం పలికారు. బాధ్యతలు స్వీకరించేందుకు హైదరాబాదు నుంచి విజ యవాడ వస్తుండగా జిల్లా సరిహద్దులో ఆయన్ను అధికారులు కలిశారు. స్వాగ తం పలికినవారిలో ఎంపీడీవో జయచంద్ర, తహశీల్దార్ బాలకృష్ణారెడ్డి, చిల్లకల్లు ఎస్.ఐ. అబ్దుల్నబీ, వీఆర్వోలు రాటకొండ శ్రీనివాసరావు, నారాయణరావు, వెంకటరత్నం తదితరులున్నారు.