ఐదుగురు కంబోడియన్లకు ఏడేళ్ల జైలు శిక్ష
కందాల్(కంబోడియా): 2013 డిసెంబర్లో బౌద్ధ మందిరంలో ఓ పురాతనమైన బంగారు పాత్రను దొంగలించినందుకుగానూ ఐదుగురి వ్యక్తులుకు కంబోడియా కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ మేరకు గురువారం అక్కడి మీడియా వెల్లడించింది. బౌద్ధ మందిరంలో ఔడంగ్ పర్వతంపై సెక్క్యూరిటీ చీఫ్ సహా నలుగురు సెక్క్యూరిటీ సిబ్బంది బుద్ధుని పురాతన బంగారు పాత్రను దొంగలించారు.
ఈ దొంగతనం కేసులో ఆ ఐదుగురిని అరెస్ట్ చేసినట్టు అక్కడి న్యూస్ ఏజెన్సీ నివేదించింది. ఈ కేసులో ఒక్కొక్కరికి ఏడు సంవత్సరాల జైలు, రెండు వేల డాలర్ల చొప్పున జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. అయితే 90 శాతం జనాభా ఉన్న కంబోడియాలో పవిత్రమైన బుద్ధుని శేషాలను సాంస్కృతికంగా, మతపరంగానూ బౌద్ధులు ఎంతో విలువైనవిగా భావిస్తారు.