ఐదుగురు కంబోడియన్లకు ఏడేళ్ల జైలు శిక్ష | Five Cambodians get seven years in jail for antique theft | Sakshi
Sakshi News home page

ఐదుగురు కంబోడియన్లకు ఏడేళ్ల జైలు శిక్ష

Published Thu, Aug 27 2015 12:29 PM | Last Updated on Sun, Sep 3 2017 8:14 AM

Five Cambodians get seven years in jail for antique theft

కందాల్(కంబోడియా): 2013 డిసెంబర్లో బౌద్ధ మందిరంలో ఓ పురాతనమైన బంగారు పాత్రను దొంగలించినందుకుగానూ ఐదుగురి వ్యక్తులుకు కంబోడియా కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ మేరకు గురువారం అక్కడి మీడియా వెల్లడించింది. బౌద్ధ మందిరంలో ఔడంగ్ పర్వతంపై సెక్క్యూరిటీ చీఫ్ సహా నలుగురు సెక్క్యూరిటీ సిబ్బంది బుద్ధుని పురాతన బంగారు పాత్రను దొంగలించారు.

ఈ దొంగతనం కేసులో ఆ ఐదుగురిని అరెస్ట్ చేసినట్టు అక్కడి న్యూస్ ఏజెన్సీ నివేదించింది. ఈ కేసులో ఒక్కొక్కరికి ఏడు సంవత్సరాల జైలు, రెండు వేల డాలర్ల చొప్పున జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. అయితే 90 శాతం జనాభా ఉన్న కంబోడియాలో పవిత్రమైన బుద్ధుని శేషాలను సాంస్కృతికంగా, మతపరంగానూ  బౌద్ధులు ఎంతో విలువైనవిగా  భావిస్తారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement