Cambodian court
-
చీఫ్ ఎగ్జిక్యూటివ్ అయి ఉండి అసభ్యంగా..
నాంఫెన్: అమెరికాలో ఓ వైమానిక సంస్థకు చెందిన మాజీ ముఖ్య కార్యదర్శికి పదేళ్ల జైలు శిక్ష పడింది. అతడు చైల్డ్ ప్రాస్టిట్యూషన్కు పాల్పడుతున్నాడన్న ఆరోపణలు నిజమేనని ధ్రువీకరిస్తూ కాంబోడియా కోర్టు అతడికి శిక్షను ఖరారు చేసింది. దీంతోపాటు భారీ మొత్తంలో ఫైన్ కూడా విధించింది. నాంఫెన్కు చెందిన వైమానిక సంస్థ ఎయిరో కాంబోడియాకు బ్రియాన్ నస్వాల్ (53) అనే వ్యక్తి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేశాడు. అతడు చైల్డ్ ప్రాస్టిట్యూషన్కు పాల్పడుతూ గత ఏడాది మే 22న పట్టుబడ్డాడు. కో పిచ్ అనే నాంఫెన్కు చెందిన దీవిలో ఓ పదమూడేళ్ల బాలికను మరో ఇద్దరు బాలికల ముందే అసభ్యకరంగా తాకాడు. అలా, మొత్తం ఎనిమిదిమంది బాలికలతో అసభ్యంగా వ్యవహరించాడు. దీంతో అతడిని అరెస్టు చేసిన పోలీసులు కేసు దర్యాప్తు పూర్తి చేసి కోర్టులో ప్రవేశ పెట్టగా అతడి నేరం చేసినట్లు కోర్టు కూడా స్పష్టం చేసింది. పదేళ్ల జైలు శిక్షతోపాటు బాధితులకు ఒక్కోకరికి దాదాపు రెండు వేల డాలర్లు నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. అమెరికా చైల్డ్ సెక్స్ సంబంధించిన అంశాలను చాలా తీవ్రంగా పరిగణిస్తారు. -
ఐదుగురు కంబోడియన్లకు ఏడేళ్ల జైలు శిక్ష
కందాల్(కంబోడియా): 2013 డిసెంబర్లో బౌద్ధ మందిరంలో ఓ పురాతనమైన బంగారు పాత్రను దొంగలించినందుకుగానూ ఐదుగురి వ్యక్తులుకు కంబోడియా కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ మేరకు గురువారం అక్కడి మీడియా వెల్లడించింది. బౌద్ధ మందిరంలో ఔడంగ్ పర్వతంపై సెక్క్యూరిటీ చీఫ్ సహా నలుగురు సెక్క్యూరిటీ సిబ్బంది బుద్ధుని పురాతన బంగారు పాత్రను దొంగలించారు. ఈ దొంగతనం కేసులో ఆ ఐదుగురిని అరెస్ట్ చేసినట్టు అక్కడి న్యూస్ ఏజెన్సీ నివేదించింది. ఈ కేసులో ఒక్కొక్కరికి ఏడు సంవత్సరాల జైలు, రెండు వేల డాలర్ల చొప్పున జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. అయితే 90 శాతం జనాభా ఉన్న కంబోడియాలో పవిత్రమైన బుద్ధుని శేషాలను సాంస్కృతికంగా, మతపరంగానూ బౌద్ధులు ఎంతో విలువైనవిగా భావిస్తారు.