నాట్కో ఔషధానికి ఎఫ్డీఏ ఆమోదం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బుడెసొనైడ్ ఔషధ జనరిక్ వెర్షన్ అమ్మకాలకు అమెరికా ఔషధ రంగ నియంత్రణ సంస్థ యూఎస్ఎఫ్డీఏ నుంచి అనుమతులు లభించినట్లు నాట్కో ఫార్మా వెల్లడించింది. పెరిగో ఫార్మా ఇంటర్నేషనల్ సంస్థ దీన్ని ఎంటోకోర్ట్ పేరిట విక్రరుుస్తోంది. జీర్ణవ్యవస్థ సమస్యల సంబంధిత క్రోన్స వ్యాధి చికిత్సలో ఎంటోకోర్ట్ ఈసీ (3 మి.గ్రా. మోతాదు)ని ఉపయోగిస్తారని నాట్కో వివరించింది. తమ మార్కెటింగ్ భాగస్వామి అల్వోజెన్తో కలిసి దీన్ని తక్షణం అమెరికా మార్కెట్లో ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొంది. ఎంటోకోర్ట్ ఈసీ క్యాప్సూల్స్, సంబంధిత ఇతర జనరిక్ వెర్షన్స అమ్మకాలు అమెరికాలో వార్షికంగా సుమారు 370 మిలియన్ డాలర్ల మేర ఉన్నట్లు అంచనా. గురువారం బీఎస్ఈలో నాట్కో షేరు స్వల్పంగా పెరిగి రూ. 590 వద్ద ముగిసింది.