ముగిసిన బిల్డ్ ఎక్స్పో
వరంగల్ బిజినెస్ : వరంగల్ ములుగు రోడ్డు సమీపంలోని వెంకటేశ్వర గార్డెన్స్‌లో అసోసియేషన్ ఆఫ్ కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్స్(ఇండియా) ఆధ్వర్యంలో రెండు రోజుగా జరిగిన బిల్డ్ ఎక్స్పో శనివారం ముగిసింది. భవన నిర్మాణానికి సంబంధించిన 75 స్టాళ్లలో శానిటరీ, ఎలక్రి్టకల్, డోర్ అండ్ విండోస్, సిమెంట్, స్టీల్, ఫ్లైవుడ్, టైల్స్, హార్డ్‌వేర్‌కు సంబంధించిన వస్తువులను ప్రదర్శించారు. జిల్లా నలుమూలల నుంచి ఇంజనీర్లు, అర్కిటెక్చర్లు, బిల్డర్లు, ఇంటీరియల్ డిజైనర్లు, ఇంజనీరింగ్ విద్యార్థులు స్టాళ్లను తిలకించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ ఆఫ్ కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్స్ చైర్మన్ కోలా అన్నారెడ్డి, మహ్మద్ ఇదాయత్‌అలీ, ఈగల రాజేందర్, నల్ల లక్ష్మయ్య, పాకపవన కృష్ణ, దుస సురేష్‌బాబు, అంబ దాస్, అమర్నాథ్, అరీఫ్ పాల్గొన్నారు.