building crash
-
భవనం కుప్పకూలి ముగ్గురి మృతి
ముంబై: పాత మూడు అంతస్తుల భవనం కుప్పకూలడంతో ముగ్గురు వ్యక్తులు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. శిథిలావస్థకు చేరుకున్న భవనంలో మరమ్మత్తులు చేస్తుండగా శనివారం మధ్యాహ్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యల్లో నిమగ్నమైయ్యారు. కూలిపోయిన భవనం శిథిలాలనుంచి ముగ్గురిని రక్షించారు. శిధిలాల కింద ఎంతమంది చిక్కుకపోయారో గుర్తించేందుకు సహాయక సిబ్బంది గంటల తరబడి శ్రమిస్తున్నారు. కాగా, ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
61కి పెరిగిన ముంబై భవన మృతులు
ముంబై: మాజ్గావ్ ప్రాంతంలో శుక్రవారం ఉదయం భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య 61కు చేరుకుంది. ఘటనా స్థలం నుంచి మరో ఎనిమిది మృతదేహాలను వెలికితీశారు. దాదాపు 48 గంటల పాటు చేపట్టిన నిర్విరామ సహాయ కార్యక్రమాలను ప్రతికూల వాతావరణం కారణంగా ఈ తెల్లవారుజామున నిలిపివేశారు. శిథిలాల కింద మరిన్ని మృతదేహాలు ఉండే అవకాశముందని భావిస్తున్నారు. దాదాపు 50 ఏళ్ల క్రితం కట్టిన ఈ భవనం శుక్రవారం ఉదయం కుప్పకూలిన విషయం తెలిసిందే, దుర్ఘటన జరిగే సమయానికి అందులో ఉండేవాళ్లంతా గాఢనిద్రలో ఉండటం వల్లే మృతుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ భవనంలో నివసిస్తున్న సకాల్ మరాఠీ దినపత్రిక జర్నలిస్ట్ యోగేశ్ పవార్, అతడి తంఢ్రి అనంత్ పవార్ కూడా మరణించారని బీఎంసీ విపత్తు నియంత్రణ అధికారులు తెలిపారు. ఈ దుర్ఘటనలో 31 మంది గాయపడ్డారని అధికారులు శనివారం సాయంత్రం ప్రకటించారు.