ముంబై: పాత మూడు అంతస్తుల భవనం కుప్పకూలడంతో ముగ్గురు వ్యక్తులు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. శిథిలావస్థకు చేరుకున్న భవనంలో మరమ్మత్తులు చేస్తుండగా శనివారం మధ్యాహ్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యల్లో నిమగ్నమైయ్యారు.
కూలిపోయిన భవనం శిథిలాలనుంచి ముగ్గురిని రక్షించారు. శిధిలాల కింద ఎంతమంది చిక్కుకపోయారో గుర్తించేందుకు సహాయక సిబ్బంది గంటల తరబడి శ్రమిస్తున్నారు. కాగా, ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
భవనం కుప్పకూలి ముగ్గురి మృతి
Published Sat, Apr 30 2016 5:19 PM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM
Advertisement
Advertisement