పుట్టిన బిడ్డ ఏలియన్స్లా ఉన్నాడని..
లక్నో: పండంటి బిడ్డ పుడతాడని ఆశించిన తల్లిదండ్రులు పుట్టిన బిడ్డను చూసి షాక్తిన్నారు. శారీరక వైకల్యంతో జన్మించిన పిల్లలను పెంచిపెద్ద చేయడం కత్తి సాము లాంటిదే. అలాంటి పిల్లలు ఆరోగ్యకరమైన సాధారణ జీవితం గడపాలంటే అటు కుటుంబ సభ్యులనుంచి ఇటు సమాజం నుంచి సంపూర్ణ మద్దతు చాలా అవసరం. ఉత్తరప్రదేశ్లోని అలీగడ్కు కు చెందిన దంపతులు వింత ఆకారంతో పుట్టిన బిడ్డపట్ల బాధ్యతగా వ్యవహరించి, అక్కున చేర్చుకుని ఆదర్శంగా నిలిచారు.
అలీగడ్కు చెందిన దంపతులు తమ బిడ్డను చూసి భయపడిపోయారు. ముక్కు చెవులు లేకుండా.. కళ్లు పెద్దవిగా బయటకు పొడుచుకు వచ్చినట్టుగా ఉన్న పిల్లవాడి ఆకారాన్ని చూసి చలించిపోయారు. కానీ ఇది భగవంతుడి దయ అంటూ బిడ్డను స్వీకరించారు. ఏదో ఒక అద్భుతం జరిగి తమ కొడుకు జీవితం బాగు పడుతుందని ఆశతో ఇంటికి తీసుకెళ్లారు. అటు గ్రామస్తులు మాత్రం గ్రహాంతరవాసి (ఏలియన్స్) లా వింతగా ఉన్నాడంటూ బిడ్డను చూడడానికి తరలివచ్చారు.
కాగా 2 కేజీల బరువుగా పిల్లవాడు ఆరోగ్యంగా ఉన్నాడని, ప్రమాదమేమీలేదని వైద్యులు తెలిపారు. కాగా ఈ దంపతులకు ఇప్పటికే రెండు సంవత్సరాల కుమార్తె ఉంది.