bullion analysts
-
పసిడి, వెండి- యూఎస్ ప్యాకేజీ జోష్
న్యూయార్క్/ ముంబై: కొత్త ఏడాదిలో పదవి నుంచి తప్పుకోనున్న అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ యూటర్న్ తీసుకుంటూ 2.3 ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీపై సంతకం చేయడంతో పసిడి, వెండి ధరలు జోరందుకున్నాయి. నిరుద్యోగులకు తొలుత ప్రతిపాదించిన 600 డాలర్లను 2,000కు పెంచుతూ గత వారం యూఎస్ కాంగ్రెస్ ప్యాకేజీని ఆమోదించినప్పటికీ ట్రంప్ వ్యతిరేకించారు. అయితే ఉన్నట్టుండి ఆదివారం సహాయక ప్యాకేజీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఈ భారీ ప్యాకేజీలో 1.4 ట్రిలియన్ డాలర్లు ప్రభుత్వ ఏజెన్సీలకు లభించనున్నాయి. ఈ నేపథ్యంలో దేశ, విదేశీ మార్కెట్లో పసిడి, వెండి ధరలు బలపడ్డాయి. న్యూయార్క్ కామెక్స్‌లో ఔన్స్ పసిడి 1900 డాలర్లకు చేరగా.. దేశీయంగా ఎంసీఎక్స్‌లో వెండి కేజీ రూ. 2,000కుపైగా జంప్‌చేసింది. ఇతర వివరాలు చూద్దాం.. (ఐపీవో బాటలో- ఫ్లిప్‌కార్ట్ బోర్డు రీజిగ్) లాభాలతో ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రూ. 495 ఎగసి రూ. 50,568 వద్ద ట్రేడవుతోంది. ఇది ఫిబ్రవరి ఫ్యూచర్స్ ధర కాగా.. తొలుత రూ. 50,200 వద్ద ప్రారంభమైన పసిడి తదుపరి 50,577 వద్ద గరిష్టానికి చేరింది. ఈ బాటలో వెండి కేజీ మార్చి ఫ్యూచర్స్ రూ. 2,159 జంప్‌చేసి రూ. 69,668 వద్ద కదులుతోంది. రూ. 69,000 వద్ద సానుకూలంగా ప్రారంభమైన వెండి ఆపై ఒక దశలో రూ. రూ. 69,800 వరకూ దూసుకెళ్లింది. (దిగివచ్చిన పసిడి, వెండి ధరలు) హుషారుగా న్యూయార్క్ కామెక్స్‌లో ప్రస్తుతం పసిడి ఔన్స్ 0.9 శాతం పుంజుకుని 1,899 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్ మార్కెట్లోనూ 0.6 శాతం బలపడి 1,895 డాలర్లను అధిగమించింది. వెండి మరింత అధికంగా ఔన్స్ 3.6 శాతం జంప్‌చేసి 26.82 డాలర్ల వద్ద కదులుతోంది. పసిడి ఫిబ్రవరి కాంట్రాక్ట్‌కాగా.. వెండి మార్చి ఫ్యూచర్స్ ధరలు. వారాంతాన న్యూయార్క్ కామెక్స్‌లో పసిడి 1883 డాలర్ల వద్ద నిలవగా.. వెండి 25.94 డాలర్ల వద్ద ముగిసింది. -
మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు
న్యూయార్క్/ ముంబై: ఉన్నట్టుండి పసిడి, వెండి ధరలు హైజంప్ చేశాయి. ఇన్వెస్టర్లు, ట్రేడర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో దేశ, విదేశీ మార్కెట్లో భారీగా లాభపడ్డాయి. 900 బిలియన్ డాలర్ల సహాయక ప్యాకేజీకి తాజాగా అమెరికా కాంగ్రెస్ ఒప్పందం కుదుర్చుకోవడంతో పసిడి, వెండికి ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. దీనికితోడు బ్రిటన్‌లో కరోనా వైరస్ కొత్త రూపంతో విస్తరిస్తున్నట్లు వెలువడిన వార్తలు దీనికి జత కలిసినట్లు నిపుణులు పేర్కొన్నారు. సెకండ్‌వేవ్‌లో భాగంగా ఇప్పటికే అమెరికా, యూరోపియన్ దేశాలను కోవిడ్-19 వణికిస్తున్న విషయం విదితమే. అయితే యూరోపియన్ దేశాలు ప్రస్తుతం మరింత కఠిన లాక్‌డవున్‌లకు తెరతీశాయి. దీంతో మరోసారి ఆర్థిక వ్యవస్థలపై ప్రతికూల ప్రభావం పడవచ్చన్న ఆందోళనలు పెరిగినట్లు విశ్లేషకులు తెలియజేశారు. సాధారణంగా సంక్షోభ పరిస్థితులు నెలకొన్నప్పుడు పలు దేశాల కేంద్ర బ్యాంకులతోపాటు.. గోల్డ్ ఈటీఎఫ్‌లు పసిడిలో కొనుగోళ్లకు ప్రాధాన్యత ఇచ్చే సంగతి తెలిసిందే. మరోవైపు ట్రేడర్లు సైతం లాంగ్ పొజిషన్లు తీసుకుంటున్నట్లు బులియన్ నిపుణులు పేర్కొన్నారు. వెరసి న్యూయార్క్ కామెక్స్‌లో ఔన్స్ పసిడి 1910 డాలర్లకు చేరగా.. వెండి 5.5 శాతం జంప్‌చేసింది. దేశీయంగానూ ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల బంగారం రూ. 51,000 సమీపానికి చేరగా.. వెండి కేజీ రూ. 71,000ను దాటేసింది. ఇతర వివరాలు చూద్దాం.. జోరు తీరిలా ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రూ. 613 పెరిగి రూ. 50,917 వద్ద ట్రేడవుతోంది. ఇది ఫిబ్రవరి ఫ్యూచర్స్ ధర కాగా.. తొలుత రూ. 50,515 వద్ద కనిష్టాన్ని తాకిన పసిడి తదుపరి 50,935 వద్ద గరిష్టానికి చేరింది. ఈ బాటలో వెండి కేజీ మార్చి ఫ్యూచర్స్ రూ. 3,373 దూసుకెళ్లి రూ. 71,280 వద్ద కదులుతోంది. తొలుత రూ. 68,958 వద్ద ప్రారంభమైన వెండి ఆపై ఒక దశలో రూ. రూ. 71,650 వరకూ జంప్‌చేసింది. కాగా.. దేశీయంగా గత వారం ఎంసీఎక్స్‌లో పసిడి 2 శాతం లాభంతో రూ. 50,304 వద్ద నిలవగా.. వెండి రూ. 67,907 వద్ద ముగిసింది. (పసిడి, వెండి.. 3 రోజుల లాభాలకు బ్రేక్) యమస్పీడ్.. న్యూయార్క్ కామెక్స్‌లో ప్రస్తుతం పసిడి ఔన్స్ 1.2 శాతం(16 డాలర్లు) ఎగసి 1,910 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్ మార్కెట్లోనూ 1.3 శాతం బలపడి 1,906 డాలర్లను తాకింది. వెండి మరింత అధికంగా ఔన్స్ 5.6 శాతం దూసుకెళ్లి 27.51 డాలర్ల వద్ద కదులుతోంది. పసిడి ఫిబ్రవరి కాంట్రాక్ట్‌కాగా.. వెండి మార్చి ఫ్యూచర్స్ ధరలు. గత వారం పసిడి 2.4 శాతం బలపడి 1887 డాలర్ల వద్ద నిలవగా.. వెండి 8 శాతం పుంజుకుని 26 డాలర్ల వద్ద స్థిరపడింది. (పసిడి తగ్గనుందా?.. ఇకపై కొనొచ్చా? ) సపోర్ట్స్- రెసిస్టెన్స్ ప్రస్తుతం పసిడి, వెండి దూకుడు చూపుతున్న నేపథ్యంలో పలువురు సాంకేతిక నిపుణులు 1918-1925 డాలర్ల వద్ద పసిడికి రెసిస్టెన్స్ ఎదురుకావచ్చని భావిస్తున్నారు. ఇదేవిధంగా 1874-1858 డాలర్ల స్థాయిలో సపోర్ట్స్ కనిపించవచ్చని అంచనా వేశారు. -
పుత్తడి పెరిగే ముందు.. కాస్త క్షీణత
ముంబై/లండన్: పుత్తడి ధరలు మరింత పెరిగే ముందు...ప్రస్తుతస్థాయికన్నా మరికాస్త తగ్గవచ్చని బులియన్ విశ్లేషకులు పేర్కొన్నారు. అమెరికా జాబ్స్ డేటా, రిటైల్ అమ్మకాలు, పారిశ్రామికోత్పత్తి డేటాలు మెరుగ్గా వుండటంతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ బాగా వృద్ధిచెందుతున్నట్లు అంచనాలు ఏర్పడి పుత్తడి తాత్కాలికంగా తగ్గిందని వారన్నారు. గతవారం ప్రపంచ మార్కెట్లో పుత్తడి ధర 2.9 శాతం మేర క్షీణించి 1,358 డాలర్ల నుంచి 1,327 డాలర్ల స్థాయికి దిగింది. ఈ తగ్గుదల తాత్కాలికమేనని, బ్రెగ్జిట్ కారణంగా అమెరికా కేంద్ర బ్యాంక్ వడ్డీ రేట్లను ఇప్పట్లో పెంచే అవకాశాలు లేకపోవడంతో బంగారం రానున్న వారాల్లో మళ్లీ పెరుగుతుందని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. దేశీయంగా... అంతర్జాతీయ ట్రెండ్‌ను అనుసరిస్తూ ముంబై బులియన్ మార్కెట్లో 99.9 స్వచ్ఛతగల 10 గ్రాముల బంగారం ధర గతవారం అంతక్రితం వారంతో పోలి స్తే రూ. 270 మేర క్షీణించి రూ. 31,085 స్థాయికి తగ్గింది. 99.5 స్వచ్ఛతగల పుత్తడి ధర సైతం అంతే తగ్గుదలతో రూ. 30,935 వద్ద ముగిసింది. దేశీయంగా దాదాపు రికార్డు గరిష్టస్థాయి వద్ద ట్రేడవుతున్నందున, జువెల్లర్స్, స్టాకిస్టులు, ట్రేడర్ల నుంచి డిమాండ్ తగ్గిందని బులియన్ వర్తకులు చెప్పారు.