ప్రేమజంట ఆత్మహత్యాయత్నం
సాలూరు(విజయనగరం): తమ ప్రేమను కుటుంబసభ్యులు అంగిక రించరనే భయంతో ప్రేమికులు ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. ఇది గుర్తించిన కుటుంబసభ్యులు వారిని ఆస్పత్రికి తరలించగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఈ సంఘటన విజయనగరం జిల్లా సాలూరులోని కర్రివీధిలో సోమవారం రాత్రి జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన బుల్లిపల్లి రాములు(21) లారీ క్లీనర్‌గా పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
ఈ క్రమంలో వృత్తి విద్యా కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న అదే కాలనీకి చెందిన చౌడిపల్లి జ్యోతి(16)ని ప్రేమించాడు. దీనికి ఆ అమ్మాయి కూడా అంగీకరించడంతో.. వారి జీవనం సాఫీగా సాగిపోతుండగా.. ఈ విషయాన్ని ఇంట్లో చెప్తే ఏమంటారో అనే భయంతో ఆత్మహత్య చేసుకున్నారు. ప్రేమికులిద్దరూ ఈ రోజు రాత్రి ఎవరి ఇంట్లో వాళ్లు నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకున్నారు. ఇది గమనించిన కుటుంబసభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. కాగా.. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.