పుష్కర సిబ్బంది అవస్థలు
సాక్షి ప్రతినిధి, ఏలూరు : గోదావరి అంత్య పుష్కరాలపై ప్రత్యేక హోదా బంద్ ప్రభావం పడింది. ఉదయం నుంచి బస్సులు తిరగకపోవడంతో దూర ప్రాంత భక్తులు పుష్కర స్నానాలకు రాలేకపోయారు. పుష్కర çసమీపంలోని భక్తులు మాత్రమే రావడంతో ఘాట్లన్నీ బోసిపోయాయి.అంత్య పుష్కరాల్లో మూడో రోజైన మంగళవారం అమావాస్య కావడం కూడా భక్తుల సంఖ్య తగ్గడానికి కారణమని అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఘాట్లలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడంతో వారు ఇబ్బం దులు పడుతున్నారు. కనీసం అల్పాహారం, మధ్యాహ్న భోజనం కూడా ఏర్పాటు చేయకపోవడంతో అవస్థలకు గురవుతున్నారు. పెనుగొండ మండలం సిద్ధాంతంలో ధర్మజాగరణ సమితి ఆధ్వర్యంలో గోదావరి మాతకు సంధ్యాహారతి ఇచ్చారు. పుష్కరాలు పూర్తయ్యే వరకూ ప్రతిరోజూ ఈ కార్యక్రమం నిర్వహిస్తారు.