Bundi
-
ముగిసిన సీఎం జగన్ రెండు రోజుల తిరుమల పర్యటన
సాక్షి, తిరుపతి: రెండు రోజుల తిరుమల పర్యటన ముగించుకొని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. సాలకట్ల బ్రహ్మోత్సవాల పర్యటనలో భాగంగా మంగళవారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న సీఎం జగన్‌కు మహా ద్వారం వద్ద టీటీడీ చైర్మన్, ఈఓలు స్వాగతం పలికారు. సీఎం జగన్ శ్రీవారి ధ్వజ స్తంభాన్ని నమస్కరిస్తూ ఆలయంలోకి ప్రవేశించి శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారికి బియ్యంతో తులాభారం మొక్కులు సమర్పించారు. సీఎం జగన్‌కు అర్చకులు వేద ఆశీర్వచనం ఇచ్చి, స్వామివారి తీర్ధప్రసాదాలను అందచేశారు. శ్రీవారి దర్శనం అనంతరం సీఎం జగన్.. శ్రీవేంకటేశ్వర భక్తి చానల్‌కు సంబంధించి.. కన్నడ, హిందీ చానళ్లను ప్రారంభించారు. సీఎం జగన్ వెంట మంత్రులు కొడాలి నాని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్, నారాయణ స్వామి, అనీల్ కుమార్ యాదవ్, గౌతమ్ రెడ్డి, చెల్లుబోయిన వేణుగోపాల్, ఎమ్మెల్యేలు ఉన్నారు. చదవండి: బడితోనే అమ్మఒడి బూందీ పోటును ప్రారంభించిన సీఎం జగన్ తిరుమలలో రూ.10 కోట్లతో నూతనంగా నిర్మించిన బూందీపోటు భవనాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. అటు తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నమయ్య భవన్లో రైతు సాధికార సంస్థ, టీటీడీ మధ్య జరిగే ఒప్పందం కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం జగన్ సమక్షంలో టీటీడీ, రైతు సాధికార సంస్థ మధ్య ఎంవోయూ కుదిరింది. అనంతరం శ్రీ పద్మావతి అతిధి గృహం నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు సీఎం జగన్. చదవండి: దేవదేవుడికి సీఎం పట్టువస్త్రాల సమర్పణ -
జైలులో నిద్రలేని రాత్రి గడిపా : పాయల్
గాంధీ-నెహ్రు కుటుంబాలను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారనే కారణంతో బాలీవుడ్ నటి పాయల్ రోహత్గిని రాజస్తాన్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆమె మంగళవారం సాయంత్రం బుండి సెంట్రల్ జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. తనను బయటకు తీసుకురావడానికి ప్రయత్నించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. జైలులో చాలా భయపడినట్టు చెప్పిన పాయల్.. ప్రస్తుతం చాలా సంతోషంగా ఉందని వెల్లడించారు. జైలులో రాత్రి నిద్ర పట్టలేదని.. చాలా భయమేసిందని చెప్పారు. ‘నేను ఎప్పుడు దేశం గురించే ఆలోచిస్తాను. అలాగే చరిత్రను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. కానీ అకారణంగా జైలుకు వెళ్లాలని కోరుకోను. భవిష్యత్తులో వీడియోలు తీయడం మానుకోను. ఇకపై మరోసారి తప్పు జరగకుండా ఉండేందుకు ప్రయత్నిస్తాను. నెహ్రు కుటుంబంపై నేను చేసిన వీడియో.. చిక్కులు తీసుకువస్తుందని అనుకోలేదు. నాకు చట్టాలపై అంతగా అవగాహన లేదు. చట్టపరమైన సమస్యలు ఎదురుకాకుండా.. భావ ప్రకటన స్వేచ్ఛని సద్వినియోగం చేసుకుంటాను. న్యాయవ్యవస్థకు చాలా ధన్యవాదాలు’ అని పాయల్ చెప్పారు. జైలులో గడిపిన అనుభవం గురించి మాట్లాడుతూ.. ‘నన్ను లేడీస్ జనరల్ వార్డ్‌లో ఉంచారు. అక్కడ చాలా చలిగా ఉండటంతో.. రాత్రి అంతా నిద్ర లేకుండా గడిపాను. చాపపై పడుకున్నాను. అక్కడి పరిస్థితులు చూస్తే చాలా భయమేసింది. జైలులో ఆహారం అసలు బాగోలేదు. కానీ స్పైసీ ఫుడ్ కోరుకునే వారికి అది బాగుంటుంది. నేను జైలుకు వెళ్లడం మొదటిసారి.. ఇదే చివరిసారి కూడా అవుతుందని అనుకుంటాన’ని తెలిపారు. -
‘రాష్ట్రపతి మేకలను మేపడానికి వెళ్లాడు!’
బుండీ: ‘రాష్ట్రపతి మేకలను మేపడానికి వెళ్లాడు. ప్రధానమంత్రి సరుకులు తీసుకురావడానికి బజారుకు పోయాడు’.... విస్తీర్ణం పరంగా దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన రాజస్తాన్‌లోని బుండీ జిల్లాకు వెళితే మీకు ఇలాంటి మాటలు వినిపించొచ్చు. వాటిని విని ఆశ్చర్యపోకండి. ఎందుకంటే అక్కడ మరింత ఆశ్చర్యకరమైన విషయం ఇంకొకటి ఉంది. అదేంటంటే అత్యున్నత స్థాయి పదవులు, కార్యాలయాలు, ప్రముఖ ఉత్పత్తుల పేర్లే ఈ జిల్లాలోని చాలా మందికి పేర్లుగా ఉంటాయి. కొంతమంది సిమ్‌కార్డు, శామ్సంగ్, ఆండ్రాయిడ్, మిస్‌కాల్, హైకోర్టు తదితరాలను తమ పేర్లుగా పెట్టుకుంటారు. జిల్లా కేంద్రానికి 10 కి.మీ దూరంలో రామ్‌నగర్ అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఓసారి జిల్లా కలెక్టర్ పర్యటిస్తుండగా, ఆయన తెలివికి ముగ్దురాలైన ఓ మహిళ తన మనవడికి కలెక్టర్ అని పేరు పెట్టింది. కానీ ఆమె మనవడు ఎప్పుడూ కనీసం పాఠశాలకు వెళ్లి చదువుకోలేదు. అలాగే మరికొంత మందికి ఐజీ, ఎస్పీ, హవాల్దార్, మెజిస్ట్రేట్ లాంటి పేర్లు కూడా ఉంటాయి.