Burger Business
-
రూ.20 వేలతో రూ.100 కోట్లు సంపాదించొచ్చా..?
బాగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించాలనేది ఒకప్పటి మాట. కానీ చదువు అనంతరం మంచి బిజినెస్ ఐడియాతో కోట్లు గడించవచ్చనేది నేటి ట్రెండ్. చాలా మంది యువత మంచి బిజినెస్ ఐడియాతో తాము అప్పటివరకు చేస్తున్న ఉద్యోగాన్ని సైతం వదిలి సొంతంగా వ్యాపారం మొదలుపెడుతున్నారు. కోట్లల్లో టర్నోవర్ చేస్తూ చాలా మందికి ఉపాధి కల్పిస్తున్నారు. బెంగళూరులోని ఇన్ఫోసిస్‌లో బిరాజా రౌత్ ఆయన 21వ ఏట సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తుండేవాడు. ఆయనకు బర్గర్లంటే చాలా ఇష్టం. ఒక మంచి భారతీయ బ్రాండ్ బర్గర్లను తయారు చేసి విక్రయించాలనే ఆలోచన వచ్చింది. దాంతో 2011లో తన టెక్ ఉద్యోగానికి రాజీనామా చేసి కేవలం రూ.20 వేలు పెట్టుబడితో చిన్నస్థాయిలో తన వ్యాపారాన్ని ప్రారంభించాడు. తొలుత తాను పనిచేసిన ఆఫీసు సమీపంలో రోడ్డుపై కియోస్క్ ఏర్పాటు చేసి బర్గర్లు అమ్మడం మొదలుపెట్టాడు. రౌత్ గతంలో పనిచేసిన కంపెనీలోని తన సహచర ఉద్యోగులు, మిత్రులు తొలుత కస్టమర్లుగా మారారు. ఆయన తయారుచేస్తున్న గ్రిల్డ్ బర్గర్ రుచి నచ్చటంతో సమీపంలోని కంపెనీల్లో పనిచేస్తున్న వారుసైతం ఆయన బిజినెస్‌కు కస్టమర్లుగా మారారు. దాంతో బెంగళూరులో రౌత్ తయారుచేస్తున్న బర్గర్ మెక్‌డొనాల్డ్స్, కేఎఫ్‌సీ, బర్గర్ కింగ్ వంటి బ్రాండ్లకు గట్టి పోటీనిచ్చే స్థాయికి ఎదిగింది. దాంతో అతడు ‘బిగ్గీస్ బర్గర్’ పేరుతో కొత్త బ్రాండ్‌ను సృష్టించి దాని ద్వారా తన వ్యాపారం సాగించాడు. అలా ఎలక్ట్రానిక్ సిటీలో అతడు వ్యాపారం ప్రారంభించిన చోటుకు నగరంలోని చాలా మంది కస్టమర్లు బర్గర్ రుచి చూసేందుకు వచ్చేవారు. ఇదీ చదవండి: ‘రష్యా నుంచి చమురు దిగుమతి చేయకపోతే..’ కేంద్రం కీలక వ్యాఖ్యలు అలా ఫుడ్ లవర్స్ మనసు గెలుచుకోవటంతో బిగ్గీస్ బర్గర్ క్రమంగా లాభాలను ఆర్జించడం ప్రారంభించింది. 2023 నాటికి బిగ్గీస్ బర్గర్ కంపెనీ ఆదాయం రూ.100 కోట్లకు చేరుకుంది. ప్రస్తుతం రౌత్ తన వ్యాపారాన్ని టైర్-2,3 నగరాలకు విస్తరించాలనే యోచిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం బిగ్గీస్ బర్గర్ 14 రాష్ట్రాల్లోని 28 నగరాల్లో 130 శాఖలను విస్తరించింది. 2024లో వీటి సంఖ్యను 350కి పెంచాలని చూస్తున్నారు. -
నేటి నుంచి బెక్టర్స్ ఫుడ్.. పబ్లిక్ ఇష్యూ
ముంబై, సాక్షి: ప్రీమియం బిస్కట్ల తయారీ కంపెనీ బెక్టర్స్ ఫుడ్ స్పెషాలిటీస్ పబ్లిక్ ఇష్యూ నేడు(15న) ప్రారంభమైంది. 17న(గురువారం) ముగియనున్న ఇష్యూకి ధరల శ్రేణి రూ. 286-288కాగా.. తద్వారా రూ. 540 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఐపీవోలో భాగంగా సోమవారం యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 162 కోట్లు సమకూర్చుకుంది. షేరుకి రూ. 288 ధరలో హెచ్డీఎఫ్సీ లైఫ్, గోల్డ్‌మన్ శాక్స్, ఫ్రాంక్లిన్ ఇండియా స్మాలర్, ఎస్బీఐ డెట్ హైబ్రిడ్ తదితర 7 ఎంఎఫ్లకు షేర్లను కేటాయించింది. ఐపీవోలో భాగంగా కంపెనీలో ఇప్పటికే ఇన్వెస్ట్ చేసిన సంస్థలు వాటాలను విక్రయించనున్నాయి. ఐపీవో నిధులను విస్తరణ వ్యయాలు, తదితర సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో పేర్కొంది. రాజ్‌పురా యూనిట్లో బిస్కట్ల తయారీకి కొత్త లైన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేసింది. (బర్గర్ కింగ్ ఐపీవో.. స్పందన సూపర్) దిగ్గజ కస్టమర్లు బర్గర్ కింగ్, మెక్‌డొనాల్డ్స్, కేఎఫ్‌సీ, పిజ్జా హట్ తదితర గ్లోబల్ ఫాస్ట్‌ఫుడ్ చైన్స్(క్యూఎస్ఆర్)కు బెక్టర్ ఫుడ్స్ బన్స్ సరఫరా చేస్తోంది. బెక్టర్స్ క్రీమికా పేరుతో సొంతంగా ప్రీమియం బిస్కట్లను తయారు చేస్తోంది. ఇంగ్లీష్ ఒవెన్ బ్రాండుతో సొంత బ్యాకరీ ప్రొడక్టులను సైతం రూపొందిస్తోంది. లూధియానాకు చెందిన కంపెనీ ఇంతక్రితం 2018లోనూ పబ్లిక్ ఇష్యూ ప్రయత్నాలు చేసింది. సెబీ అనుమతించినప్పటికీ మార్కెట్ పరిస్థితులు అనుకూలించకపోవడంతో విరమించుకుంది. (బర్గర్ కింగ్ లిస్టింగ్.. అ‘ధర’హో) పోటీ ఎక్కువే.. లిస్టెడ్ దిగ్గజాలు ఐటీసీ, బ్రిటానియాతోపాటు.. పార్లే ఇండియా, మోడర్న్, హార్వెస్ట్ గోల్డ్ కంపెనీలతో బెక్టర్స్ ఫుడ్ పోటీ పడుతోంది. గ్లోబల్ ఫాస్ట్‌ఫుడ్ చైన్స్‌కు భారీ స్థాయిలో బన్స్ సరఫరా చేయడంతోపాటు.. ఫ్రోజెన్ డఫ్ విభాగంలోకీ ప్రవేశించింది. తద్వారా ఈ విభాగంలో మార్కెట్ లీడర్‌గా ఉన్న బేకర్స్ సర్కిల్‌తో పోటీని ఎదుర్కొంటోంది. 2019 మార్చికల్లా బెక్టర్స్ ఫుడ్ ఆదాయం రూ. 762 కోట్లను తాకింది. రూ. 30 కోట్ల నికర లాభం ఆర్జించింది. దేశీయంగా బిస్కట్లు, బేకరీ ప్రొడక్టుల రిటైల్ మార్కెట్ విలువ 7 బిలియన్ డాలర్లు(సుమారు రూ. 52,000 కోట్లు)గా అంచనా. గత ఐదేళ్లలో వార్షికంగా 9 శాతం వృద్ధిని సాధిస్తూ వస్తోంది. మార్కెట్ విలువలో బిస్కట్లు, రస్కులు, వేఫర్స్, కేకులు 89 శాతం వాటాను ఆక్రమిస్తున్నాయి. బన్నులు, పిజ్జా బేస్‌లు తదితరాల వాటా 11 శాతమని పరిశ్రమ నిపుణులు తెలియజేశారు! -
బర్గర్‌కింగ్ పుష్- బెక్టర్స్ ఫుడ్ ఐపీవోకు రెడీ
ముంబై, సాక్షి: ప్రీమియం బిస్కట్ల తయారీ కంపెనీ బెక్టర్స్ ఫుడ్ స్పెషాలిటీస్ పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. వచ్చే వారం ఐపీవో చేపట్టనున్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇటీవల గ్లోబల్ దిగ్గజం బర్గర్ కింగ్ పబ్లిక్ ఇష్యూ ఏకంగా 157 రెట్లు అధికంగా సబ్స్క్రిప్సన్ సాధించిన నేపథ్యంలో బెక్టర్స్ ఫుడ్ సన్నాహాలు వేగవంతమైనట్లు తెలియజేశాయి. బర్గర్ కింగ్, మెక్‌డొనాల్డ్స్, కేఎఫ్‌సీ, పిజ్జా హట్ తదితర గ్లోబల్ ఫాస్ట్‌ఫుడ్ చైన్స్‌కు కంపెనీ బన్స్ సరఫరా చేస్తుండటం ప్రస్తావించదగ్గ అంశం! కంపెనీ బెక్టర్స్ క్రీమికా పేరుతో ప్రీమియం బిస్కట్లను తయారు చేస్తోంది. ఇంగ్లీష్ ఒవెన్ బ్రాండుతో బ్యాకరీ ప్రొడక్టులను సైతం రూపొందిస్తోంది. 2018లోనూ.. పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి బెక్టర్స్ ఫుడ్ స్పెషాలిటీస్ త్వరితగతిన అనుమతులు సంపాదించింది. ఒక ప్రయివేట్ రంగ కంపెనీగా 29 రోజుల్లోనే గ్రీన్‌సిగ్నల్ సాధించినట్లు మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో ఈ నెల 15కల్లా ఐపీవో ప్రారంభమయ్యే వీలున్నట్లు తెలియజేశాయి. లూధియానాకు చెందిన కంపెనీ ఇంతక్రితం 2018లోనూ పబ్లిక్ ఇష్యూ ప్రయత్నాలు చేసింది. సెబీ అనుమతించినప్పటికీ మార్కెట్ పరిస్థితులు అనుకూలించకపోవడంతో విరమించుకుంది. తాజా ఇష్యూలో భాగంగా సీఎక్స్ పార్టనర్స్, గేట్‌వే పార్టనర్స్ కంపెనీలో కొంతమేర వాటాను విక్రయించనున్నట్లు తెలుస్తోంది. ఐపీవో ద్వారా రూ. 550 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. కంపెనీ షేర్లు బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో లిస్ట్ కానున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. దిగ్గజాలతో పోటీ లిస్టెడ్ దిగ్గజాలు ఐటీసీ, బ్రిటానియాతోపాటు.. పార్లే ఇండియా, మోడర్న్, హార్వెస్ట్ గోల్డ్ కంపెనీలతో బెక్టర్స్ ఫుడ్ పోటీ పడుతోంది. గ్లోబల్ ఫాస్ట్‌ఫుడ్ చైన్స్‌కు భారీ స్థాయిలో బన్స్ సరఫరా చేయడంతోపాటు.. ఫ్రోజెన్ డఫ్ విభాగంలోకీ ప్రవేశించింది. తద్వారా ఈ విభాగంలో మార్కెట్ లీడర్‌గా ఉన్న బేకర్స్ సర్కిల్‌తో పోటీని ఎదుర్కొంటోంది. 2019 మార్చికల్లా బెక్టర్స్ ఫుడ్ ఆదాయం రూ. 762 కోట్లను తాకింది. రూ. 30 కోట్ల నికర లాభం ఆర్జించింది. దేశీయంగా బిస్కట్లు, బేకరీ ప్రొడక్టుల రిటైల్ మార్కెట్ విలువ 7 బిలియన్ డాలర్లు(సుమారు రూ. 52,000 కోట్లు)గా అంచనా. గత ఐదేళ్లలో వార్షికంగా 9 శాతం వృద్ధిని సాధిస్తూ వస్తోంది. మార్కెట్ విలువలో బిస్కట్లు, రస్కులు, వేఫర్స్, కేకులు 89 శాతం వాటాను ఆక్రమిస్తున్నాయి. బన్నులు, పిజ్జా బేస్‌లు తదితరాల వాటా 11 శాతమని పరిశ్రమ నిపుణులు తెలియజేశారు! -
యువరాజ్ ‘బర్గర్’ వ్యాపారం
స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ బర్గర్ల వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. అమెరికాలోని కార్ల్స్ జూనియర్ అనే బర్గర్ల చెయిన్ కంపెనీలో యువీ పెట్టుబడి పెట్టాడు. త్వరలోనే ఈ కంపెనీ భారత్‌లో కూడా తమ మొదటి స్టోర్‌ను ప్రారంభించనుంది. పారిస్ హిల్టన్, కిమ్ కర్దాషియాన్లాంటి హాలీవుడ్ సెలబ్రిటీలు ఈ కంపెనీతో పనిచేస్తుండగా... ఇకపై యువరాజ్ కూడా దీనికి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తాడు. గత నెలలో యువీ జెట్‌సెట్‌గో అనే ఆన్లైన్ కంపెనీలోనూ పెట్టుబడులు పెట్టాడు.