bus depo
-
గుడివాడ బస్టాండ్ డిపో గ్యారేజ్ ప్రారంభం
-
అన్ని ప్రధాన రైల్వేస్టేషన్లలో మట్టికప్పుల్లోనే చాయ్!
న్యూఢిల్లీ: ఇకపై ప్రధాన రైల్వే స్టేషన్లు, బస్ డిపోల వద్ద ఉన్న స్టాళ్లు, ఎయిర్‌పోర్టులు, మాల్స్‌లో మట్టి కప్పుల్లో చాయ్‌ని ఆస్వాదించవచ్చు. ఈమేరకు కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ.. రైల్వే మంత్రి పీయూష్ గోయల్‌కు లేఖ రాశారు. ప్రస్తుతం వారణాసి, రాయ్‌బరేలీ రెండు రైల్వే స్టేషన్లలో మాత్రమే కేటరర్లు ఈ మట్టి కప్పుల్లో చాయ్‌ను అందిస్తున్నారు. ‘సుమారు 100 రైల్వే స్టేషన్లలో, ఎయిర్‌పోర్టులు, రాష్ట్రాల్లోని బస్ డిపోల వద్ద ఉన్న టీ స్టాళ్లలో మట్టి కప్పుల్లోనే చాయ్‌ను అందించడాన్ని తప్పనిసరి చేయాలని గోయల్‌కు లేఖ రాశాను. దీంతో స్థానిక తయారీదారులకు మార్కెట్ లభించడంతో పాటు పర్యావరణానికి హాని కలిగించే పేపర్, ప్లాస్టిక్‌ల వాడకాన్ని నిషేధించినట్లవుతుందని వివరించారు. -
డిపో ఎదుట డ్రైవర్ ఆత్మహత్యాయత్నం
మెదక్(సంగారెడ్డి): సంగారెడ్డి ఆర్టీసీ డిపో ఎదుట ఓ ఆర్టీసీ డ్రైవర్ ఒంటిమీద కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయబోయాడు. వెంటనే పోలీసులు అప్రమత్తమై డ్రైవర్ నుంచి కిరోసిన్ డబ్బా లాక్కోవడంతో ప్రమాదం తప్పింది. సమ్మెలో భాగంగా ఆర్టీసీ ఉద్యోగులు సంగారెడ్డి డిపోలో దీక్ష చేపట్టారు. ఎట్టి పరిస్థితిల్లో ఈ రోజు బస్సు నడిపించి తీరతామని పోలీసులు చెప్పడంతో డ్రైవర్ ఆత్మహత్యాయత్నం చేయబోయాడు. -
ప్రకాశం ఆర్టీసీ కార్మికుల సమ్మె
ప్రకాశం: ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మెతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ప్రైవేటు వ్యక్తులతో బస్సులను నడిపించి ప్రయాణికుల ఇక్కట్లు తీర్చాలనుకున్న అధికారుల ప్రయత్నాలు ఫలించలేదు. ప్రకాశం జిల్లా ఒంగోలులో బుధవారం ఉదయం నుంచి ఆర్టీసీ కార్మికులు డిపోల ఎదుట ధర్నాలు నిర్వహించారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. -
నిజామాబాద్ ఆర్టీసీ కార్మికుల సమ్మె
నిజామాబాద్: ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఫిట్మెంట్ ఇవ్వాలంటూ సమ్మె బాట పట్టిన ఆర్టీసీ కార్మికులు డిపోల ముందు ధర్నాలు నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా బోధన్ డిపో ఎదుట బుధవారం పలు కార్మికుల సంఘాల సభ్యులు బైఠాయించారు. ప్రైవేటు డ్రైవర్లతో ఆర్టీసీ వాహనాలు నడిపి ప్రజలను ప్రమాదాల బారిన పడేయడం తగదని... ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.