bus fell into river
-
మధ్యప్రదేశ్ బస్సు ప్రమాదం ఫోటోలు
-
54 మంది ప్రయాణికులు.. కెనాల్లో పడ్డ బస్సు
-
కెనాల్లో బస్సు బోల్తా.. 45 మంది మృతి
భోపాల్: మధ్యప్రదేశ్‌లో విషాదం చోటుచేసుకుంది. 54 మంది ప్రయాణీకులతో వెళ్తున్న ఓ బస్సు కెనాల్లో పడిపోయింది. ఈ ఘటనలో 45 మంది మరణించారు. వీరిలో 20 మంది మహిళలు, 24 మంది పురుషులు, ఒక చిన్నారి ఉన్నట్లు సమాచారం. ఏడుగుర మాత్రం సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం ప్రకారం సిధి నుంచి సత్నాకు వెళ్తున్న సమయంలో అదుపు తప్పి వంతెనపై నుంచి బస్సు ఒక్కసారిగా నీళ్లలో పడి మునిగిపోయింది. ఈ ప్రమాదంపై స్పందించిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని సిధి జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. మృతిచెందిన కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఈ ఘటనపై దర్యాప్తు జరపాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు సీఎం ఆఫీస్ ఓఎస్డీ సత్యేంద్ర ఖరే ఓ ప్రకటనలో చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో జరగాల్సిన వర్చువల్ మీటింగ్‌ను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. కాగా ప్రమాద సమయంలో కెనాల్లో నీటి మట్టం ఎక్కువగా ఉండటంతో బస్సు వేగంగా కొట్టుకుపోయిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. చదవండి: ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం -
నదిలో బోల్తాపడిన బస్సు:14 మంది మృతి
ఖాట్మాండ్: ఓ బస్సు నదిలో బోల్తాపడటంతో 14 మంది మృతి చెందిన ఘటన నేపాల్ లో గురువారం ఉదయం సంభవించింది. ఈ ప్రమాదంలో భారీ సంఖ్యలో ప్రయాణికులు మృత్యవాత పడగా, ఏడుగురికి తీవ్ర గాయాలైయ్యాయి. 20 మందికి పైగా ప్రయాణికులతో వెళుతున్న బస్సు పల్పా జిల్లాలోని చిదిపానీ లో ఉన్న కాళుకోలా నదిలోకి దూసుకుపోవడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో గాయపడిన ప్రయాణికులకు స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని పోలీస్ అధికారి శివ కుమార్ శ్రేష్టా తెలిపారు. స్థానికులతో కలిసి పోలీసు, ఆర్మీ బలగాలు సహాయక చర్యలు చేపట్టాయన్నారు. రోడ్డు మార్గాలు సరిగా లేకపోవడం, డ్రైవర్లకు సరైన శిక్షణ లేకపోవడం, బస్సుల్లో అధిక సంఖ్యలో ప్రయాణికులను ఎక్కించడం వంటి కారణాలే తరచు ప్రమాదాలు జరగడానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.