ఖాట్మాండ్: ఓ బస్సు నదిలో బోల్తాపడటంతో 14 మంది మృతి చెందిన ఘటన నేపాల్ లో గురువారం ఉదయం సంభవించింది. ఈ ప్రమాదంలో భారీ సంఖ్యలో ప్రయాణికులు మృత్యవాత పడగా, ఏడుగురికి తీవ్ర గాయాలైయ్యాయి. 20 మందికి పైగా ప్రయాణికులతో వెళుతున్న బస్సు పల్పా జిల్లాలోని చిదిపానీ లో ఉన్న కాళుకోలా నదిలోకి దూసుకుపోవడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో గాయపడిన ప్రయాణికులకు స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని పోలీస్ అధికారి శివ కుమార్ శ్రేష్టా తెలిపారు. స్థానికులతో కలిసి పోలీసు, ఆర్మీ బలగాలు సహాయక చర్యలు చేపట్టాయన్నారు.
రోడ్డు మార్గాలు సరిగా లేకపోవడం, డ్రైవర్లకు సరైన శిక్షణ లేకపోవడం, బస్సుల్లో అధిక సంఖ్యలో ప్రయాణికులను ఎక్కించడం వంటి కారణాలే తరచు ప్రమాదాలు జరగడానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.