ఘోర రోడ్డు ప్రమాదం: ఆరుగురి మృతి
గోద్రా: గుజరాత్ లోని గోద్రా-దాహోద్ రహదారిపై ఆగిఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మరో 22 మంది గాయపడ్డారు. మృతుల్లో 5 నుంచి 12 ఏళ్లలోపు ఉన్న ఇద్దరు పిల్లలు, ఇద్దరు మహిళలు ఉన్నారు. బస్సు అతి వేగమే కారణమని తెలుస్తోంది. పంచమహల్ జిల్లాలోని గోద్రా పట్టణానికి 10 కి.మీ దూరంలోని ఒర్వాడా గ్రామ సమీపంలో ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో ఈ ఘోర ప్రమాదం సంభవించిందని పంచమహల్ తాలూకా ఇన్స్పెక్టర్ తెలిపారు.