bus slipped
-
సూపర్ లగ్జరీ బస్సు బోల్తా: డ్రైవర్ మృతి
సదాశివనగర్: వేగంగా వెళ్తున్న సూపర్ లగ్జరీ బస్సు అదుపుతప్పి బోల్తాకొట్టిన ఘటనలో డ్రైవర్ మృతిచెందాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా సదాశివనగర్ మండలం దగ్గి గ్రామ శివారులో గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వెళ్తున్న సూపర్ లగ్జరీ బస్సు దగ్గి వద్దకు రాగానే అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని ఆ వెంటనే పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ శ్రీనివాస్‌రెడ్డి(40) అక్కడికక్కడే మృతిచెందాడు. -
కాలేజీ బస్సు బోల్తా... 26 మందికి గాయాలు
దువ్వూరు: ఓ ప్రైవేట్ కళాశాల బస్సు బోల్తా పడిన ఘటనలో 26 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. ఈ ఘటన వైఎస్సార్ జిల్లా దువ్వూరు మండలం టంగుటూరుమెట్ట సమీపంలో చోటుచేసుకుంది. ప్రొద్దుటూరుకు చెందిన రాయలసీమ వ్యాయామ కళాశాల విద్యార్థులు మూడు బస్సుల్లో విహార యాత్రలో భాగంగా అహోబిలం వెళుతున్నారు. శుక్రవారం తెల్లవారుజామున దువ్వూరు మండలం టంగుటూరుమెట్ట వద్ద గొర్రెల మందను తప్పించే క్రమంలో ఇందులోని ఓ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. 26 మంది విద్యార్థులకు గాయాలు కాగా వీరికి చికిత్స అందించేందుకు దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. ఇందులో ఆరుగురికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. -
బస్సు బోల్తా: పది మందికి గాయాలు
కోడుమూరు(కర్నూలు): కర్నూలు జిల్లా కోడుమూరు మండలం వెంకటగిరి సమీపంలో బస్సు బోల్తా పడిన ఘటనలో పది మంది గాయాలపాలయ్యారు. డోన్ డిపో ఆర్టీసీ బస్సు బుధవారం సాయంత్రం సుమారు 40 మంది ప్రయాణికులతో కోడుమూరు నుంచి లద్దగిరి వైపు వెళుతోంది. వెంకటగిరి సమీపంలో ఆటోను తప్పించే క్రమంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోవటంతో బస్సు రోడ్డు పక్కన గుంతలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. దీంతో 10 మంది ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను కోడుమూరు ఆస్పత్రికి తరలించారు. -
పెళ్లి బస్సు బోల్తా, 15 మంది మృతి
భోపాల్: మధ్యప్రదేశ్ లోని హోషాంగాబాద్లో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 15 మంది మృతిచెందినట్లు తెలుస్తోంది. పెళ్లి బృందంతో వెళ్తున్న ఓ బస్సు హోషాంగాబాద్ సమీపంలో ప్రమాదవశాత్తూ అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న 15 మంది మృతిచెందగా, మరికొంత మందికి తీవ్ర గాయాలయినట్లు సమాచారం అందింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
ఆర్టీసీ బస్సు బోల్తా: 30 మందికి గాయాలు
శ్రీకాకుళం(కంచిలి): శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలంలో ఆర్టీసీ బస్సు బోల్తా కొట్టింది. ఈ ఘటనలో 30 మంది గాయపడగా, మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదం కంచిలి మండలంలోని కొత్తఅంపురం చెరువు వద్ద శుక్రవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. పలాస డిపోకు చెందిన పల్లెవెలుగు బస్సు సోంపేట నుంచి కంచిలి మీదగా గంగాధరపురం వెళుతుండగా కొత్తఅంపుర వద్ద ఆటోను తప్పించబోయి బోల్తా కొట్టింది. దీంతో బస్సులోని 30 మంది ప్రయాణీకులు గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద సమయంలో బస్సులో దాదాపు 50 మంది ప్రయాణీకులు ఉన్నట్లు సమాచరం. గాయపడిన వారు స్థానిక ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. -
ఆర్టీసీ బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు
కొత్తూరు: మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు మండలం నందిగామ వద్ద మంగళవారం మధ్యాహ్నం ఓ ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో పది మందికి తీవ్ర గాయాలు కాగా, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. సికింద్రాబాద్ పికెట్ డిపోకు చెందిన బస్సు కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్ జిల్లా సిందనూరుకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను షాద్‌నగర్ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. -
కాలువలో పడ్డ బస్సు.. 40 మందికి గాయాలు
మహబూబ్‌నగర్: వేగంగా వెళ్తున్న బస్సు లారీని ఢీకొని కాలువలో పడ్డ సంఘటనలో 40 మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన జిల్లాలోని దేవరకద్ర-చింతకుంట మధ్య గల బండర్‌పల్లి వంతెనపై మంగళవారం రాత్రి జరిగింది. కర్ణాటక నుంచి హైదరాబాద్ వస్తున్న కర్ణాటక ఆర్టీసీ బస్సు లారీని ఢీకొని కాలువలో పడింది. కాలువ ఎక్కువ లోతు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటన సమాచారం అందుకున్న స్థానికులు క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలయాల్సి ఉంది.