bus stage
-
ప్యాలకుర్తి వద్ద రోడ్డు ప్రమాదం
- ఇద్దరికి తీవ్ర గాయాలు - 108 రాకపోవడంతో ట్రాలీ ఆటోలో ఆస్పత్రికి తరలింపు కోడుమూరు రూరల్: కోడుమూరు–కర్నూలు రహదారిపై ప్యాలకుర్తి గ్రామం వద్ద బుధవారం చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలు కాగా, ఆరుగురు స్వల్పంగా గాయపడ్డారు. కల్లూరు మండలం పెద్దపాడుకు చెందిన రాఘవేంద్ర, ఈరన్న, రమణమ్మ, వెంకటలక్ష్మీ ఆటోలో కోడుమూరు వైపు వస్తుండగా..గోనెగండ్లకు చెందిన కౌలుట్లయ్య, క్రిష్ణమూర్తి, హుసేన్‌సాహెబ్, రంగడులతో పాటు మరో 6మంది ప్రయాణికులు టాటాఐస్ వాహనం కర్నూలుకు వెళుతున్నారు. ప్యాలకుర్తి బస్‌స్టేజి సమీపాన వంతెన వద్ద రెండు ఆటోలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాదంలో పెద్దపాడు చెందిన ఆటో డ్రైవర్ ఈరన్నకు రెండు కాళ్లు విరిగిపోగా, రాఘవేంద్ర ఒక చేయి, కాలు విరిగి తీవ్రంగా గాయపడ్డారు. గోనెగండ్ల వాసులకు స్వల్పగాయాలయ్యాయి. ఈ మేరకు కోడుమూరు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకోని 108 రోడ్డు ప్రమాదం జరిగిన విషయాన్ని 108 సిబ్బందికి ఫోన్ చేసినప్పటికీ సకాలంలో అంబులెన్స్ చేరుకోలేదు. దీంతో ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులను ఒక ట్రాలీ ఆటోలో స్థానికులు, పోలీసులు కర్నూలుకు తరలించారు. అసంపూర్తి రోడ్డు నిర్మాణం వల్లే.. ప్యాలకుర్తి బస్‌స్టేజి సమీపంలోని వంతెన వద్ద పూర్తిగా రోడ్డు నిర్మాణాలను చేపట్టకుండా కాంట్రాక్టర్ అసంపూర్తిగా వదిలేశారు. దీంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గతంలోనూ ఇదే ప్రాంతంలో ఇన్నోవా, ద్విచక్రవాహంన ఢీకొని ఒక యువకుడు దుర్మరణం చెందాడు. తిరిగి ఇదే ప్రాంతంలో ప్రమాదం చోటు చేసుకుంది. -
కేసు..తీర్పు.. సంచలనం
జిల్లాలో సంచలనం రేపిన టీడీపీ నాయకుడు, దేవనకొండ జెడ్పీటీసీ మాజీ సభ్యుడు కప్పట్రాళ్ల వెంకటప్పనాయుడు హత్య కేసులో నిందితులు 17 మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ ఆదోని రెండవ అదనపు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి సుబ్రమణ్యం బుధవారం తీర్పు వెలువరించారు. 2008 మే 17న కప్పట్రాళ్ల వెంకటప్ప నాయడు సహా 10 మంది దేవనకొండ మండలం మాచాపురం బస్సు స్టేజీ సమీపంలో హత్యకు గురయ్యారు. 48 మందిపై కేసు నమోదైంది. ఆరు సంవత్సరాల సుదీర్ఘ విచారణ సాగింది. 26 మందిని నిర్దోషులుగా కోర్టు ప్రకటించింది. తీర్పు నేపథ్యంలో ఆదోని కోర్టు ఆవరణలో భారీగా పోలీసులను మోహరించడంతోపాటు కప్పట్రాళ్ల గ్రామానికి అదనపు బలగాలను తరలించారు. జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ ఆదోని కోర్టుకు స్వయంగా వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. రెండు ప్రధాన వర్గాల మధ్య చోటుచేసుకున్న సంఘటనకు సంబంధించిన తీర్పు దృష్ట్యా శాంతిభద్రతలు అదుపు తప్పకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీతో పాటు ఆదోని డీఎస్పీ బీఆర్ శ్రీనివాసులు, ఆరుగురు సీఐలు, 20 మంది ఎస్ఐలు, 100 మంది పోలీసు, సాయుధ బలగాలు బందోబస్తు నిర్వహించారు. మిన్నంటిన రోదనలు : తమ కుటుంబ సభ్యులు జీవిత ఖైదు పడి జైలుకు వెళ్తుండడంతో బంధువుల రోదనలు ఆదోని కోర్టు ఆవరణలో మిన్నంటాయి. మమ్ములను విడిచి వెళ్లిపోతున్నారు.. ఇక మాకింకెవరు దిక్కంటూ గుండెలు పగిలేలా రోదించారు. కోర్టు తీర్పు వెలువడిన వెంటనే కోర్టు బయట ఉన్న కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు కోర్టు ఆవరణలోకి విలపిస్తూ వచ్చారు. వారిని పోలీసులు అదుపు చేయడంతో రోడ్డుపైనే బైఠాయించారు. తమ తండ్రులు జైలు కెళ్తున్నారని తెలుసుకొని చిన్నారులు గుక్కపట్టి ఏడ్చారు. తమ వాళ్లు ఏ అన్యాయం చేయలేదని, అన్యాయంగా శిక్ష విధించారని తమ ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. కొంతమంది మహిళలు రోదిస్తూ సృ్పహ తప్పి పడిపోయారు. ముద్దాయిలను సబ్‌జైలుకు తీసుకెళ్లే వరకు కుటుంబ సభ్యులను దూరంగా ఉంచారు.