Business and commercial establishments
-
అభివృద్ధి భాగస్వామి బంగ్లాదేశ్
న్యూఢిల్లీ: సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం(సీఈపీఏ)పై చర్చలు ప్రారంభించాలని, ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకొనే దిశగా ప్రణాళిక రూపొందించుకోవాలని భారత్, బంగ్లాదేశ్ నిర్ణయించుకున్నాయి. రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత్ వచ్చిన బంగ్లా ప్రధానమంత్రి షేక్ హసీనాతో శనివారం ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలు, వ్యాపార వాణిజ్యపరమైన అంశాలపై విస్తృతంగా చర్చించారు. మయన్మార్ పరిణామాలతోపాటు రోహింగ్యా కాందిశీకుల అంశంపై అభిప్రాయాలు పంచుకున్నారు. అనంతరం సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. భారత్‌కు బంగ్లాదేశ్ అతిపెద్ద అభివృద్ధి భాగస్వామి అని మోదీ అన్నారు. బంగ్లాదేశ్‌తో సంబంధ బాంధవ్యాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలను ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా సీఈపీఏపై చర్చలు ప్రారంభించామని నిర్ణయించినట్లు తెలిపారు. రక్షణ రంగంలో పరస్పర సహకారంపై విస్తృతంగా చర్చించామన్నారు. రక్షణ ఉత్పత్తుల తయారీ, సైనిక దళాల ఆధునీకరణ విషయంలో ఇరుదేశాలు సహకరించుకోవాలని ఆకాంక్షించారు.భారత్ విశ్వసనీయ మిత్రదేశం: హసీనా ఇండో–పసిఫిక్ కార్యక్రమంలో చేరాలన్న బంగ్లాదేశ్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని మోదీ చెప్పారు. ‘‘ఇరు దేశాల బంధానికి పౌరుల మధ్య సంబంధాలే పునాది. వైద్య సేవల కోసం వచ్చే బంగ్లా పౌరులకు ఈ–మెడికల్ వీసా కలి్పస్తాం. బంగ్లాదేశ్‌లోని రంగపూర్‌లోని కొత్తగా అసిస్టెంట్ హైకమిషన్ కార్యాలయం ఏర్పాటు చేయనున్నాం. 1996 నాటి గంగా నది నీటి ఒప్పందాన్ని నవీకరించడానికి సాంకేతిక చర్చలు ప్రారంభిస్తాం. తీస్తా నది పరిరక్షణ, నిర్వహణపై చర్చించడానికి బంగ్లాదేశ్‌కు టెక్నికల్ టీమ్‌ను పంపుతాం’’ అని ప్రధాని వివరించారు. సుస్థిరమైన, సౌభాగ్యవంతమైన, ప్రగతిశీల బంగ్లాదేశ్‌ను బంగబంధు షేక్ ముజిబుర్ రెహా్మన్ కలలుగన్నారని, ఆ కలను నిజం చేయడానికి తమవంతు సహకారం అందిస్తామని నరేంద్ర మోదీ ప్రకటించారు. భారత్ తమకు అతిపెద్ద పొరుగు దేశమని, తమకు అత్యంత విశ్వసనీయ మిత్రదేశమని షేక్ హసీనా పునరుద్ఘాటించారు. భారత్‌తో సంబంధాలకు అత్యధిక విలువ ఇస్తున్నామని ఆమె పునరుద్ఘాటించారు.10 ఒప్పందాలపై సంతకాలు డిజిటల్, సముద్రయానం, సముద్ర వనరుల వినియోగం, రైల్వే, అంతరిక్షం, పర్యావరణ పరిరక్షణకు గ్రీన్ టెక్నాలజీ, ఆరోగ్యం, వైద్య వంటి కీలక రంగాల్లో సహకారం పెంపొందించుకోవడమే లక్ష్యంగా భారత్, బంగ్లాదేశ్ శనివారం 10 ఒప్పందాలపై సంతకాలు చేశాయి. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో షేక్ హసీనా భేటీ న్యూఢిల్లీ: వేర్వేరు రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేసుకొనే దిశగా భారత్, బంగ్లాదేశ్ వేగంగా ముందుకు సాగుతున్నాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హర్షం వ్యక్తం చేశారు. నూతన రంగాల్లో సహకారం పెంపొందించుకుంటున్నాయని, రానున్న రోజుల్లో ఇరు దేశాల మధ్య సంబంధాలను ఈ సహకారమే నిర్ణయిస్తుందని చెప్పారు. శనివారం రాష్ట్రపతి భవన్లో ద్రౌపది ముర్ముతో బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా సమావేశమయ్యారు. భారత్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలను బలోపేతం చేసుకొనేలా కలిసి పనిచేయాలని నిర్ణయానికొచ్చారు. షేక్ హసీనాను కలవడం సంతోషంగా ఉందని ముర్ము పేర్కొన్నారు. -
నగదు రహిత లావాదేవీలు నిర్వహించాలి
లేదంటే లైసెన్స్ రద్దు ఈ నెల 31 చివరి తేదీ జిల్లా కలెక్టర్ అమ్రపాలి హన్మకొండఅర్బన్ (వరంగల్ పశ్చిమ) : జిల్లాలోని వ్యాపార వాణిజ్య సంస్థలు, పరిశ్రమలు ఈ నెల 31నాటికి నగదు రహిత లావాదేవీలు నిర్వహించాలని, లేనిపక్షంలో ఆ సంస్థల లైసెన్స్‌లు రద్దు చేస్తామని కలెక్టర్ అమ్రపాలి హెచ్చరించారు. మంగళవారం కలెక్టరేట్లో విజిలెన్స్, ఎన్పోర్స్మెంట్ వరంగల్ యూనిట్ ఆధ్వర్యంలో నగదు రహిత లావాదేవీలపై అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్ని సంస్థలు ఆర్టీజీఎస్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఇతర సాకేంతిక విధానాలు ఏర్పాటు చేసుకుని నగదు రహిత లావాదేవీలు నిర్వహించాలన్నారు. సంస్థల్లో పనిచేసే సిబ్బందికి కూడా బ్యాంక్ అకౌంట్, మొబైల్ నెంబర్, ఆధార్ కలిగి ఉండాలని అన్నారు. జిల్లా యంత్రాంగం నుంచి అవసరం మేరకు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామన్నారు. సమావేశంలో ఎస్బీఐ డిప్యూటీ మేనేజర్ శ్రీకాంత్, ఆంధ్రాబ్యాంక్ మేనేజర్ శ్రీను, కార్పొరేషన్‌బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ చిత్ర, ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీ వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. క్షయ వ్యాధిపై అవగాహన కల్పించాలి జిల్లాలో క్షయ వ్యాధి నివారణకు సంబంధించి వైద్య అధికారులు తగు చర్యలు తీసుకోవడంతోపాటు వ్యాధి పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ అమ్రపాలి అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో క్షయవ్యాధి నివారణకు తీసుకుంటున్న చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ క్షయవాధి బాధితుల నుంచి వారి కుటుంబ సభ్యులకు, పక్కవారికి వ్యాధి సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ముందస్తుగా అవగాహన కల్పించాలన్నారు. వ్యాధిని సకాలంలో గుర్తించి సరైన చికిత్స అందించాలన్నారు. సమావేశంలో క్షయవ్యాధి ప్రోగ్రాం అధికారి డాక్టర్ సూర్యప్రకాష్, డీఎంహెచ్ఓ సాంబశివరావు, లెప్రసీ విభాగం అడిషనల్ డీఎంహెచ్ఓ డాక్టర్ శ్యామనీరజ, డాక్టర్ శ్రవణ్‌కుమార్, ప్రొఫెసర్ శ్రీదేవి, తదితరులు పాల్గొన్నారు. జీఎంహెచ్‌ను తనిఖీ చేసిన కలెక్టర్ హన్మకొండ చౌరస్తా (వరంగల్ పశ్చిమ): హన్మకొండ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిని మంగళవారం కలెక్టర్ అమ్రపాలి తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని ప్రతి వార్డును క్షణ్ణంగా పరిశీలించిన ఆమె సమస్యలు, కావాల్సిన వసతులను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం డీఎంహెచ్ఓ సాంబశివరావు, సూపరింటెండెంట్ నిర్మల, ఆర్ఎంఓ సుధార్సింగ్తో సమావేశమయ్యారు. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ, బడ్జెట్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాగా, సుమారు గంట పాటు ఆసుపత్రిలో సమయం వెచ్చించిన కలెక్టర్ తిరిగి బయటకు వెళ్తుండగా ఔట్సోర్సింగ్ ఉద్యోగులు కలిసి తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు.