business class seat
-
మనసు గెలుచుకున్న ధోని
-
అభిమానుల మనసు గెలుచుకున్న ధోని
దుబాయ్ : భారత మాజీ ఆటగాడు ఎంఎస్ ధోని అభిమానుల మనసు మరోసారి గెలుచుకున్నాడు. ఐపీఎల్ 13వ సీజన్ దుబాయ్‌లో సెప్టెంబర్ 19 నుంచి జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే లీగ్‌లో పాల్గొనేందుకు జట్లన్నీ దుబాయ్‌కు చేరుకుంటున్నాయి. కాగా ధోని నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ శుక్రవారం ప్రత్యేక విమానంలో దుబాయ్‌కు బయలుదేరి వెళ్లింది. జట్టుతో పాటే సీఎస్కే మేనేజర్ కె జార్జ్ జాన్ కూడా వెళ్లారు. అయితే విమాన ప్రయాణంలో ధోనితో జరిగిన ఒక ఆసక్తికర సన్నివేశాన్ని జార్జ్ తన ట్విటర్లో షేర్ చేసుకున్నాడు. (చదవండి : 'ధోని ఎంపిక లెక్కలకు అందని సూత్రం') ధోనికి కేటాయించిన బిజినెస్ క్లాస్ సీటులో తనను కూర్చోబెట్టి.. ధోని మాత్రం ఎకానమీ సీటులో వెళ్లి కూర్చున్నాడని జార్జ్ పేర్కొన్నాడు. ఇదే విషయం ధోనిని అడిగితే..' మీ కాళ్లు చాలా పెద్దగా ఉన్నాయి.. మీకు ఎకానమీ క్లాస్ సీటు సరిపోదు.. వచ్చి నా బిజినెస్ క్లాస్ సీటులో కూర్చొండి.. నేను వెళ్లి మీ సీటులో కూర్చుంటా అని చెప్పాడు. తన సహచరులతో కలిసి కూర్చునేందుకే ధోని ఇదంతా చేశాడని జార్జ్ ఫన్నీగా పేర్కొన్నాడు. జార్జ్ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. ధోని ఎప్పుడైనా కూల్‌గానే ఉంటాడు.. ధోని లాంటి వ్యక్తులు అరుదుగా కనిపిస్తారు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఐపీఎల్ 13వ సీజన్లో ఆడేందుకు కోల్‌కతా నైటరైడర్స్, రాజస్తాన్ రాయల్స్, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌లు ముందే చేరుకోగా.. డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు శుక్రవారం దుబాయ్‌కి చేరుకున్నాయి. మిగతా రెండు ఫ్రాంచైజీలు సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ ఈ వారంతంలోగా యూఏఈ చేరుకునే అవకాశముంది యూఏఈ వచ్చే ముందు ఆటగాళ్లందరికి పలుమార్లు కోవిడ్ టెస్టులు చేశారు. ఇప్పుడు వీరిని ఆరు రోజుల పాటు క్వారంటైన్లో ఉంచుతారు. మళ్లీ ఈ 6 రోజుల్లోనే మూడు సార్లు కరోనా పరీక్షలు చేస్తారు. క్వారంటైన్ తొలి రోజు, మూడో రోజు, ఆఖరి రోజు పరీక్షలు నిర్వహిస్తారు. ఈ మూడింటిలో నెగెటివ్ ఫలితాలు వచ్చిన వారే జీవ రక్షణ వలయం (బయో బబుల్)లోకి వెళ్తారు. ఈ బుడగలో ఉన్నప్పటికీ టోర్నీ జరిగినంత కాలం ప్రతీ ఐదు రోజులకోసారి పరీక్షల తంతు జరుపుతూనే ఉంటారు. సెప్టెంబర్ 19 నుంచి జరగనున్న ఐపీఎల్13వ సీజన్లో మొత్తం 60 మ్యాచ్‌లు 53 రోజుల పాటు దుబాయ్, అబుదాబీ, షార్జా మూడు వేదికల్లో నిర్వహిస్తారు.(చదవండి : అతను ఉంటే వరల్డ్‌కప్ గెలిచేవాళ్లం: రైనా) -
ప్రయాణికురాలి కోసం కేంద్రమంత్రి త్యాగం
అనారోగ్యంతో ఉన్న ఒక ప్రయాణికురాలి కోసం తన సీటును కేంద్ర మంత్రి జయంత్ సిన్హా త్యాగం చేశారు. దాంతో ఎంతగానో ఆనందపడిన ఆమె కూతురు.. 'అచ్ఛేదిన్' అంటే ఇవేనంటూ ట్వీట్ చేసి, మంత్రికి కృతజ్ఞతలు తెలిపింది. బెంగళూరు నుంచి రాంచీ వెళ్లే ఇండిగో విమానంలో శ్రేయా ప్రదీప్ తన తల్లితో కలిసి ప్రయాణిస్తోంది. అయితే శ్రేయా తల్లికి అనారోగ్యంగా ఉండటంతో ఆమె కాళ్లు చాపుకుని పడుకోవాల్సి వచ్చింది. కానీ, వాళ్లు ప్రయాణించేది ఎకానమీ క్లాస్‌లో కావడంతో అది సాధ్యం కాలేదు. అదే విమానంలో కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయమంత్రి జయంత్ సిన్హా తన భార్యతో కలిసి ప్రయాణిస్తున్నారు. విషయం తెలిసిన ఆయన.. తమ రెండు సీట్లను తల్లీ కూతుళ్లకు ఇచ్చి, తాను భార్యతో సహా ఎకానమీ క్లాస్‌లోకి వెళ్లారు. దాంతో శ్రేయా తల్లికి కాస్త ఊరట లభించింది. ఈ విషయాన్ని శ్రేయాప్రదీప్ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఆ పోస్టును 3,000 మంది రీట్వీట్ చేయగా, 2,900 మంది లైక్ చేశారు. మంత్రి జయంత్ సిన్హాతో కలిసి ఒక సెల్ఫీ తీసుకుని ఆ ఫొటోను కూడా ఆమె ట్వీట్ చేసింది. అప్పటినుంచి ఆమె ట్విట్టర్ ఖాతా మోతెక్కిపోతూనే ఉంది. పలువురు ఆమెను, మంత్రి జయంత్ సిన్హాను, కేంద్ర ప్రభుత్వాన్ని అభినందిస్తూ ట్వీట్లు చేశారు. విషయం తెలియగానే స్పందించి, సమస్యలను పరిష్కరించడంలో ముందున్నందుకు జయంత్ సిన్హా కూడా మరికొందరు మంత్రులతో పాటు ప్రశంసలు పొందుతున్నారు. ఈ విషయంలో విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్, రైల్వే మంత్రి సురేష్ ప్రభు ముందంజలో ఉన్నారు. పెళ్లి గురించిన సలహాల దగ్గర్నుంచి అత్యవసరంగా రైల్లో తమ పిల్లలకు డైపర్లు కావాలని కూడా వాళ్లకు జనాలు ట్వీట్ చేస్తున్నారు. మరోవ్యక్తి తన ఖరీదైన కారు రోడ్డు మధ్యలో ఆగిపోయిందని.. ఆ కంపెనీవాళ్లు సరిగా స్పందించడం లేదని సుష్మా స్వరాజ్‌కు ట్వీట్ చేశాడు. @jayantsinha @IndiGo6E Ache din is wen Aviation Minister gives his 1st class seat 2 me n my ill mother, sits in d eco class himself Thnx Sir pic.twitter.com/A8Ys7hJ8Wa — SHREYA PRADIP (@ShreyaPradip) 6 November 2016