పది కోట్ల మంది మెచ్చారు!
బట్లర్ ఇంగ్లిష్‌లో పాట పాడితే వినడానికి విసుగ్గా ఉంటుందని చాలామంది అనుకుంటారు. ఇది ‘కొలవెరి..’ పాట రాకముందు సంగతి. కానీ, ‘వై దిస్ కొలవెరి...’ అంటూ ఇంగ్లిష్, తమిళ్ మిక్స్ చేసి, వచ్చిన పాట నిజానికి శ్రోతలను వెర్రెక్కించింది. ధనుష్, శ్రుతీహాసన్ జంటగా రూపొందిన ‘3’ చిత్రంలోని ఈ పాట పాడుకోనివాళ్లు లేరంటే అతిశయోక్తి కాదు. ఈ పాటను ధనుష్ చాలా బాగా పాడారు. స్వరాలందించింది టీనేజ్ కుర్రాడు అనిరుధ్. ఆ ఒక్క పాట అనిరుధ్‌ని కోలీవుడ్‌కే కాదు..
టాలీ, మాలీ, బాలీవుడ్స్లో పాపులర్ అయ్యేలా చేసింది. మొన్నీ మధ్యే టర్కీ భాషలోని ఓ యాడ్ కోసం ఈ ట్యూన్‌ను వాడుకున్నారు. నాలుగేళ్ల క్రితం వచ్చిన ఈ పాట గురించి ఇప్పుడు ప్రస్తావించడానికి కారణం ఉంది. 2011 సంవత్సరానికి ఆల్‌టైమ్ హిట్‌గా నిలిచిన ఈ పాట విదేశీయులకు తెగ నచ్చేసింది. ఇప్పటి వరకూ ఈ పాటను యూ ట్యూబ్‌లో పది కోట్ల మంది వీక్షించారు. ఈ పాట విడుదలై అయిదేళ్లు కావస్తున్నా ఇంకా క్రేజ్ తగ్గలేదనడానికి ఇంతకు మించిన సాక్ష్యం ఏముంటుంది!