BV Rao
-
పోలవరాన్ని జీవచ్చవంలా మార్చే చంద్రబాబు నీచ కుట్ర
-
KSR Live Show: జగన్ గారు మారాలి.. ఇవి నిజాయతీకి రోజులు కావు
-
ఐటీ అధికారి ఇంటిపై సీబీఐ దాడులు
కొండాపూర్ (రేంజ్-3) అధికారిగా పనిచేస్తున్న బీవీ రావు కూకట్పల్లి నివాసంలో సోదాలు... కేసు నమోదు సాక్షి, హైదరాబాద్: ఆదాయపు పన్ను శాఖలో కొండాపూర్ (రేంజ్-3) అధికారి బొద్దు వెంకటేశ్వరరావు ఇంటిపై సీబీఐ గురువారం దాడులు చేసింది. కూకట్పల్లి హౌసింగ్‌బోర్డ్ కాలనీ ఫేజ్-9లో ఉన్న ఆయన ఇంట్లో సీబీఐ ప్రత్యేక బృందం సోదాలు నిర్వహించి, కేసు నమోదు చేసింది. అధికార దుర్వినియోగం, లంచాలతో భారీగా ఆస్తులు కూడబెట్టారని ఆరోపిస్తూ దీన్ని రిజిస్టర్ చేసింది. బీవీ రావుగా పిలిచే వెంకటేశ్వరరావుకు సంబంధించి 2010 ఏప్రిల్ 1- 2016 అక్టోబర్ 31 మధ్య ప్రకటిత ఆదాయం దాదాపు రూ.97.02 లక్షలుగా సీబీఐ తేల్చింది. ఈ కాలంలో ఆయన ఖర్చులు రూ.28,63,495గా నిర్ధారించింది. ఇవిపోగా ఆయన వద్ద నగదు, స్థిరచరాస్తుల రూపంలో రూ.68,38,505 మాత్రమే ఉండాల్సి ఉండగా... ప్రస్తుతం ఆయన వద్ద ఉన్న వాటి విలువ రూ. 2,78,68,000గా అధికారులు లెక్కగట్టారు. ఎలాంటి ఆదాయం లేని రావు పెద్ద కుమారుడు ‘సప్తవర్ణ క్రియేషన్స’పేరుతో ఓ సినీ నిర్మాణ సంస్థను కలిగి ఉన్నాడని, 2014లో ఆయన చిన్న కుమారుడు హీరోగా ‘ఐయామ్ ఇన్ లవ్’చిత్రాన్ని తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో నిర్మిం చారని సీబీఐ పేర్కొంది. దీనికి రూ.1.8 కోట్లు ఖర్చయినట్లు తెలిపింది. మొత్తమ్మీద బీవీ రావు 212.64 శాతం ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నట్లు లెక్కకట్టింది. కేపీ హెచ్‌బీలో 637.37 చ.అడుగుల విస్తీర్ణంలో ఇల్లు, కొండాపూర్‌లో ఫ్లాట్లు ఉన్నట్లు గుర్తించింది. రావుపై కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. -
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి
మార్కాపురం : గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న తపాలా ఉద్యోగులను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఆల్ ఇండియా గ్రామీణ డాక్ సేవక్స్ యూనియన్ జాతీయ సహాయ ప్రధాన కార్యదర్శి బీవీ రావు డిమాండ్ చేశారు. పట్టణంలోని ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం నిర్వహించిన గ్రామీణ తపాలా ఉద్యోగుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో 1.30 లక్షల పోస్టాఫీసులు పనిచేస్తుండగా పట్టణ ప్రాంతాల్లో 24 వేల పోస్టాఫీసులు మాత్రమే పనిచేస్తున్నాయని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో పని చేసే సిబ్బంది రోజుకు 10 నుంచి 12 గంటల పాటు పనిచేస్తున్నారని, వారికి నెలకు రూ.6 నుంచి రూ.10 వేలు మాత్రమే జీతం ఇవ్వడం అన్యాయమన్నారు. పట్టణ ప్రాంతాల్లో పనిచేసే పోస్టల్ ఉద్యోగులకు ఇచ్చే పెన్షన్, ఇతర సౌకర్యాలు, గ్రామాల్లోని ఉద్యోగులకు వర్తింపజేయాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన మహాత్మ గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కూలీలకు చెల్లింపులు, వృద్ధాప్య, వికలాంగ, వితంతు పెన్షన్ తదితర పథకాలు పోస్టాఫీసుల్లో అమలు చేస్తుండటంతో తపాలాశాఖకు ఆదాయం చేకూరుతోందన్నారు. వచ్చే అక్టోబర్ నుంచి ఆర్‌ఐసీటీ (రూల్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ) పథకం కింద గ్రామీణ ప్రాంత పోస్టాఫీసులను కంప్యూటరీకరణ చేసి విద్యుత్, రెవెన్యూ, నీటి పన్ను తదితర బిల్లులను పోస్టాఫీసుల్లో చెల్లించే సౌకర్యం గ్రామీణులకు అందుబాటులో రానుందన్నారు. వచ్చే ఏడాది నుంచి గ్రామీణ ప్రాంతాల్లోని పోస్టాఫీసులన్నింటినీ పేమెంట్ బ్యాంకులుగా మార్చి బ్యాంకు సేవలు కూడా అందించేందుకు రిజర్వు బ్యాంకు అనుమతి ఇచ్చిందని చెప్పారు. గ్రామీణ తపాలా వ్యవస్థను పరిశీలించి ఉద్యోగుల సమస్యలపై నివేదిక ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం కమలేష్ చంద్రతో ఏకసభ్య కమిషన్‌ను నియమించిందని పేర్కొన్నారు. ఆ కమిటీపై ఒత్తిడి తెచ్చి గ్రామీణ తపాలా ఉద్యోగులను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించేలా పాదయాత్ర చేస్తామని బీవీ రావు వివరించారు. కార్యక్రమంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి వై.మర్రెడ్డి, పట్టణ బ్రాంచి కార్యదర్శి నారాయణరెడ్డి, అసిస్టెంట్ సెక్రటరీ నారాయణరెడ్డి, రాష్ట్ర నాయకులు సీహెచ్‌వీవీ సత్యనారాయణ, సయ్యద్ ఖాశిం పాల్గొన్నారు. -
విద్యాసాగర్ తాత్కాలికంగా ఏపీలోనే: క్యాట్
సాక్షి, హైదరాబాద్: సీనియర్ ఐఏఎస్ అధికారి విద్యాసాగర్‌ను తదుపరి ఉత్తర్వులు జారీచేసే వరకూ ఆంధ్రప్రదేశ్ క్యాడర్లోనే కొనసాగించాలని కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్(క్యాట్) ఆదేశించింది. ఈ మేరకు కేంద్రానికి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలపాటు వాయిదా వేసింది. కేంద్ర ప్రభుత్వం గత నెల 10న తనను తెలంగాణకు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ ఏపీ గిరిజన శాఖ ముఖ్యకార్యదర్శిగా ఉన్న విద్యాసాగర్ దాఖలు చేసిన పిటిషన్‌ను క్యాట్ సభ్యులు బీవీ రావు, రంజనా చౌదరిలతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారిం చింది. ప్రత్యూష్‌సిన్హా కమిటీ మార్గదర్శకాల ప్రకారం ఏపీ క్యాడర్లోనే కొనసాగిం చాలని పిటిషనర్ తరఫు న్యాయవాది వై.శ్రీనివాసమూర్తి వాదనలు వినిపించారు.