తిరుమలలో నేడు ఒక రోజు బ్రహ్మోత్సవం
రథసప్తమికి అంతా సిద్ధం
తరలివచ్చిన అశేషభక్తజనం
సాక్షి, తిరుమల: ఒకరోజు బ్రహ్మోత్సవంగా ప్రసిద్ధి పొందిన రథసప్తమికి తిరుమల సిద్ధమైంది. ఏడు వాహనసేవల్లో స్వామివారిని దర్శించి తరిం చేందుకు భక్తకోటి తరలివచ్చింది. ఉద యం 5.30 నుంచి రాత్రి 9 గంటల వరకు స్వామివారు ఆలయ నాలుగు మాడవీధుల్లో అంగరంగ వైభవంగా ఊరేగుతూ దర్శనమిచ్చేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. బుధవారం రాత్రి అన్ని విభాగాల అధికారులతో కలసి జేఈవో శ్రీనివాసరాజు రథసప్తమి ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. ఆలయం వద్ద, నాలుగు మాడవీధుల్లో నిర్మించిన ప్రత్యేక బ్యారికేడ్లు, గ్యాలరీలు, చలువ పందిళ్లను పరి శీలించారు.
ఏకదాటిగా ఏడు వాహ సేవలు ఉండడంతో కచ్చితమైన సమయాన్ని పాటించాలని నిర్ణయించారు. మధ్యాహ్నం 2 గంటలకు పుష్కరిణిలో చక్రస్నానం ఉండడంతో బుధవారం ప్రత్యేకంగా పరిశుభ్రత చర్యలు చేపట్టారు. సుదర్శన చక్రతాళ్వా ర్కు స్నానం జరిపే పుణ్యప్రదేశంలో సాధారణ భక్తులు చొరబడకుం డా ఇనుప కమ్మీలను ఏర్పాటు చేశారు. నాలుగు మాడవీధుల్లో ఏ ర్పాటు చేసిన చలువ పందిళ్ల వద్ద తాగునీరు, మజ్జిగ, అన్న ప్రసాదాలు వితరణ చేసేందుకు అదికారుల చర్యలు తీసుకున్నారు.