కేబుల్ టీవీ నెట్వర్క్ పర్యవేక్షణకు కమిటీలు
సాక్షి, హైదరాబాద్: కేబుల్ టీవీ నెట్వర్క్ పనితీరును పర్యవేక్షించేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో ఉన్నతాధికారుల కమిటీలను ఏర్పాటు చేస్తూ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు కేబుల్ నెట్వర్క్ (క్రమబద్ధీకరణ) చట్టం-1955 అమలు తీరు, చట్టాల్లో మార్పులు ఇతర అంశాలను ఈ కమిటీలు పర్యవేక్షిస్తాయి. రాష్ట్ర స్థాయి కమిటీలో వాణిజ్య పన్నుల శాఖ ముఖ్య కార్యదర్శితో పాటు హోం శాఖ ముఖ్య కార్యదర్శి, సమాచార శాఖ కార్యదర్శి, దూరదర్శన్ కేంద్రం డెరైక్టర్, సమాచార శాఖ, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్లు ఉంటారు.
ఏడాదికోసారి ఈ కమిటీ సమావేశమై రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఉన్న కేబుల్ ఆపరేటర్ల వివరాలు, టీవీ వీక్షకుల వివరాలను పూర్తిస్థాయి నివేదికతో రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తారు. కాగా జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్, ఎస్పీ, వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్, డీపీఆర్ఓతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు.