Cakradhar Rao
-
రేపు జెడ్పీ సారథుల ఎన్నిక
కో ఆప్షన్ సభ్యులు మళ్లీ నామినేషన్లు వేయాల్సిందే జిల్లా పరిషత్ సీఈఓ చక్రధర్‌రావు సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జెడ్పీచైర్మన్, వైస్ చైర్మన్, కో ఆప్షన్ పదవులకు ఈ నెల 13న ఎన్నికలు జరుగుతాయని జెడ్పీ సీఈఓ చక్రధర్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు కో ఆప్షన్ సభ్యుల ఎన్నికకు సంబంధించి నామినేషన్లు స్వీకరి స్తామని, గత వారం నామినేషన్లు సమర్పించిన అభ్యర్థులు కూడా మళ్లీ దాఖలు చేయాల్సి ఉంటుందని చెప్పారు. మధ్యాహ్నం 12 గంటల వరకు నామినేషన్ల పరిశీలన, ఒంటిగంట లోపు నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందని, ఆ తర్వాత జిల్లా పరిషత్ సమావేశం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. సమావేశంలో జెడ్పీటీసీల ప్రమాణ స్వీకారం తర్వాత కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక ఉంటుందని తెలిపారు. అనంతరం 3 గంటలకు మళ్లీ మొదలయ్యే సమావేశంలో చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నిక లు జరుగుతాయని వివరించారు. కోరం తప్పనిసరి: జిల్లా పరిషత్ సమావేశం జరగాలంటే కోరం తప్పనిసరి. 17 మంది సభ్యులు హాజరైతే నే కో ఆప్షన్ సభ్యులను ఎన్నుకుంటారు. నిర్దేశిత సంఖ్యలో సభ్యులు హాజరుకాకపోతే ఎన్నికలు వాయిదా పడతాయి. ఆ తర్వాత 3 గంటలకు జరగాల్సిన సమావేశం కూడా వాయిదా పడుతుంది. మరుసటి రోజుకు ఈ సమావేశాన్ని వాయిదా వేస్తారు. ఒకవేళ క్రితం రోజు పరిస్థితే పునరావృతమైతే ఈ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదించి ఈసీ నిర్ణయం మేరకు తదుపరి తేదీని ప్రకటిస్తారు. కోరం సంపూర్ణంగా ఉండి కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక జరిగిన అనంతరం, చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక సమయంలో కోరం లేకున్నా ఎన్నిక వాయిదా పడుతుందని అధికారులు తెలిపారు. -
రేపు జెడ్పీ సారథుల ఎన్నిక
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లా పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్, కో ఆప్షన్ పదవులకు ఈ నెల 13న ఎన్నికలు జరుగుతాయని జెడ్పీ ముఖ్య కార్యనిర్వహణాధికారి చక్రధర్‌రావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు కో ఆప్షన్ సభ్యుల ఎన్నికకు సంబంధించి నామినేషన్లను స్వీకరిస్తామని, గత వారం నామినేషన్లు సమర్పించిన అభ్యర్థులు కూడా మళ్లీ నామినేషన్లు దాఖలు చేయాల్సివుంటుందని చెప్పారు. మధ్యాహ్నం 12 గంటలవరకు నామినేషన్ల పరిశీలన, ఒంటిగంటలోపు నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందని, ఆ తర్వాత జిల్లా పరిషత్ సమావేశం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. సమావేశంలో జెడ్పీటీసీల ప్రమాణస్వీకారం తర్వాత కోఆప్షన్ సభ్యు ల ఎన్నిక ఉంటుందని తెలిపారు. అనంతరం 3 గంట లకు మళ్లీ మొదలయ్యే సమావేశంలో చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నిక లు జరుగుతాయని వివరించారు. కోరం తప్పనిసరి! జిల్లా పరిషత్ సమావేశం జరగాలంటే కోరం తప్పని సరి. 17 మంది సభ్యులు హాజరైతే నే కో ఆప్షన్ సభ్యులను ఎన్నుకుంటారు. నిర్ధేశిత సంఖ్యలో సభ్యులు హాజరుకాకపోతే ఎన్నికలు వాయిదా పడతాయి. ఆ తర్వాత 3 గంటలకు జరగాల్సిన సమావేశం కూడా వాయిదా పడుతుంది. మరుసటి రోజుకు ఈ సమావేశాన్ని వాయిదా వేస్తారు. ఒకవేళ క్రితం రోజు పరిస్థితే పునరావృతమైతే మాత్రం ఈ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదించి ఈసీ నిర్ణయం మేరకు తదుపరి తేదీని ప్రకటిస్తారు. కోరం ఉండి కో ఆప్షన్ సభ్యు ల ఎన్నిక జరిగిన అనంతరం, చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక సమయంలో కోరం లేకు న్నా.. ఎన్నిక వాయిదా పడుతుందని అధికారులు తెలిపారు. -
మండలాధీశులెవరో!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: మండల పరిషత్‌ల పరోక్ష ఎన్నికలకు రంగం సిద్ధమైంది. అధ్యక్ష, ఉపాధ్యక్ష పీఠాలను ఎవరు అధిరోహించనున్నారో శుక్రవారం తెలనుంది. పరిషత్‌లోని మొత్తం స్థానాల్లో మెజార్టీ సభ్యుల ఆమోదయోగ్యం ఆధారంగా ఎన్నికలు నిర్వహించనున్నారు. అయితే కోరం ఉన్నప్పటికీ ఎన్నికలు జరపనున్నారు. ఇందుకు సంబంధించి జిల్లాలోని 33 మండలాల్లో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం నామినేషన్ల ప్రక్రియ తర్వాత మధ్యాహ్నం ఒంటిగంటకు ఎన్నిక చేపట్టనున్నట్లు జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి చక్రధర్‌రావు పేర్కొన్నారు. పద్నాలుగింట అస్పష్టత.. జిల్లాలోని 33 మండల పరిషత్‌లకు ఏప్రిల్‌లో ఎన్నికల జరిగాయి. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వీటి ఫలితా లు వాయిదా పడ్డాయి. తాజాగా పాల కవర్గాల ఏర్పాటుకు ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వడంతో అధికారులు చర్యలకు ఉపక్రమించారు. జిల్లాలో 33 మండల పరిషత్‌లలో 19 మండలాల్లో మాత్రమే గెలుపును ప్రభావితం చేసే లా ఫలితాలు వచ్చాయి. దీంతో ఆ మేరకు పార్టీలు తమ సభ్యులను కాపాడుకునేందుకు క్యాంపులు నిర్వహించి పరోక్ష ఎన్నిక సమయానికల్లా హాజరయ్యేలా చర్యలు తీసుకున్నాయి. 14 మండలాల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో పొరుగుపార్టీ సభ్యులను తమ వైపునకు మళ్లించుకునేందుకు ఎత్తుగడ వేసి వ్యూహాత్మకం గా వ్యవహరించాయి. ఈ క్రమంలో కొన్ని మండలాల్లో సభ్యులు అటుఇటుగా తారుమారయ్యారు. ఈ మండలాల్లో.. 19 మండలాల్లో స్పష్టమైన మెజార్టీ రావడంతో ఆయా పార్టీల్లో అధ్యక్ష, ఉపాధ్యక్ష అభ్యర్థుల ఎంపిక ఖరారు చేసే పనిలో బిజీ అయ్యారు. ఇప్పటికే అభ్యర్థి పేరును ఖరారు చేసినప్పటికీ చివరి నిమిషం వరకు గోప్యత పాటిం చాలని నిర్ణయించాయి. దోమ, మహేశ్వరం, శామీర్‌పేట, హయత్‌నగర్, మేడ్చల్, బషీరాబాద్, తాండూరు, ధారూరు, కీసర, ఇబ్రహీంపట్నం, శంషాబాద్, పరిగి, వికారాబాద్, బంట్వారం, శంకర్పల్లి, పెద్దేముల్, యాలాల, కుత్బుల్లాపూర్, నవాబుపేట మండలాల్లో ఎన్నిక ఏకగ్రీవం కానుంది. వీటిలో ఏడు మండలాల్లో కాంగ్రెస్, టీడీపీ-బీజేపీ కూటమి 5, టీఆర్ఎస్ ఆరు మండలాల్లో ముందంజలో ఉన్నాయి. మరోవైపు పద్నాలుగు మండలాల్లో స్పష్టమైన మెజార్టీ లేదు. దీంతో సమీకరణల మార్పుతో కొంత మెజార్టీ సాధించే దిశగా పార్టీలు వ్యవహరించాయి. వీటిలో గండేడ్, మంచా ల, మొయినాబాద్, కుల్కచర్ల, షాబా ద్, యాచారం, చేవెళ్ల, కందుకూరు, ఘట్కేసర్, మోమిన్‌పేట, రాజేంద్రనగర్, మర్పల్లి, సరూర్‌నగర్, పూడూరు మండలాలున్నాయి. ఈ పద్నాల్గింటి లో ఆరు మండలాలను కాంగ్రెస్ హస్తగతం చేసుకునే అవకాశం ఉంది. మరో 4 మండలాల్లో టీఆర్ఎస్ ఆధిక్యతలో ఉండగా, టీడీపీ-బీజేపీ కూటమి 3 మండలాలను కైవసం చేసుకునే అవకా శం ఉంది. మంచాల మండలంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న సీపీఎంకు పీఠం దక్కే అవకాశం ఉంది.