కాలిఫోర్నియా విభజనపై కదలిక
లాస్ ఏంజెలిస్: అమెరికాలో జనాభాలో అత్యంత పెద్దదైన కాలిఫోర్నియా రాష్ట్రాన్ని ఆరు రాష్ట్రాలుగా విభజించాలన్న ప్రతిపాదన వేగం పుంజుకుంది. విభజనపై ప్రజాభిప్రాయ సేకరణ జరపాలన్న ప్రతిపాదన అర్హత సాధించేందుకు ప్రజలతో సంతకాలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం గత వారం అనుమతించింది. ఈ ప్రతిపాదన అర్హత సాధించాలంటే జూలై మధ్యనాటికి 8,08,000 వేలమంది సంతకాలు అవసరం. సిలికాల్ వ్యాలీకి చెందిన వెంచర్ పెట్టుబడిదారు టిమ్ డ్రేపర్ ఈ విభజన ప్రతిపాదనను తెచ్చారు. ‘3.8 కోట్ల జనాభా ఉన్న కాలిఫోర్నియా ప్రపంచంలోని టాప్ 10 ఆర్థిక వ్యవస్థల్లో ఒక టి.
రాష్ట్రంలో చాలా భాగంలో పాలన సరిగ్గా సాగడం లేదు.. రవాణా, మౌలిక సదుపాయాలు పాతవి. ఇకనైనా విభజించకపోతే పరిస్థితి దిగజారుతుంది’ అని ఆయన గురువారం ఓ ఇంటర్వ్యూలో హెచ్చరించారు. ఆయన ప్రతిపాదనపై నవంబర్లో ప్రజాభిప్రాయ సేకరణ జరిగే అవకాశముంది. ఒకవేళ దీని కి ప్రజలు అంగీకరించినా, కాంగ్రెస్ (పార్లమెం టు) ఒప్పుకుంటేనే విభజన సాధ్యమవుతుంది. అదే జరి గితే రాష్ట్రం పశ్చిమ, మధ్య, దక్షిణ కాలిఫోర్నియాలు, సిలికాన్ వ్యాలీ తదితర రాష్ట్రాలుగా విడిపోతుంది.