ఎన్కౌంటర్ చేసినా తప్పులేదు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేశ్ నేతృత్వంలోనే విజయవాడలో అరాచక శక్తులు విజృంభిస్తున్నాయని ఏపీ శాసన మండలి ప్రతిపక్ష నేత సి.రామచంద్రయ్య విమర్శించారు. ఇదంతా బాబు, లోకేశ్ నేతృత్వంలో జరుగుతోందని ఆయన ఆరోపించారు.
మహిళల పేదరికాన్ని అడ్డుపెట్టుకుని వ్యభిచారంలోకి దింపడం దారుణమని..అలాంటి వారిని ఎన్కౌంటర్ చేసినా తప్పులేదని ఆయన అన్నారు. తన సొంత మనుషులకు ఆర్థికంగా మేలు చేకూర్చాలనే చంద్రబాబు ఈ మాఫియాను పట్టించుకోవడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో కాల్ మనీ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని రామచంద్రయ్య డిమాండ్ చేశారు.