కాల్‌గర్ల్స్ సైట్లో భార్య ఫోన్ నెంబర్!
ఇన్నాళ్లూ వరకట్న వేధింపులు చూశాం, భార్య ప్రవర్తనను అనుమానించి చిత్రహింసలు పెట్టే భర్తలను చూశాం. కానీ హైదరాబాద్‌లోని సైదాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో ఓ భర్త మరీ శాడిస్టులా ప్రవర్తించాడు.
కాల్ గర్ల్స్‌కు సంబంధించిన వెబ్సైట్లో తన భార్య ఫోన్ నెంబరును పెట్టేశాడు. దాంతో ఆమె తీవ్ర ఆవేదనకు గురయ్యారు. సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సదరు శాడిస్టు భర్త మీద పోలీసులు కేసు నమోదు చేవారు.