‘బెక్’ శిక్షణకు కేంబ్రిడ్జితో గీతం వర్సిటీ ఒప్పందం
విశాఖపట్నం: బెంగళూరు కేంపస్‌లో ఇంజనీరింగ్, ఎంబీఏ చేస్తున్న విద్యార్థులకు బిజినెస్ ఇంగ్లీష్ సర్టిఫికెట్ (బెక్)పై శిక్షణ ఇచ్చేందుకు కేంబ్రిడ్జి వర్సిటీ ప్రెస్ ఇండి యా లిమిటెడ్ (సీయూపీఐఎల్)తో గీతం విశ్వవిద్యాలయం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.
ఒప్పందంపై బెంగళూరు కేంపస్ డెరైక్టర్ విజయభాస్కరరాజు, కేంబ్రిడ్జి వర్సిటీ భారత అధికారి ప్రసన్న వెంకటరామన్ సంతకాలు చేశారు. దీని కోసం ప్రత్యేక లాంగ్వేజ్ ల్యాబ్‌ను గీతం.. బెంగళూరు కేంపస్‌లో ఏర్పాటు చేసింది. ఈ శిక్షణ విద్యార్థులకు ప్లేస్మెంట్లలో దోహదపడుతుందని భాస్కరరాజు చెప్పారు.