Cannes International Film Festival
-
చేతికట్టు తొలగించి కేన్స్‌లో మెరిసిన ఐశ్వర్య రాయ్
ఫ్రాన్స్‌లో 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అట్టహాసంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా సినీ తారలు, సెలిబ్రిటీస్ సరికొత్త డిజైనర్ దుస్తుల్లో రెడ్ కార్పెట్‌పై మెరిశారు. కేన్స్‌లో ఎంతమంది కనిపించినా సరే.. అందరి చూపులు ఐశ్వర్య రాయ్ మీదే ఉంటాయి. ఈ క్రమంలో ఆమె చేతికి గాయం ఉండటంతో ఫ్యాన్స్ షాకయ్యారు. అయినా సరే గాయంతోనే ఈ వేడుకకు తన కుమార్తెతో ఐశ్వర్య వెళ్లారు. కానీ, రెడ్ కార్పెట్‌పై ఆమె ఎలా కనిపించనున్నారో అని లక్షలాది మంది అభిమానులు ఎదురుచూశారు. ఏది ఏమైనా నెటిజన్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. 2024 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొన్న ఐశ్వర్యరాయ్ బచ్చన్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఐశ్వర్య తన గ్లామర్‌ను జోడించింది. డిఫరెంట్ ఫ్యాషన్ సెన్స్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడంలో ఆమె మరొసారి సక్సెస్ అయ్యారు. ఐశ్వర్యను చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు చేరుకున్నారు. 77వ ఫిల్మ్ ఫెస్టివల్లో బ్లాక్, వైట్, గోల్డెన్ కాంబినేషన్లో ఉండే గౌనులో ఐశ్వర్య కనిపించారు. ప్రముఖ డిజైనర్ 'ఫల్గుణి షేన్ పీకాక్' వారు డిజైన్ చేసిన డ్రెస్‌ను ఆమె ధరించారు. గాయం వల్ల తన కుడి చేతికి ఆర్మ్ స్లింగ్ ధరించి కనిపించిన ఐశ్వర్య ప్రస్తుతానికి తొలగించింది. కానీ, ఆదే చేతికి తెల్లని కట్టు కనిపిస్తుంది. వాస్తవంగా ఆమె చేతిక తీవ్రమైన గాయమే అయినట్లు తెలుస్తోంది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో గత 20 ఏళ్ల నుంచి ఆమె పాల్గొంటుంది. అందుకే ఆమె ఈసారి కూడా అక్కడ అడుగుపెట్టింది. దీంతో చాలా మంది అభిమానులు ఐశ్వర్యను ప్రశంసిస్తున్నారు. ఆమెలో ఉన్న డెడికేషన్‌కు చాలామంది ఫిదా అవుతున్నారు.Breathtaking Beauty ✨ Her Walk 🔥#AishwaryaRai #AishwaryaRaiBachchan #AishwaryaAtCannes #Cannes2024 #CannesQueenAishwarya #Cannes pic.twitter.com/KxgxW1GyQs— Aishwarya Rai Fan (@Ram_TamilNadu_) May 16, 2024 -
షాకింగ్ వీడియో: దుస్తులు విప్పి అర్ధనగ్నంగా మహిళ నిరసన
cannes film festival.. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఫిల్మ్ ఫెస్టివల్ వేదికగా రెడ్ కార్పెట్‌పై ఉక్రెయిన్‌కు చెందిన మహిళ వినూత్న నిరసన తెలిపింది. తమ దేశమైన ఉక్రెయిన్‌లో మహిళలు, యువతులపై రష్యా సైనికుల అత్యాచారాలను ఆపండి అంటూ నినాదాలు చేస్తూ అర్ధనగ్న స్థితిలో నినాదాలు చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల ప్రకారం.. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో శుక్రవారం సందడిగా కార్యక్రమం జరుగుతోంది. ఇంతలో ఉక్రెయిన్ చెందిన మహిళ ఒక్కసారిగా రెడ్ కార్పెట్‌పైకి తన దుస్తులను విప్పి.. నిరసన తెలిపింది. ఆమె శరీరంపై ఉక్రెయిన్ జెండా రంగులను వేసుకొని.. ‘‘మాపై అత్యాచారం ఆపండి’’ అని అంటూ నినాదాలు చేస్తూ నిరసల ప్రదర్శించింది. దీంతో ఒక్కసారిగా అక్కడున్న వారంతా షాకయ్యారు. అప్రమత్తమైన సిబ్బంది ఆమెపై దుస్తులు కప్పి అక్కడి నుంచి బయటకు తీసుకువెళ్లారు. ఇదిలా ఉండగా.. కేన్స్ వేడుకల్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ భావోద్వేగ ప్రసంగం చేశారు. ఉక్రెయిన్ నుంచి లైవ్ శాటిలైట్ వీడియో ద్వారా కేన్స్ ప్రారంభోత్సవంలో జెలెన్ స్కీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌పై రష్యా బలగాల దాడుల్లో తమ దేశ పౌరులు వేల సంఖ్యలో చనిపోతుంటే సినీ ప్రపంచం మౌనంగా ఉంటుందా అని ప్రశ్నిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈక్రమంలోనే ఉక్రెయిన్ రష్యా బలగాలు దురాగతాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. తమ దేశ యువతులు, మహిళలపై రష్యన్లు అత్యాచారాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఇప్పటికైనా ఉక్రెయిన్‌లో రష్యా దురాక్రమాలపై సినీ ప్రపంచం గొంతెత్తి ఖండించాలని జెలెన్స్కీ విజ్ఞప్తి చేశాడు. ⚡️"Прекратите нас насиловать". Полуобнаженная активистка в цветах Украины и со следами крови устроила скандал на фестивале в Каннах. Гости Каннского фестиваля вынуждены были перестать ее насиловать pic.twitter.com/MXSVznjcCV — Alexander Bunin (@abunin) May 20, 2022 ఇది కూడా చదవండి: డ్రాగన్ సైనిక విన్యాసాలు -
Cannes Film Festival: గోస్ టు కాన్స్
పేదరికంతో ఇబ్బందులు పడే ఒక మహిళ కథ.. ఓ బాలుడి తీయని జ్ఞాపకాలు.. భారతీయ చరిత్రలో అతి పెద్ద అగ్ని ప్రమాద బాధితుల ఇబ్బందులు.. ఇంటి కోసం వెతికే ఇద్దరు ట్రాన్స్‌జెండర్ మహిళల పాట్లు.. ఒక జర్నలిస్ట్ మరియు రెండు వర్గాల మధ్య సంఘర్షణ.. ఇవన్నీ కాన్స్ చలన చిత్రోత్సవాల్లో వీక్షకుల ముందుకు రానున్నాయి. ఈ కథలతో రూపొందిన ఐదు భారతీయ చిత్రాలు కాన్స్ చలన చిత్రోత్సవాల్లో ‘గోస్ టు కాన్స్’ విభాగంలో ప్రదర్శితం కానున్నాయి. ఈ నెల 17 నుంచి 28 వరకూ ఈ చిత్రోత్సవాలు జరగనున్నాయి. ఫ్రాన్స్ దేశంలో జరగనున్న కాన్స్ ఉత్సవాలకు వెళ్లనున్న ఆ ఐదు చిత్రాల గురించి తెలుసుకుందాం. లైలా... రోషిణి... ఓ ఇల్లు జీవించడానికి ఒక ఇంటి కోసం ఆరాటపడుతుంటారు లైలా, రోషిణి అనే ఇద్దరు స్త్రీలు. ఆ ఇద్దరూ లింగ మార్పిడి చేయించుకున్నవారు కావడంతో అద్దెకు ఇల్లు దక్కించుకోవడం పెద్ద ప్రహసనం అవుతుంది. రిన్ చిన్, మహీన్ మీర్జా రూపొందించిన హిందీ చిత్రం ‘ఏక్ జగహ్ అప్నీ’ కథ ఇది. నిజమైన ఇద్దరు ట్రాన్స్ ఉమెన్ (లింగ మార్పిడి చేయించుకున్న మహిళలు) నటించిన చిత్రం ఇది. ఇద్దరికీ కూడా ఇది తొలి సినిమానే. కథ రాసేటప్పుడు వారి అనుభవాలను కూడా పరిగణనలోకి తీసుకున్నారు. ఓ బాలుడి జ్ఞాపకాలు ఏడో తరగతి నుంచి పదో తరగతి వరకూ ఛత్తీస్‌గఢ్‌లో చదువుకుంటాడు ఆ కుర్రాడు. ఆ నాలుగేళ్ల జీవితం ఎన్నో జ్ఞాపకాలను మిగిల్చింది. ఆ జ్ఞాపకాలకు కొన్ని కాల్పనిక అంశాలు జోడించి దర్శకుడు శైలేంద్ర సాహు తెరకెక్కించిన చిత్రం ‘బైలాడీలా’. శైలేంద్ర సాహు దర్శకత్వం వహించిన తొలి చిత్రం ఇది. ఛత్తీస్ గఢ్‌లో చదువుకున్నప్పటి అతని జ్ఞాపకాలే ఈ సినిమా. హిందీ, ఛత్తీస్‌గఢ్‌లో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమాకి బడ్జెట్ నిర్ణయించలేదు. శేలైంద్ర స్నేహితులు నటించారు. వాళ్లతో పాటు టెక్నీషియన్లు ఎవరూ పారితోషికం తీసుకోలేదు. ఈ సినిమా ద్వారా డబ్బులొస్తే అప్పుడు ఇస్తానని ఫ్రెండ్స్‌కి మాటిచ్చారు శైలేంద్ర. కాన్స్ చిత్రోత్సవాల్లో తన చిత్రాన్ని మార్కెటింగ్ చేసుకోవాలనే ఆకాంక్షతో అక్కడికి వెళుతున్నారు. నిర్మాతలు ముందుకు రాని ‘ఫాలోయర్’ బెల్గామ్‌లోని ఓ పట్టణానికి చెందిన ఒక జర్నలిస్ట్, రెండు వర్గాల మధ్య సంఘర్షణ చుట్టూ సాగే చిత్రం ‘ఫాలోయర్’. హర్షద్ నలవాడే దర్శకత్వంలో హిందీ, కన్నడ, మరాఠీ, దఖినీ భాషల్లో ఈ చిత్రం రూపొందింది. బెల్గామ్ నేపథ్యం కావడంతో అక్కడి స్థానికులతోనే నటింపజేశారు. రెండు వర్గాల మధ్య సంఘర్షణ నేపథ్యంలోని సినిమా కావడంతో నిర్మాతలెవరూ ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకు రాలేదు. దాంతో తమ పరిస్థితిని వివరిస్తూ ఈ సినిమా టీమ్ ఓ వీడియో విడుదల చేసింది. ఈ వీడియో చూసి ఆర్థిక సహాయం చేయడానికి చాలామంది ముందుకు వచ్చారు. అలా ‘క్రౌడ్ ఫండెడ్’ మూవీగా ‘ఫాలోయర్’ రూపొందింది. సినిమా షూటింగ్ పూర్తి చేసి, రఫ్ కట్ చేస్తున్న సమయంలో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేయడానికి ఇద్దరు నిర్మాతలు సహాయం చేయడంతో ఈ సినిమా పూర్తయింది. పేదరికాన్ని జయించాలని... ప్రభుత్వ పాఠశాలకు మధ్యాహ్నం భోజనం అందించే వంట మనిషి శివమ్మ జీవితం చుట్టూ సాగే కథ ‘శివమ్మ’ చిత్రం. పేదరికాన్ని జయించడానికి ఆమె రకరకాల ప్రయత్నాలు చేస్తుంది. చివరికి కూతురి పెళ్లికి దాచిన డబ్బుని ఓ వ్యాపారంలో పెట్టుబడిగా పెడుతుంది. నిజజీవితంలో జరిగిన కొన్ని ఘటనలను జోడించి అల్లిన కాల్పనిక కథతో దర్శకుడు జై శంకర్ ఈ కన్నడ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాలో నటించినవారందరూ వృత్తిరీత్యా యాక్టర్లు కాదు. కానీ సినిమా సహజత్వానికి దగ్గరగా ఉండాలని నటింపజేశారు. దర్శక–నిర్మాత–నటుడు రిషబ్ శెట్టి ఈ చిత్రాన్ని నిర్మించారు. బాగ్జాన్ 2020లో అస్సాంలోని తిన్సుకియా జిల్లాలో ఓ భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న విషయం గుర్తుండే ఉంటుంది. భారతదేశ చరిత్రలో అతి పెద్ద అగ్ని ప్రమాదంగా నమోదైంది. గ్యాస్ లీకేజ్ కారణంగా చమురు బావిలో ఎగసిపడిన భారీ మంటలను అదుపు చేసేందుకు దాదాపు ఆరు నెలలు పట్టింది. ఈ ఘటన నేపథ్యంలో రూపొందిన అస్సామీ చిత్రం ‘బాగ్జాన్’. తిన్సుకియాలో నిజమైన లొకేషన్లలో చిత్రీకరించారు. అలాగే ఆ దుర్ఘటన బాధితులను కూడా నటింపజేశారు చిత్రదర్శకుడు జైచెంగ్ గ్జయ్. బలమైన కథాంశంతో రూపొందిన ఈ ఐదు చిత్రాలూ ప్రపంచ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటాయని ఊహించవచ్చు. ఇలా అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శితం కావడం ఆయా చిత్రబృందాలకు ఉపయోగపడే విషయం. తమ సినిమాని మార్కెటింగ్ చేసుకునే వీలు ఉంటుంది. అలాగే తదుపరి చిత్రానికి ఫండ్ సమకూరే వెసులుబాటు ఉంటుంది. ఒకవేళ అప్పటికి సినిమా విడుదల కాకపోతే విడుదలకు సహాయం అందే అవకాశం ఉంది. మేకర్స్‌కి ఇలాంటి ప్రయోజనాలు ఉంటే.. నటీనటులకు అవకాశాలు పెరిగే ఆస్కారం కూడా ఉంటుంది. అందుకే కాన్స్ చిత్రోత్సవాలకు వెళ్లనున్న ఈ ఐదు చిత్రాల యూనిట్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. -
రివెరా రొమాన్స్
కాన్స్‌లో అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది ప్రియాంకా చోప్రా, నిక్ జోనస్ జంట. మూడో రోజు ఇలా జంటగా పలు గెటప్స్‌తో ప్రేమ వొలకబోశారు. ‘రివెరా రొమాన్స్’ అని ఈ సిరీస్ ఆఫ్ ఫోటోలకు క్యాప్షన్ చేశారు ప్రియాంక. తెలంగాణ చలన చిత్రపరిశ్రమ అభివృద్ధిని కాంక్షిస్తూ ఫ్రాన్స్‌లో జరుగుతున్న కాన్స్ చిత్రోత్సవాల్లో తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పుస్కూరు రామ్మోహనరావు పాల్గొన్నారు. తెలంగాణ చిత్రపరిశ్రమ అభివృద్ధికి అవసరమైన అత్యున్నత సాంకేతికను, పెట్టుబడులు ఆకర్షించడానికి, స్టూడియోలు నిర్మించడానికి, యానిమేషన్, వీడియో గేమింగ్ విభాగాలను విస్తరించడానికి వివిధ దేశాల ప్రతినిధులతో మాట్లాడారాయన. ఇందులో భాగంగా హిందూజా గ్రూప్ బ్రదర్స్‌ను తెలంగాణలో ఎంటర్టైన్మెంట్ విభాగంలో స్టూడియోల నిర్మాణానికి ఇతర విభాగాల్లో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. డిజిక్విస్ట్ చైర్మన్ బసిరెడ్డి, ఐటిపీవో ప్రెసిడెంట్ అసిఫ్ ఇక్భాల్ కాన్స్ ఉత్సవాల్లో పాల్గొన్నారు. -
‘అందుకే అతన్ని వివాహం చేసుకున్నాను’
సోనమ్ కపూర్ - ఆనంద్ అహుజ రెండు నెలల క్రితం వివాహ బంధంతో ఒక్కటయిన సంగతి తెలిసిందే. వివాహం అయిన దగ్గర నుంచి ఈ జంట ఎప్పటికప్పుడు తమకు సంబంధించిన అంశాలను అభిమానులతో పంచుకుంటూనే ఉన్నారు. సోనమ్ కపూర్ అంటేనే ఫ్యాషన్ ఐకాన్. అయితే మరో ఆసక్తికర విషయం ఏంటంటే ఆనంద్ అహుజా కూడా ఫ్యాషన్ ప్రియుడే. ఫ్యాషన్ పట్ల ఇద్దరికి ఉన్న ఆసక్తే తమను ఒక్కటి చేసిందింటున్నారు సోనమ్. ఈ విషయం గురించి సోనమ్ తన ట్విటర్లో ఒక సందేశాన్ని పోస్టు చేశారు. దానిలో ‘ఫ్యాషన్ అంటే నాకు ఎంత ఇష్టమో అందరికి తెలిసిన విషయమే. నేను ఆనంద్‌ను వివాహం చేసుకుంది కూడా ఈ కారణం వల్లే. ఎందుకంటే ఆనంద్ ఫ్యాషన్ రంగంలో, రిటైల్ రంగంలో స్థిరపడిన వ్యక్తి కాబట్టి నాకు తొందరగా నచ్చాడు. ఫ్యాషన్ పట్ల ఉన్న ఆసక్తి వల్లే మేము ఇద్దరం వివాహం చేసుకున్నాం’ అంటూ ట్వీట్ చేశారు. ఆనంద్ అహుజా ఢిల్లీకి చెందిన రిటైల్ వ్యాపారి. అంతేకాక దేశంలో తొలి మల్టీ బ్రాండ్ ‘స్నీకర్’ బోటిక్‌ను ప్రారంభించింది కూడా ఆనంద్ అహుజానే. దీంతోపాటు ‘భనే’ అనే బ్రాండ్‌ను కూడా ప్రారంభించారు. ఈ ఏడాది మే 8న సోనమ్ కపూర్ - ఆనంద్ అహుజా వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ వేడుకకు బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. వివాహం జరిగిన కొద్ది రోజులకే సోనమ్ ‘క్యాన్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2018’లో పాల్గొన్నారు. -
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ‘తేజ్’
సాక్షి, బెంగళూరు: మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ) కంప్యూటర్ సైన్స్ విద్యార్థి(2008-12 బ్యాచ్) భాస్కర్ ఉపాధ్యాయ తీసిన ‘తేజ్’ షార్ట్ ఫిలిం కేన్స్ చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శనకు రానుంది. ఈ ఫిలిం ఇప్పటికే అనేక చిత్రోత్సవాల్లో ప్రదర్శితమై విమర్శకుల ప్రశంసలను అందుకుంది. అలాగే 69వ కేన్స్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ‘షార్ట్ ఫిల్మ్ కార్నర్’ విభాగంలో ప్రదర్శనకు ఎంపికైంది. తనకు మగపిల్లాడు పుడతాడని భావించిన తండ్రి కి ఆడపిల్ల జన్మించడంతో ఆ చిన్నారిని వదిలేస్తాడు. అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో సాగే చిత్రం ‘తేజ్’. భాస్కర్ ఐటీ ఉద్యోగాన్ని వదిలి ఫిల్మ్ మేకింగ్ వైపు రెండేళ్ల కిందట అడుగులు వేశారు. చిన్ననాటి నుంచి తనకు సినిమాలపై ఆసక్తి ఉండేదని, కంప్యూటర్ సైన్స్ చదివినప్పటికీ తనలో ఉన్న ఆసక్తి తగ్గలేదని వివరించారు. ‘తేజ్’ చిత్రం ఆదివారం కేన్స్ చిత్రోత్సవాల్లో ప్రదర్శితం అవుతుందని వెల్లడించారు.