విభజనపై సుప్రీంకోర్టుకు మరో పిటిషన్
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనపై సుప్రీం కోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. చనుమోలు లక్ష్మీఅనుపమ అనే వ్యక్తి దాఖలు చేసిన ఈ పిటిషన్ కూడా మే 5న ఇతర అన్ని పిటిషన్లతో కలిపి విచారిస్తామని జస్టిస్ హెచ్.ఎల్.దత్తు, ఎస్.ఎ.బాబ్డేలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ప్రతివాదులైన కేంద్ర ప్రభుత్వం, క్యాబినెట్ కార్యదర్శికి సంబంధిత వ్యవహారంపై నోటీసులు జారీచేసింది.