Capacity Building
-
అమ్మకానికి మరో ఆరు సంస్థలు... కేంద్రం కసరత్తు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ రంగంలోని ఆరు సంస్థల (సీపీఎస్ఈ) ప్రైవేటీకరణ ప్రక్రియ వేగం పుంజుకుంటోంది. ఇందుకోసం డిసెంబర్–జనవరిలోగా ఫైనాన్షియల్ బిడ్లను ఆహ్వానించాలని కేంద్రం భావిస్తోంది. డిజిన్వెస్ట్‌మెంట్ ప్రక్రియకు సంబంధించిన పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (దీపం) కార్యదర్శి తుహిన్ కాంత పాండే బుధవారం ఈ విషయాలు తెలిపారు. ‘దాదాపు 19 ఏళ్ల తర్వాత ఈ ఏడాది 5–6 సంస్థల ప్రైవేటీకరణ ప్రక్రియ చూడబోతున్నాం. బీపీసీఎల్ మదింపు ప్రక్రియ జరుగుతోంది. దీనితో పాటు బీఈఎంఎల్, షిప్పింగ్ కార్పొరేషన్, పవన్ హన్స్, సెంట్రల్ ఎలక్ట్రానిక్స్, ఎన్ఐఎన్ఎల్ ఆర్థిక బిడ్లను డిసెంబర్–జనవరిలోనే ఆ హ్వానించవచ్చు’ అని ఆయన వివరించారు. బీమా రంగ దిగ్గజం ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ ఈ ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో (జనవరి–మార్చి) ఉండవచ్చని చెప్పారు. సీఐఐ గ్లోబల్ ఎకనామిక్ పాలసీ సదస్సు 2021లో పాల్గొన్న సందర్భంగా పాండే ఈ విషయాలు వివరించారు. అటు విమానయాన సంస్థ ఎయిరిండియాను డిసెంబర్‌లోగా కొనుగోలుదారుకు అప్పగించడం పూర్తవుతుం దని పేర్కొన్నారు. వేలంలో సుమారు రూ. 18,000 కోట్లకు ఎయిరిండియాను టాటా గ్రూప్ సంస్థ టాలేస్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఎయిరిం డియా విక్రయం పూర్తవడంతో సీపీఎస్ఈల ప్రైవేటీకరణ మరింత వేగవంతం కాగలదని పాండే చెప్పారు. ఇందుకోసం ప్రైవేట్ రంగం నుంచి కూడా సహకారం అవసరమని ఆయన వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉప సంహరణ ద్వారా రూ. 1.75 లక్షల కోట్లు సమీకరించాలని కేంద్రం నిర్దేశించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటిదాకా రూ.9,300 కోట్లు మాత్రమే సమీకరించగలిగింది. ఈ నేపథ్యంలోనే ఎల్ఐసీ లిస్టింగ్‌పై ప్రభుత్వం మరింతగా దృష్టి పెడుతోంది. రిస్కులు తీసుకోండి సామర్థ్యాలు పెంచుకునేందుకు ఇన్వెస్ట్ చేయండి దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించండి పరిశ్రమ వర్గాలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపు న్యూఢిల్లీ: కరోనాపరమైన సవాళ్ల నుంచి ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ నేపథ్యంలో రిస్కులు తీసుకోవాలని, సామర్థ్యాల పెంపుపై మరింతగా పెట్టుబడులు పెట్టాలని పరిశ్రమ వర్గాలకు ఆమె పిలుపునిచ్చారు. తద్వారా దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించవచ్చని పేర్కొన్నారు. ‘సామర్థ్యాలను పెంచుకోవడంలోనూ, కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడంలోను, టెక్నాలజీని ఇచ్చే భాగస్వాములతో చేతులు కలపడంలోనూ భారతీయ పరిశ్రమ మరింత జాప్యం చేయొద్దని కోరుతున్నాను’ అని సీఐఐ గ్లోబల్ ఎకనమిక్ పాలసీ సదస్సు 2021లో పాల్గొన్న సందర్భంగా సీతారామన్ తెలిపారు. దేశీయంగా తయారీ కోసం విడిభాగాలు, పరికరాలను దిగుమతి చేసుకోవడం వల్ల సమస్యేమీ లేదని.. కాని పూర్తి స్థాయి ఉత్పత్తుల దిగుమతులను మాత్రం తగ్గించుకోవాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. దిగుమతులపై ఎక్కువగా ఆధారపడటం వల్ల రిస్కులు ఉన్నందున.. దీనిపై పునరాలోచించాలని అభిప్రాయపడ్డారు. ‘మన దగ్గర మార్కెట్ ఉన్నప్పుడు, కొన్ని కమోడిటీలకు కొరత ఎందుకు ఏర్పడుతోంది, దిగుమతులపైనే పూర్తిగా ఆధారపడటం సరైనదేనా? దిగుమతులకు మనం తలుపులు మూసేయడం లేదు. కానీ మొత్తం ఉత్పత్తిని దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉందా. ఇలాంటి అంశాలను మనం పునరాలోచించుకోవాలి’ అని మంత్రి చెప్పారు. ఆదాయ అసమానతలు తగ్గించాలి .. ఆదాయ అసమానతలను తగ్గించేలా ఉపాధి అవకాశాలు కల్పించాలని, ఫినిష్డ్ ఉత్పత్తుల దిగుమతులను తగ్గించుకోవాలని పరిశ్రమకు నిర్మలా సీతారా>మన్ సూచించారు. వృద్ధికి ఊతమివ్వడానికి ప్రభుత్వం కృషి చేస్తున్న నేపథ్యంలో.. దేశీ పరిశ్రమ మరింతగా రిస్కులు తీసుకోవాలని, దేశానికి ఏం కావాలన్నది అర్థం చేసుకోవాలని ఆమె పేర్కొన్నారు. కొన్ని కాలం చెల్లిన చట్టాలను తీసివేయడంతో ఆగటం కాకుండా .. పరిశ్రమకు ఎదురవుతున్న ఆటంకాలను తొలగించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని మంత్రి చెప్పారు. వ్యాపారాలపై నిబంధనల భారాన్ని తగ్గించే దిశగా ఇంకా ఏమేమి చర్యలు తీసుకోవచ్చో పరిశీలించాలంటూ ప్రతి శాఖ, విభాగానికి ప్రధాని సూచించారని పేర్కొన్నారు. బ్యాంకింగ్ భేష్.. బ్యాంకింగ్ రంగం విశేష స్థాయిలో కోలుకుందని, రికవరీలు పెరిగే కొద్దీ మొండి బాకీలు క్రమంగా తగ్గడం మొదలైందని సీతారామన్ తెలిపారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు మార్కెట్ నుంచి రూ. 10,000 కోట్లు సమీకరించాయని, ప్రభుత్వంపై ఆధారపడటం లేదని ఆమె పేర్కొన్నారు. ప్రత్యేక ప్రోగ్రాం కింద దీపావళితో ముగిసిన మూడు వారాల్లో నాలుగైదు వర్గాల వారికి బ్యాంకులు ఏకంగా రూ. 75,000 కోట్ల మేర రుణాలు ఇచ్చినట్లు మంత్రి చెప్పారు. వర్ధమాన దేశం అత్యం వేగంగా కోలుకోవడంతో పాటు రెండంకెల స్థాయికి దగ్గర్లో వృద్ధి రేటును అందుకోవడం సాధ్యమేనంటూ ప్రపంచానికి భారత్ చాటి చెప్పిందని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. -
అర్బన్ ప్లానింగ్ బలోపేతం కావాలి: నీతిఆయోగ్
సాక్షి, న్యూఢిల్లీ: అర్బన్ ప్లానింగ్ సామర్థ్యం పెంపునకు కీలక సంస్కరణలు అవసరమని నీతిఆయోగ్ నివేదిక స్పష్టం చేసింది. ‘అర్బన్ ప్లానింగ్ సామర్థ్యంలో సంస్కరణలు’ పేరుతో రూపొందించిన నివేదికను నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ డాక్టర్ రాజీవ్‌కుమార్, సీఈవో అమితాబ్ కాంత్, ప్రత్యేక కార్యదర్శి డాక్టర్ కె.రాజేశ్వర్ రావు గురువారం ఇక్కడ విడుదల చేశారు. 9 నెలల పాటు సంబంధిత మంత్రిత్వ శాఖలు, పట్టణ ప్రణాళిక, ప్రాంతీయ ప్రణాళికల నిపుణులతో చర్చించి నీతి ఆయోగ్ ఈ నివేదికను రూపొందించింది. ‘రానున్న కాలంలో పట్టణ భారతదేశం దేశ ఆర్థిక వృద్ధికి శక్తిని ఇస్తుంది. పట్టణ ప్రణాళిక సహా పట్టణ సవాళ్లు అధిగమించేందుకు అత్యున్నత విధానాలపై శ్రద్ధ అవసరం. పట్టణ ప్రణాళిక సామర్థ్యంలో ఉన్న అంతరాలను పూడ్చాల్సిన అవసరం ఉంది. లేదంటే వేగవంతమైన, సుస్థిరమైన, సమానమైన వృద్ధికి గల భారీ అవకాశాలను కోల్పోవాల్సి వస్తుంది..’ అని డాక్టర్ రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. ‘ప్రభుత్వ, ప్రైవేటు రంగాల ఉమ్మడి కృషితో దేశంలోని నగరాలు మరింత నివాసయోగ్యంగా, సుస్థిర నగరాలుగా మారుతాయి..’ అని సీఈవో అమితాబ్ కాంత్ పేర్కొన్నారు. దేశంలోని 52 శాతం నగరాలకు మాస్టర్ ప్లాన్ లేదని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా 3,945 టౌన్ ప్లానర్ పోస్టులకు గాను 42 శాతం ఖాళీగా ఉన్నాయని పేర్కొంది. దేశంలో 12 వేలకు పైగా టౌన్ ప్లానర్ పోస్టులు అవసరమని సూచించింది. ప్రస్తుతం రాష్ట్రాల టౌన్ అండ్ కంట్రీ ప్లాన్ విభాగాల్లో సగటున నగరానికి ఒక ప్లానర్ కూడా లేరని నివేదిక పేర్కొంది. నివేదిక సిఫారసులు ► ఆరోగ్యకరమైన 500 నగరాలు: 2030 నాటికి ప్రతి నగరం అందరికీ ఆరోగ్యవంతమైన నగరం కావాలని ఆకాంక్షించాలి. ఈ దిశగా 500 హెల్తీ సిటీస్ ప్రోగ్రామ్‌ను ఐదేళ్ల పాటు అమలు చేసేలా కేంద్ర ప్రాయోజిత పథకాన్ని అమలు చేయాలి. ప్రాధాన్యత గల నగరాలు, పట్టణాలను రాష్ట్రాలు, స్థానిక సంస్థలు గుర్తించాలి. ► ప్రతిపాదిత హెల్తీ సిటీస్ ప్రోగ్రామ్ ద్వారా అన్ని నగరాలు, పట్టణాల్లో భూమి లేదా ప్రణాళిక ప్రాంత సామర్థ్యాన్ని పెంచేందుకు శాస్త్రీయ ఆధారాల ప్రాతిపదికన అభివృద్ధి నియంత్రణ నిబంధనలు బలోపేతం చేయాలి. ► ప్రభుత్వ రంగంలో అర్బన్ ప్లానర్ల కొరత తీర్చేందుకు రాష్ట్రాలు టౌన్ ప్లానర్ల ఖాళీలను భర్తీ చేయాలి. అలాగే మరో 8,268 పోస్టులను లాటరల్ ఎంట్రీ పొజిషన్స్గా కనీసం మూడేళ్లు, గరిష్టంగా ఐదేళ్లు ఉండేలా మంజూరు చేయడం ద్వారా కొరతను తీర్చాలి. ► పట్టణం, దేశ ప్రణాళిక విభాగాలు టౌన్ ప్లానర్ల కొరత ఎదుర్కొంటున్నందున రాష్ట్రాలు నియామక నిబంధనల్లో సవరణలు చేసి టౌన్ ప్లానింగ్ ఉద్యోగాల్లో అర్హులైన అభ్యర్థులు వచ్చేలా చర్యలు తీసుకోవాలి. ► పట్టణాలు ఎదుర్కొంటున్న సవాళ్లు పరిష్కరించేందుకు ప్రస్తుత పట్టణ ప్రణాళికా పాలనా నిర్మాణాన్ని రీ–ఇంజినీరింగ్ చేయాలి. ఇందుకు ఉన్నత స్థాయి కమిటీ రూపొందించాలి. ► పట్టణ, దేశ ప్రణాళిక చట్టాలను సమీక్షించి నవీకరించాలి. ఇందుకోసం రాష్ట్ర స్థాయిలో అపెక్స్ కమిటీ ఏర్పాటు చేయాలి. ► మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో వివిధ దశల్లో పౌరులను భాగస్వాములను చేయాలి. ► సాంకేతిక కన్సల్టెన్సీ సేవలు సహా పలు అంశాల్లో ప్రయివేటు రంగం పాత్రను బలోపేతం చేయాలి. ► కేంద్రీయ విశ్వ విద్యాలయాలు, సాంకేతిక విద్యా సంస్థలు దశల వారీగా ప్లానింగ్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కోర్సులు అందించాలి. ► కేంద్ర ప్రభుత్వ చట్టబద్ధమైన సంస్థగా ‘నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానర్స్’ను నెలకొల్పాలి. ‘నేషనల్ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానర్స్’ పోర్టల్‌ను ఏర్పాటు చేయడం ద్వారా టౌన్ ప్లానర్స్ రిజి్రస్టేషన్ చేసుకునే వెసులుబాటు కలి్పంచాలి. -
కార్పొరేషన్లుగా మూడు పట్టణాలు
మారనున్న మచిలీపట్నం, విజయనగరం, శ్రీకాకుళంల హోదా సాక్షి, విజయవాడ బ్యూరో: రాష్ట్రంలో మూడు పురపాలక సంఘాలు కార్పొరేషన్లుగా అప్‌గ్రేడ్ కానున్నాయి. మచిలీపట్నం, విజయనగరం, శ్రీకాకుళం మున్సిపాల్టీలను సాధ్యమైనంత త్వరగా కార్పొరేషన్లుగా మార్చడానికి పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ కసరత్తు చేస్తోంది. ఈ మూడింటి పరిధిలో భారీ ప్రాజెక్టులు ఏర్పాటు కానున్న నేపథ్యంలో వాటి సామర్థ్యం పెంచాలని(కెపాసిటీ బిల్డింగ్) నిర్ణయించింది. మచిలీపట్నంలో పోర్టుతోపాటు నౌకాశ్రయ ఆధారిత పరిశ్రమలు, పోర్టు సిటీని నిర్మించడానికి ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. అందుకే మచిలీపట్నాన్ని నగరంగా మార్చనుంది. పరిశ్రమలకు ప్రోత్సాహం రెండున్నర లక్షల జనాభా ఉన్న విజయనగరం మున్సిపాల్టీ ఇకపై కార్పొరేషన్‌గా అవతరించనుంది. లక్షన్నర జనాభా ఉన్న శ్రీకాకుళం మున్సిపాల్టీని కార్పొరేషన్‌గా మార్చడం ద్వా రా చుట్టుపక్కల ఏర్పాటు చేసే పరిశ్రమలకు ప్రోత్సాహం లభిస్తుందని అంచనా వేస్తోంది. కాగా కొత్తగా నాలుగు పట్టణాభివృద్ధి సంస్థ(ఉడా)ల ఏర్పాటుకు కసరత్తు పూర్తయింది. నెల్లూరు, కర్నూలు, అనంతపురంతోపాటు ఉభయ గోదావరి జిల్లాల కోసం గోదావరి ఉడా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.