'ఆ కేసు భయంతోనే రాజధానిని తరలిస్తున్నారు'
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసు భయంతోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాజధానిని అమరావతికి తరలించాలని తొందరపడుతున్నారని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత శైలజానాథ్ అన్నారు.
హైదరాబాద్లో సోమవారం ఆయన మాట్లాడుతూ....అమరావతికి వెంటనే రావాలని ఉద్యోగులను బెదిరించడం సరికాదన్నారు. హైదరాబాద్ పదేళ్లు ఉమ్మడి రాజధాని అనే విషయాన్ని సీఎం చంద్రబాబు మర్చిపోవద్దని శైలజానాథ్ సూచించారు.