CARACAS
-
వెనెజులాలో ట్రక్కు బీభత్సం.. 16 మంది మృతి
కారకాస్: వెనెజులా రాజధాని కారకాస్‌ను కలిపే జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న ట్రక్కు పలు కార్లను ఢీకొట్టుకుంటూ ముందుకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో 17 వాహనాలు ఒకదానినొకటి ఢీకొట్టి కుప్పగా రోడ్డుకు అడ్డంగా పడిపోయాయి. మంటల్లో చిక్కుకున్న వాహనాలు, ఉవ్వెత్తున ఎగసిన పొగతో కూడిన ఫొటోలు బుధవారం ఉదయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఘటనలో 16 మంది చనిపోగా ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా మారడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు. -
మరో దేశాధ్యక్షుడి ఫేస్బుక్ ఖాతా నిలిపివేత..!
కారకస్: తప్పుడు సమాచారాన్ని అరికట్టేందుకు ఫేస్బుక్ తగు చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఫేక్ న్యూస్, తప్పుడు సమాచారం ఇచ్చే వారిపై ఫేస్బుక్ ఉక్కుపాదం మోపుతోంది. అందులో భాగంగా తప్పుడు సమాచారాన్ని ఫేస్బుక్లో షేర్ చేసినందుకు గాను వెనుజులా అధ్యక్షుడి ఖాతాను ఫేస్బుక్ నిలిపివేసింది. వెనుజులా అధ్యక్షుడు నికోలస్ మడురో , ఏలాంటి ఆధారం లేకుండా కోవిడ్-19ను నివారించే రెమిడీ గురించి షేర్ చేసినందుకు గాను ఫేస్బుక్ ఆయన ఖాతాను నిలిపివేసింది. నికోలస్ తన అధికారిక ఫేస్బుక్ ఖాతా నుంచి కోవిడ్-19కు సదరు మెడిసిన్ నయం చేస్తోందని పోస్ట్ చేశారు. కాగా జనవరి నెలలో ‘కార్వాటివిర్’ అనే మెడిసిన్‌తో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా కరోనా వైరస్‌ను తగ్గించవచ్చునని మడురో పేర్కొన్నారు. ఈ మెడిసిన్ పనిచేస్తోందని వైద్యులు, శాస్త్రవేత్తలు ఎక్కడా నిర్ధారించలేదు.ఫేస్బుక్ పాలసీలకు వ్యతిరేకంగా ఉన్నందున నికోలస్ మడురో షేర్ చేసిన వీడియోను తొలగించింది. వీడియోలో ఉన్న సమాచారానికి ఎలాంటి నిర్ధారణ లేకపోవడంతో పోస్ట్ ను తీసివేశామని ఫేస్బుక్ తెలిపింది. మరోవైపు ఫేస్బుక్ తన ఖాతాను నిలిపివేయడాన్ని నికోలస్ మడురో ఖండించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన ఆదేశాల ప్రకారం కోవిడ్-19పై తప్పుడు సమాచారం ఇచ్చే వారిపై కఠినచర్యలు తీసుకుంటామని ఫేస్బుక్ ప్రతినిధి తెలిపారు. ప్రైవసీ పాలసీలకు వ్యతిరేకంగా ఫేస్బుక్లో పోస్ట్ చేసిన వారికి ముందుగా సమాచారం ఇస్తామని పేర్కొన్నారు. తర్వాత వారిపై తగు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం వెనుజులాలో శుక్రవారం నాటికి మొత్తం 1,54,905 కరోనా కేసులు నమోదవ్వగా, మృతుల సంఖ్య 1,543గా ఉంది. తక్కువ సంఖ్యలో కోవిడ్ టెస్ట్‌లను చేస్తోన్నందున కేసుల సంఖ్య తక్కువగా ఉందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. చదవండి: ఫేస్బుక్లో ఆ రికమెన్‌డేషన్‌లుండవు...! -
అందాల రాశిని హత్య చేసి 30 ఏళ్లు జైలు పాలు
కారాకస్: వెనెజులా సుందరి మోనికా స్పేర్ (29) హత్య కేసులో ముగ్గురు వ్యక్తులకు ముప్పై ఏళ్ల జైలు శిక్షపడింది. వారికి కఠినకారాగార శిక్ష విధిస్తూ ఉత్తర కారాబోబోలోని కోర్టు తీర్పు చెప్పింది. 'ఒక దొంగతనానికి పాల్పడే క్రమంలో వారు చేసింది ఉద్దేశ పూర్వక హత్యే' అని ఈ సందర్భంగా కోర్టు పేర్కొంది. మోనికా స్పేర్ 2004లో మిస్ వెనిజులా అందాల పోటీలో పాల్గొని కిరీటాన్ని దక్కించుకుంది. అదే మిస్ యూనివర్స్ పోటీలో కూడా పాల్గొంది. అనంతరం పలు టీవీ కార్యక్రమాల్లో కూడా నటించింది. ఆమె ఒక రోజు తన భర్త హెన్రీ బెర్రీ (39) కూతురుతో కలిసి ఓ టూర్‌కి వెళ్లి తిరిగొస్తుండగా ఓ ఎజెన్సీ ప్రాంతంలో ముగ్గురు దొంగలు వారి వాహనాన్ని ఆపేశారు. వారికి సహాయం చేద్దామని ఓ ట్రక్కు డ్రైవర్ ప్రయత్నించినా అప్పటికే ఆ ముగ్గురు వారి కారుపై విచ్చల విడిగా కాల్పులు జరిపి వారిని దోచుకొని వెళ్లారు. ఈ కాల్పుల్లో మోనికా, ఆమె భర్త మరణించగా కూతురుకు గాయాలయ్యాయి. ఈ కేసును విచారించిన కోర్టు అంతకు ముందు ఇందులో కొంత పాత్ర ఉన్న 15, 17 ఏళ్ల ఇద్దరు యువకులకు నాలుగేళ్ల జైలు శిక్షను విధించడంతోపాటు మరో ముగ్గురుకి 30 ఏళ్ల జైలు శిక్ష విధించింది. మరో మహిళకు 10 ఏళ్ల జైలు శిక్ష పడింది. -
జైలు నుంచి 41 మంది ఖైదీలు పరారీ
కరకాస్: మధ్య వెనిజులా నగరమైన మిరండా రాష్ట్రంలోని లాస్ టిక్యూస్ నగరంలోని జైలు నుంచి దాదాపు 41 మంది ఖైదీలు పరారైయ్యారు. జైలు గోడకు రంధ్రం చేసి వీరంతా బుధవారం తెల్లవారుజామున పరారైయ్యారని ఆ దేశ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి గురువారం వెల్లడించారు. పరారైన నిందితుల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టినట్లు వివరించారు. అయితే జైలులో పరిమితికి మించి ఖైదీలు ఉన్నారని అందువల్లే.... వారు పరారైయ్యారని స్థానిక పత్రిక పేర్కొంది. ఖైదీలు పరారైయ్యే సమయంలో జైల్లో 130 మంది ఖైదీలు ఉన్నారని వెల్లడించింది. పరారైన ఖైదీలలో హత్య, వాహనాలు దొంగతనం, కిడ్నాపింగ్ కేసులు నమోదు అయిన వారు ఉన్నారని తెలిపింది. -
భారీ బ్రెడ్
మీటర్లకొద్దీ పొడవున్న బ్రెడ్‌ను మీరెప్పుడైనా చూశారా. చూడలేదేమో. అయితే ఇక్కడ చూడండి. ఈ బ్రెడ్ పొడవు ఏకంగా 20 మీటర్లు. లోపలి వైపు పంది మాంసం ఉండే ఈ పొడవైన బ్రెడ్ బరువు 284 కేజీలు. శనివారం వెనిజులా దేశంలోని కారకస్ నగరంలో నిర్వహించిన ‘కుక్ ఎ థాన్’ కార్యక్రమంలో ఇంతటి భారీ బ్రెడ్‌ను తయారుచేశారు. గిన్నిస్ ప్రపంచ రికార్డ్స్ సంస్థ నిర్వాహకులు దీనికి అధికారికంగా రికార్డు పత్రాన్ని ఇవ్వాల్సి ఉంది. క్రిస్మిస్ సంబరాల్లో భాగంగా దేశ ఆహార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. 120 మీటర్ల పొడవైన లాటిన్ అమెరికా సంప్రదాయ వంటకం హల్లకా, 12,000 లీటర్ల చెరుకు, నిమ్మరసం మిశ్రమాన్ని సైతం గిన్నిస్ రికార్డులను బద్దలుకొట్టేందుకు తయారుచేశారు.