Cardboard
-
వివాహం: కార్డ్ బోర్డు కట్ అవుట్లే అతిథులు
పెళ్లి కళ అంటారు కానీ, ఆ కళ వధూవరులకు వాళ్లకై వాళ్లకు వచ్చేది కాదు. వస్తూ వస్తూ.. పెళ్లికి వచ్చేవాళ్లు తెచ్చేది. కరోనా వల్ల ఇప్పుడు వాళ్లు రాక, రాలేక లోకానికే పెళ్లి కళ తప్పింది. అటిద్దరు, ఇటిద్దరు! చేసుకుని ఏం లాభం అని అమ్మాయి అబ్బాయి నిరుత్సాహంగానే పీటల పై కూర్చుంటున్నారు. ఏదో.. చేసుకుంటున్నామంతే అన్నట్లు నీరసంగా దండలు మార్చుకుంటున్నారు. ఇప్పుడంటే సరే.. పదేళ్లకో, పాతికేళ్లకో పెళ్లి ఫోటోలు చూసుకోవాలనిపించదా.. అప్పుడూ నీరసమే కదా.. పెళ్లి వేడుకలో ఆకాశమంత పందిరి కనిపించి, ఆ పందిరి కింద పెళ్లికి రాని వారు కనిపించకపోతే! అందుకే ఇంగ్లండ్ లో ఓ పెళ్లిజంట 2 లక్షల రూపాయలు ఖర్చుపెట్టి (రెండు వేల పౌండ్ లకు పైగా) 48 మంది గెస్టుల్ని పెళ్లికి ’తెప్పించుకుంది’. అక్కడ ప్రస్తుతం అమల్లో ఉన్న కరోనా నిబంధనల ప్రకారం పెళ్లిలో 30 మందికి మించి కనిపించడానికి లేదు. మరి వీళ్లు అంతమందిని ఎలా తెప్పించుకున్నారు? కార్డ్ బోర్డులతో వాళ్ల కట్ అవుట్ లు చేయించుకుని, పెళ్లికి ట్రాన్స్ పోర్ట్ చేయించుకున్నారు. వాటి పక్కన నిలబడి ఫొటోలు తీయించుకున్నారు. పెళ్లికూతురి పేరు రోమీ. ఆమెదేనట ఈ ఐడియా. ’వావ్’ అంటూ ఆమెను ఆరాధనగా చూడ్డానికే సరిపోయిందట పెళ్లి కొడుకు స్మిత్ కి.. పెళ్లి రోజంతా. -
ఒకే వేదికపై మోదీ, విజయన్, పోప్!
కొట్టాయం: ప్రధాని నరేంద్ర మోదీ, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, పోప్ ఫ్రాన్సిస్ వీరంతా కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో లాక్డౌన్ అమలవుతుండగా ఇదెలా సాధ్యమని అనుకుంటున్నారా? దీనికి గురించి తెలుసుకోవాలంటే కేరళలోని ఎలక్కాడ్ ప్రాంతానికి వెళ్లాలి. స్థానిక సెయింట్ మెరీస్ చర్చిలో ఆదివారం వీరి అట్ట బొమ్మలను కుర్చీల్లో పెట్టారు. తర్వాత ఈ బొమ్మలకు చర్చి ఫాదర్ పాల్ చలవీటిల్ శాలువాలు కప్పి సన్మానం చేశారు. ‘కరోనా వైరస్ మహమ్మారిని తరిమికొట్టేందుకు అహర్నిశలు పాటుపడుతున్న ప్రధాని మోదీని సముచితంగా అభినందించాలని అనుకున్నాం. కేరళలో కోవిడ్ నివారణ చర్యలకు సమర్థవంతంగా అమలు చేస్తున్నందుకు ముఖ్యమంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి, ఇతరులకు ధన్యవాదాలు తెలపాలన్న ఉద్దేశంతో ఈ బొమ్మల సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశామ’ని పాల్ తెలిపారు. కేరళ ఆరోగ్య శాఖ మంత్రి కేకే శైలజ, డాక్టర్లు, నర్సులు, పారిశుద్ధ్య కార్మికులు, మీడియా ప్రతినిధుల బొమ్మలకు కూడా ఈ సందర్భంగా సన్మానం చేశారు. చర్చి ద్వారా సేకరించిన లక్ష రూపాయల నగదును ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇవ్వనున్నట్టు పాల్ తెలిపారు. కేంద్రం ఆగ్రహం: వెనక్కి తగ్గిన కేరళ! -
కరోనా ఏ వస్తువుపై ఎన్ని రోజులు ఉంటుందంటే..
న్యూఢిల్లీ : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ కనిపెట్టడానికి శాస్త్రవేత్తలు, పరిశోధకులు తీవ్రంగా శ్రమిస్తున్నా సంగతి తెలిసిందే. అయితే కరోనాకు మందు లేకడపోవడంతో.. దాని వ్యాప్తిని అడ్డుకోవడానికి ప్రపంచ దేశాలన్నీ కృషి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే వైరస్ వ్యాప్తికి సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో), సెంటర్ ఫర్ డిసిజ్ కంట్రోల్(సీడీసీ) లోతైన పరిశోధనలు జరుపుతున్నాయి. వైరస్ ఎలా వ్యాపిస్తుంది, ఏయే వస్తువులపైన ఎంత సేపు ఉంటుందనే దానిపై పరీక్షలు కొనసాగుతున్నాయి. అందుకే వైరస్ ఎక్కువ కాలం నిలిచి ఉండే వస్తువులకు దూరంగా ఉండాలని నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. వస్తువుల ఉపరితలాలపై కరోనా వైరస్ నిలిచే ఉండే కాలం అక్కడి ఉష్ణోగ్రతలపై కూడా ఆధారపడి ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. ప్లాస్టిక్ : కాపర్ మంచి ఉష్ణ కారకం కాకపోవడం వల్ల దాని ఉపరితలంపై కరోనా వైరస్ 2 నుంచి 3 రోజులపాటు నిలిచి ఉంటుంది. అందుకే మిల్క్ ప్యాకెట్లను, ప్లాస్టిక్ బాటిళ్లతోపాటుగా ప్లాస్టిక్ సంబంధిత వస్తువులను వాడేవారు వాటిని తప్పనిసరిగా సబ్బుతోగానీ, నీటితో గానీ శుభ్రపరచాలి. ముఖ్యమైన వస్తువులు తప్ప మిగిలిన ప్లాస్టిక్ వస్తువులను మట్టుకోకుండా దూరంగా పెట్టడం మంచింది. బయటకు వెళ్లినప్పుడు ప్టాస్టిక్ వస్తువులను ముట్టుకుంటే వెంటనే చేతులు శుభ్రపరచుకోవడం మంచింది. స్టెయిన్లెస్ స్టీల్ : ప్రస్తుతం వంట గదిలో వినియోగించే వాటిలో ఎక్కువగా స్టెయిన్లెస్ స్టీల్ వస్తువులే కనిపిస్తున్నాయి. వీటిపై కూడా కరోనా వైరస్ 2 నుంచి 3 రోజులపాటు నిలిచి ఉండే అవకాశం ఉంది. అందుకే కిచెన్‌లోని వస్తువులను రోజుకు ఒక్కసారైనా శుభ్రపరుచుకోవాలి. అలాగే మనం రోజువారి అవసరాల కోసం వినియోగించుకునే వాటిని ఒక పక్కకు ఉంచి వాటిని మాత్రమే తరుచూ శుభ్రపరుచుకుంటే వైరస్ వ్యాపించే అవకాశం తగ్గుతుంది. ఇంట్లోని టీవీ స్ర్కీన్‌ను 70 శాతం అల్కహాల్ కలిగిన ద్రావణాలతో శుభ్రపరచాలి. అట్టపెట్టెలు : అట్టపెట్టెలపై కరోనా వైరస్ ఒక్క రోజు వరకు నిలిచి ఉండే అవకాశం ఉంది. అయితే ఇవి అంతా ప్రమాదకరం కాకపోయినప్పటికీ.. వాటిని ముట్టుకున్న అనంతరం చేతులు శుభ్రపరుచుకోవడం వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చు. ఇంట్లో వినియోగించే వస్తువులు.. : మనం నిత్యం వినియోగించే బెడ్ షీట్స్, కూరగాయలు, పండ్లు.. వంటి వాటి ద్వారా వైరస్ వ్యాప్తి అవకాశం తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ వాటిని శుభ్రంగా ఉంచుకోవడం ఉత్తమం. ముఖ్యంగా పండ్లు, కూరగాయలు బయటి నుంచి తెచ్చుకున్నప్పుడు వాటిని శుభ్రపరడం.. మళ్లీ వినియోగించేటప్పుడు నీటితో కడుక్కోవడం చేయాలి. కాగా, పలు పరిశోధనల్లో కరోనా వైరస్ వ్యాప్తికి సంబంధించి అనేక కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే ప్రస్తుతానికి ప్రతి ఒక్కరు కరోనా నియంత్రణ కోసం భౌతిక దూరం పాటించాలని, తరుచూ చేతులను కడుక్కోవాలని డబ్ల్యూహెచ్‌వో సూచించింది. ముఖ్యంగా నోరు, ముక్కు ద్వారా వైరస్ మానవ శరీరంలోకి ప్రవేశిస్తుండటంతో.. చేతులు కడగకుండా నోటిని, ముఖాన్ని ముట్టుకోవద్దని హెచ్చరించింది. ఒక మనిషి దగ్గినప్పుడు దాదాపు 3 వేల తుంపర్లు బయటకు వచ్చే అవకాశం ఉండటంతో.. జనసమర్థం ఎక్కువగా ఉన్న ప్రదేశాలకు దూరంగా ఉండాలని ప్రజలను కోరుతుంది. ఇప్పటికే కరోనా కట్టడి కోసం అనేక దేశాలు లాక్డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
గాజులతో పెన్సిల్ స్టాండ్
తయారు చేసి చూడండి పాత గాజులతో అందమైన పెన్సిల్ స్టాండు ఎలా చేయొచ్చో తెలుసుకుందామా! కావలసినవి: పాతగాజులు (దాదాపు ఒకే సైజులో ఉండేవి), జిగురు, దళసరి అట్ట, కత్తెర, పెన్సిల్. ఎలా చేయాలి? ఒక పెద్ద గాజును తీసుకొని దళసరి అట్టపై ఉంచండి. దానిచుట్టూ పెన్సిల్‌తో గీత గీయండి. గీతగీసిన మేరకు కత్తెరతో అట్టను కత్తిరించాలి. ఇప్పుడు ఆ గుండ్రని అట్టముక్కను ఆధారంగా చేసుకొని ఒక గాజును జిగురుతో అతికించండి. దానిపై మరొకటి... దానిపై ఇంకొకటి... అలా వాటి ఎత్తు నాలుగైదు అంగుళాలు వచ్చేవరకు గాజుల్ని వరుసగా ఒకదానిపై ఒకటి అతికిస్తూ పోవాలి. జిగురు ఆరే వరకూ గాజులు కదపకుండా చూసుకోవాలి. ఆపై పెన్సిల్ స్టాండ్ రెడీ. అందమైన డిజైన్లు ఉన్న గాజులు తీసుకుంటే మీ స్టాండు మరింత ఆకర్షణీయంగా తయారవుతుంది. ఒకవేళ గాజులు మరీ పాతగా అనిపిస్తే మీకు నచ్చిన రంగుల్లో పెయింట్ వేసి ఆరాక రంగురంగుల చమ్కీలు, పూసలు, చిన్నచిన్న అద్దాలు అతికించవచ్చు లేదా పెయింట్‌తోనే డిజైన్లూ వేసుకొవచ్చు. మీకు నచ్చిందా?