cascade mall
-
అతడు జాంబీలా ప్రవర్తించాడు
జయం రవి హీరోగా వచ్చిన 'మిరుదన్' సినిమా చూశారా.. అందులో ఒక రేడియోధార్మిక పదార్థం కారణంగా మనుషులంతా 'జాంబీ'లుగా మారిపోతారు. అవతలివాళ్లను కొరికేసి రక్తం తాగుతుంటారు. అలా చేయగానే అవతలివాళ్లు కూడా జాంబీలుగా మారిపోతారు. నిజంగా జాంబీలు ఉన్నారా అంటే.. ఏమో నిజమే అయి ఉండొచ్చని అమెరికా పోలీసులు చెబుతున్నారు. వాషింగ్టన్‌లోని ఒక మాల్లో కాల్పులు జరిపిన నిందితుడు జాంబీలాగే ప్రవర్తించాడని అంటున్నారు. దాదాపు 24 గంటల పాటు విస్తృతంగా గాలించి అతడిని అరెస్టు చేశారు. దాంతో ఒక్కసారిగా అందరూ ఊపిరి పీల్చుకున్నారు గానీ, అసలు అతడు ఎందుకు ఆల్పులు జరిపాడన్నది మాత్రం ఇంకా ప్రశ్నార్థకంగానే మిగిలింది. శనివారం సాయంత్రం పోలీసు అధికారి లెఫ్టినెంట్ మైక్ హాలీ పెట్రోలింగ్ కోసం వెళ్తుండగా ఉన్నట్టుండి ఆయనకు ఆర్కన్ సెటిన్ అనే ఈ నిందితుడు కనిపించాడు. తాను ఒక్కసారిగా బ్రేకులు నొక్కి.. బండి తిప్పి, అతడిని బయటకు దూకానని తనతోపాటు ఉన్న మరో అధికారి కూడా తుపాకులు బయటకు తీసి అతడిని హెచ్చరించామని హాలీ చెప్పారు. ఆ సమయానికి సెటిన్ వద్ద ఆయుధాలు ఏమీ లేవు. ఒక ల్యాప్‌టాప్ మాత్రమే ఉంది. కానీ, అదడు మాత్రం జాంబీలాగే ప్రవర్తించాడని ఆయన అన్నారు. కాస్కేడ్ మాల్లో సెటిన్ జరిపిన కాల్పుల్లో మొత్తం ఐదుగురు మరణించిన విషయం తెలిసిందే. ఇంతకుముందు కూడా అతడు ఓసారి అరెస్టయ్యాడు. అయితే అది తాగి వాహనం నడిపిన కేసులోనని స్థానిక పత్రికలు అంటున్నాయి. దానికి తోడు మూడు గృహహింస కేసులు కూడా ఉన్నాయి. తన సవతి తండ్రిని విపరీతంగా కొట్టేవాడని, అందుకే ఈ కేసులు ఉన్నాయని తెలుస్తోంది. -
అమెరికాలో కాల్పులు.. నలుగురి మృతి
-
అమెరికాలో కాల్పులు.. నలుగురి మృతి
అగ్రరాజ్యం అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం రేగింది. మాల్‌లోకి చొరబడిన దుండగుడు (లు?) కాల్పులు జరపడంతో నలుగురు మరణించారు. సీటిల్ నగరానికి ఉత్తరంగా ఉన్న బర్లింగ్టన్లోని ఈ మాల్లో కాల్పులు జరిపినవారు పోలీసులు అక్కడికి చేరుకునేలోపే అక్కడి నుంచి పరారయ్యారు. నలుగురు మరణించిన విషయాన్ని వాషింగ్టన్ రాష్ట్ర పోలీసు శాఖకు చెందిన సార్జంట్ మార్క్ ఫ్రాన్సిస్ నిర్ధారించారు. ప్రస్తుతం ఆ మాల్‌ను క్లియర్ చేస్తున్నట్లు ఆయన చెప్పారు. మాల్లో ఉన్న క్షతగాత్రులను బస్సులో 'హిజ్ ప్లేస్' చర్చి వద్దకు తీసుకెళ్తామని కూడా ఆయన చెప్పారు. అత్యవసర వైద్యసేవల బృందం మాల్ వద్దకు చేరుకుంది. పోలీసు రక్షణతో వచ్చిన ఆ బృందం.. గాయపడిన వారికి అత్యవసరంగా చేయాల్సిన వైద్యసేవలు అందిస్తోంది. 1990లో బర్లింగ్టన్లో ప్రారంభమైన కాస్కేడ్ మాల్లో జేసీ పెన్నీ, టీజే మాక్స్, మేసీస్ స్టోర్స్, మరికొన్ని స్టోర్లు, రెస్టారెంట్లు, ఒక థియేటర్ ఉన్నాయి. దీంతో అక్కడకు స్థానికులు బాగానే వస్తుంటారు. అలాంటి మాల్లో ఉన్నట్టుండి కాల్పులు జరగడంతో అంతా భయభ్రాంతులకు లోనయ్యారు. గన్ కల్చర్ గురించి విపరీతంగా చర్చలు నడుస్తున్న తరుణంలో మళ్లీ కాల్పులు జరగడం సంచలనం సృష్టించింది. 4 confirmed deceased in the mall, shooter(s) left scene b4 police arrived, unknown # of shooter, possibly just 1, police clearing mall now — Sgt. Mark Francis (@wspd7pio) 24 September 2016 EMS starting to enter to attend to injured inside Mall w/ police escort and after initial clearance. pic.twitter.com/Nkfb7co6sa — Sgt. Mark Francis (@wspd7pio) 24 September 2016