
అతడు జాంబీలా ప్రవర్తించాడు
జయం రవి హీరోగా వచ్చిన 'మిరుదన్' సినిమా చూశారా.. అందులో ఒక రేడియోధార్మిక పదార్థం కారణంగా మనుషులంతా 'జాంబీ'లుగా మారిపోతారు. అవతలివాళ్లను కొరికేసి రక్తం తాగుతుంటారు. అలా చేయగానే అవతలివాళ్లు కూడా జాంబీలుగా మారిపోతారు. నిజంగా జాంబీలు ఉన్నారా అంటే.. ఏమో నిజమే అయి ఉండొచ్చని అమెరికా పోలీసులు చెబుతున్నారు. వాషింగ్టన్‌లోని ఒక మాల్‌లో కాల్పులు జరిపిన నిందితుడు జాంబీలాగే ప్రవర్తించాడని అంటున్నారు. దాదాపు 24 గంటల పాటు విస్తృతంగా గాలించి అతడిని అరెస్టు చేశారు. దాంతో ఒక్కసారిగా అందరూ ఊపిరి పీల్చుకున్నారు గానీ, అసలు అతడు ఎందుకు ఆల్పులు జరిపాడన్నది మాత్రం ఇంకా ప్రశ్నార్థకంగానే మిగిలింది.
శనివారం సాయంత్రం పోలీసు అధికారి లెఫ్టినెంట్ మైక్ హాలీ పెట్రోలింగ్ కోసం వెళ్తుండగా ఉన్నట్టుండి ఆయనకు ఆర్కన్ సెటిన్ అనే ఈ నిందితుడు కనిపించాడు. తాను ఒక్కసారిగా బ్రేకులు నొక్కి.. బండి తిప్పి, అతడిని బయటకు దూకానని తనతోపాటు ఉన్న మరో అధికారి కూడా తుపాకులు బయటకు తీసి అతడిని హెచ్చరించామని హాలీ చెప్పారు. ఆ సమయానికి సెటిన్ వద్ద ఆయుధాలు ఏమీ లేవు. ఒక ల్యాప్‌టాప్ మాత్రమే ఉంది. కానీ, అదడు మాత్రం జాంబీలాగే ప్రవర్తించాడని ఆయన అన్నారు. కాస్కేడ్ మాల్‌లో సెటిన్ జరిపిన కాల్పుల్లో మొత్తం ఐదుగురు మరణించిన విషయం తెలిసిందే. ఇంతకుముందు కూడా అతడు ఓసారి అరెస్టయ్యాడు. అయితే అది తాగి వాహనం నడిపిన కేసులోనని స్థానిక పత్రికలు అంటున్నాయి. దానికి తోడు మూడు గృహహింస కేసులు కూడా ఉన్నాయి. తన సవతి తండ్రిని విపరీతంగా కొట్టేవాడని, అందుకే ఈ కేసులు ఉన్నాయని తెలుస్తోంది.