Cases file
-
జిందాల్‌పై అభియోగాలు నమోదుచేయండి
న్యూఢిల్లీ: బొగ్గు బ్లాకుల కేటాయింపు కుంభకోణానికి సంబంధించిన కేసులో పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్, మరో నలుగురిపై అభియోగాలు నమోదు చేయాలని ప్రత్యేక కోర్టు సోమవారం దర్యాప్తు సంస్థను ఆదేశించింది. జిందాల్‌తో పాటు మరో నలుగురిపై భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 420 (చీటింగ్), 120–బి (క్రిమినల్ కుట్ర) కింద అభియోగాలు మోపాలని ప్రత్యేక న్యాయమూర్తి భరత్ పరాషర్ ఆదేశించారు. జిందాల్‌తోపాటు, జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ మాజీ డైరెక్టర్ సుశీల్ మరూ, మాజీ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ గోయల్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ విక్రాంత్ గుజ్రాల్, కంపెనీ అధీకృత ఉద్యోగి డీఎన్ అబ్రోల్‌పై అభియోగాలు మోపారు. మధ్యప్రదేశ్‌లోని బొగ్గు బ్లాకుల కేటాయింపునకు సంబంధించిన విషయాన్ని కోర్టు విచారించింది. నిందితులపై అభియోగాలను అధికారికంగా ప్రకటించేందుకు జూలై 25 వరకు సమయం ఇచ్చింది. -
వేర్వేరు రైలు ప్రమాదాల్లో ముగ్గురి మృతి
ఏలూరు అర్బ : జిల్లాలో జరిగిన వేర్వేరు రైలు ప్రమాదాల్లో ముగ్గురు మృత్యువాత పడ్డారు. రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. మేఘాలయలో పోలీసు కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఎ.బి.నాయక్ (50) విజయవాడ నుంచి వైజాగ్ Ðð వెళ్తున్నాడు. ఈ నేపథ్యంలో రైలు నూజివీడు స్టేష¯ŒS చేరుకునే సరికి సోమవారం రాత్రి కంపార్ట్మెంట్ గుమ్మంలో నిలబడిన అతను ప్రమాదవశాత్తూ పట్టాలపై పడిపోయి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న రైల్వే ఎస్ఐ ఎ¯ŒS.రాము ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. భీమడోలు వద్ద.. రాజమండ్రి నుంచి ఏలూరు వస్తున్న మరో యువకుడు భీమడోలు రైల్వేస్టేçÙ¯ŒS సమీపంలో ప్రమాదవశాత్తూ రైలు నుంచి జారిపడి మృతిచెందాడు. స్థానిక వెంకటాపురం పంచాయితీ నెహ్రూనగర్–2కు చెందిన దుప్పాల హేమారావు (20) అనే యువకుడు మూడు రోజుల కిందట కుటుంబ పనులపై రాజమండ్రి వెళ్లాడు. తిరిగి ఏలూరు వచ్చేందుకు మంగళవారం రైలు ఎక్కాడు. రైలు భీమడోలు స్టేష¯ŒS చేరుకునే సరికి హేమారావు రైలు నుంచి జారి పట్టాలపై పడిపోయాడు. తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మరణించాడు. స్థానికుల సమాచారం మేరకు రైల్వే హెడ్ కానిస్టేబుల్ ఎస్.వి.జాన్స¯ŒS ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. గుర్తుతెలియని వ్యక్తి.. ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం రైలు పట్టాలపై లభ్యమైంది. భీమడోలు జ్యూట్‌మిల్ వంతెన సమీపంలో పట్టాలపై మృతదేహం పడి ఉందని సమాచారం అందడంతో రైల్వే హెడ్ కానిస్టేబుల్ ఎస్.వి.జాన్స¯ŒS ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికులను విచారించినా ఫలితం లేకపోవడంతో గుర్తు తెలియని మృతదేహంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుని శరీరంపై నిలువు నీలం చారల పసుపురంగు చొక్కా, సిమెంటు రంగు ప్యాంటు ఉన్నాయని హెచ్‌సీ తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. -
రేషన్ దుకాణాలపై విజిలెన్స్ దాడులు
ఆచంట : ఆచంట నియోజకవర్గంలోని ఆచంట, పెనుమంట్ర మండలాల్లో గురువారం పలు రేషన్ దుకాణాలపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఆచంటలో 6,8 నంబర్ల దుకాణాల్లో అక్రమ నిల్వలు గుర్తించారు. ఇక్కడ 890 లీటర్ల అదనపు కిరోసిన్ ఉన్నట్టు గుర్తించారు. రేషన్ డీలరు అందుబాటులో లేకపోవడంతో బియ్యం నిల్వ చేసిన గదిని సీజ్ చేశారు. ముందుగా పెనుమంట్ర మండలం పెనుమంట్ర గ్రామంలో 22, 24, 25 రేషన్ దుకాణాల్లో తనిఖీలు నిర్వహించి నిల్వల్లో తేడాలు ఉన్నట్టు గుర్తించారు. వీటిపై 6 ఏ కేసులు నమోదు చేశారు. విజిలెన్స్ తహసిల్దార్ వి.శైలజ, ఎస్సై వి.సీతారామరాజు, ఏవో ఎం.శ్రీనివాస్ కుమార్, ఏజీ జె.జయప్రసాద్ పాల్గొన్నారు. విజిలెన్స్ ఎస్పీ వి.సురేష్‌బాబు ఆదేశాల మేరకు దాడులు నిర్వహించామని చెప్పారు. -
టీడీపీ నేత ప్రదీప్ చౌదరిపై గురి
సాక్షి, హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో ఏసీబీ విచారణ ఎదుర్కొంటున్న జూబ్లీహిల్స్ నియోజక వర్గం శ్రీనగర్ కాలనీ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ప్రధాన అనుచరుడైన వి.ప్రదీప్ చౌదరిపై జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో గతంలో బెదిరింపుల కేసు నమోదైంది. ఈ కేసును ఇప్పుడు పోలీసులు తిరగదోడుతున్నారు. ఈ కేసులో ప్రదీప్ చౌదరి ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసు రికార్డులు తెలుపుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే...బంజారాహిల్స్ రోడ్ నెం. 2లోని ప్లాట్ నెం.697లో 7069 గజాల స్థలాన్ని కె.రవీందర్‌రెడ్డి అనే వ్యక్తి 1995లో జూబ్లీహిల్స్‌కు చెందిన జగదీశ్వర్‌రావుతో డెవలప్మెంట్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. 2005 జనవరి 13న ప్రదీప్‌చౌదరి, జగదీశ్వర్‌రావు, మాగంటి గోపినాథ్, అమర్‌గౌడ్‌లతో పాటు 25 మంది రౌడీలు ఈ ప్లాట్‌ను ఆక్రమించడమే కాకుండా అక్కడ ఉన్న రవీందర్‌రెడ్డి మనుషులను బెరించి తరిమికొట్టారు. దీంతో రవీందర్‌రెడ్డి మేనేజర్ జి.తిరుమల్‌రెడ్డి అదే రోజు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేలోపే ప్రదీప్‌చౌదరితో పాటు రౌడీలంతా అక్కడి నుంచి పరారయ్యారు. జూబ్లీహిల్స్ పోలీసులు ఈ కేసులో ఏ-1గా జగదీశ్వర్‌రావు, ఏ-2గా మాగంటి గోపినాథ్, ఏ-3గా ప్రదీప్‌చౌదరి, ఏ-4గా అమర్‌గౌడ్‌తో పాటు 22 మందిపై ఐపీసీ సెక్షన్ 147, 148, 452, 506, 7(1) ఆఫ్ క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్స్ కింద కేసులు నమోదు చేశారు. అయితే, ఈ కేసులో వీరంతా ముందస్తు బెయిల్ పొందారు. ఇప్పటికీ ఈ కేసు పెండింగ్‌లోనే ఉంది. ఇప్పుడు ఈ కేసును తిరగదోడాలని నిర్ణయించుకున్న పోలీసులు వివరాల సేకరణ మొదలెట్టారు. ఏ ఏ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదై ఉన్నాయని ఆరా తీస్తున్నారు. -
టీడీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలపైనే కేసులు ఎక్కువ
ఫోరం ఫర్ గుడ్ గవరె ్నన్స్ వెల్లడి సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలపైనే ఎక్కువ కేసులు నమోదై ఉన్నట్లు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ వెల్లడించింది. 2009 ఎన్నికల్లో గెలిచి, ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేస్తున్న 87 మంది ఎమ్మెల్యేలపై 203 కేసులు ఉన్నట్లు పేర్కొంది. అందులో టీడీపీకి చెందిన 28 మందిపై 68 కేసులు ఉండగా, కాంగ్రెస్ పార్టీకి చెందిన 26 మందిపై 39 కేసులు ఉన్నట్లు తెలిపింది. మిగతా కేసులు ఇతర పార్టీల ఎమ్మెల్యేలపై ఉన్నట్లు వివరించింది. హైదరాబాద్‌లో గురువారం ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి, ఉపాధ్యక్షుడు రావు చెలికాని విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఈ అంశాలను వెల్లడించారు. గత ఎన్నికల సందర్భంగా నమోదైన కేసులపై పోలీసులు, ఎన్నికల కమిషన్ చర్యలు చేపడితే 30 శాతం ఎమ్మెల్యేలు ఇపుడు పోటీలో ఉండేవారు కాదన్నారు.