cases rise
-
ఢిల్లీని వణికిస్తున్న కరోనా ‘థర్డ్ వేవ్’
సాక్షి, న్యూఢిల్లీ: ఒకవైపు భయంకరమైన కాలుష్యం, మరోవైపు కరోనా వైరస్ మహమ్మారి ఢిల్లీ ప్రజలను బెంబేలెత్తిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో మునుపెన్నడూ లేని విధంగా పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు ఆందోళన రేపుతున్నాయి. కొత్తగా నమోదయ్యే కేసుల సంఖ్య గత కొంత కాలంగా తగ్గుతూ వచ్చినప్పటికీ, మళ్లీ పెద్ద సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా అంగీకరించారు. పండుగ సీజన్, పెరుగుతున్న కాలుష్యంతో కేసులు సంఖ్య అకస్మాత్తుగా పెరిగినట్టు తెలుస్తోంది. ఢిల్లీలో కోవిడ్-19 కేసుల సంఖ్య పెరుగుతోందని, ఈ విస్తరణను థర్డ్ వేవ్‌గా చెప్పవచ్చని ఆయన పేర్కొన్నారు. కేసుల సంఖ్య పెరుగుతుండంతో ఢిల్లీ అధికార యంత్రాంగం అప్రమత్తమైందని సీఎం కేజ్రివాల్ తెలిపారు. పరిస్థితిని తాము ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని చెప్పారు. మునుపటిలా కొత్త కేసులు విజృంభించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. మహమ్మారి వ్యాప్తి తరువాత తొలిసారిగా డిల్లీలో 6వేలను దాటేసాయి. రోజువారీ కేసుల సంఖ్య 6000 మార్కును దాటడం ఇదే మొదటిసారి. తాజా 6,700 కరోనా కేసులతో మొత్తం సంఖ్య 4 లక్షలను అధిగమించింది. అంతకుముందు అత్యధిక కేసులు అక్టోబర్ 30 న (5,891) నమోదయ్యాయి. కాగా శీతాకాలానికి సంబంధించిన శ్వాసకోశ సమస్యలు, బయటి నుండి పెద్ద సంఖ్యలో రోగులు రావడం, పండుగ సీజన్ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని రోజుకు సుమారు 15 వేల కరోనా పాజిటివ్ కేసులకు సిద్ధం కావాలని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఒక నివేదికలో ఇటీవల హెచ్చరించింది. దీంతో అప్రమత్తమైన యంత్రాంగం సోమవారం సమావేశమై కరోనా కట్టడి వ్యూహాలపై చర్చించింది. There has been a rise in COVID19 cases. We can call this the third wave of COVID cases here. We are monitoring the situation, and will take all necessary actions: Delhi CM Arvind Kejriwal pic.twitter.com/YkoBzxxTGO — ANI (@ANI) November 4, 2020 -
చిన్న పిల్లలతో ఆస్పత్రుల కిటకిట
→ జిల్లాలో పెరుగుతున్న నిమోనియా కేసులు → జిల్లా వ్యాప్తంగా 282 కేసుల నమోదు → వాతావరణంలో మార్పులే కారణమంటున్న వైద్యులు ధర్మవరం అర్బన్: వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులు చిన్న పిల్లలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. వర్షాలు కురియాల్సిన సమయంలో భానుడి ప్రతాపం చూడటం, ఇదే సమయంలో పగటిపూట ఉక్కపోత, రాత్రిళ్లు చల్లటి వాతావరణం ఉండటం రోగాలకు కారణమవుతోంది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే చిన్నపిల్లలు విషజ్వరాలతో పాటు నిమోనియా, అస్తమా వంటి వ్యాధులకు గురవుతున్నారు. దీంతో గత పదిరోజుల నుంచి జిల్లాలో చిన్నపిల్లల ఆసుపత్రులన్ని కిక్కిరిసిపోతున్నాయి. – సాధారణంగా ఇది సీజనల్ వ్యాధుల కాలం. ఈ సమయంలో విషజ్వరాలు వ్యాపించటం సహజమే. అయితే చలికాలంలో వ్యాపించాల్సిన రోగాలు ప్రస్తుతం విజృంభిస్తున్నాయి. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే చిన్నపిల్లలను నిమోనియా, అస్తమా వంటి వ్యాధులు వెంటాడుతున్నాయి. గత సీజన్లో ఇదే సమయానికి నిమోనియా కేసులు పదుల సంఖ్యలో ఉండగా ప్రస్తుతం వందల సంఖ్యకు చేరుకున్నాయి. జలుబుతో మొదలై... తొలుత జలుబుతో మొదలై దగ్గుతో చివరకు నిమోనియాగా మారుతోంది. నిమోనియా తీవ్రత పెరగడంతో పలువురు పిల్లలు అస్తమా, ఫిట్స్‌కు గురవుతున్నారు. పగలు వేడిగా ఉండటం, రాత్రిళ్లు చల్లటి వాతావరణం ఉండటంతో పిల్లల శరీరం ఇందుకు తట్టుకోవడం లేదని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. 282 కేసులు గుర్తింపు జిల్లా వ్యాప్తంగా 282 కేసులు అధికారికంగా నమోదు అవుతున్నా... ప్రైవేటు ఆస్పత్రుల్లో వంద సంఖ్యలో నిమోనియా బాధితులు చికిత్స పొందుతున్నారు. అయితే కొంతమంది వైద్యులు కేవలం దగ్గు, జలుబుగానే వైద్యం చేస్తున్నారు. ఏమాత్రం అజాగ్రత్త చేయకూడదు చిన్నపిల్లల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రికి చాలా నిమోనియా, అస్తమా కేసులు వస్తున్నాయి. ముందస్తుగా తల్లిదండ్రులు అప్రమత్తత లేకపోవడం వల్ల ప్రాణాల మీదకు వస్తోంది. కొద్దిపాటి జలుబు, దగ్గు మొదలుకాగానే జాగ్రత్త పడటం మంచిది. – డాక్టర్ యుగంధర్, డిప్యూటీ డీఎంహెచ్‌వో, ధర్మవరం -
అత్యాచారాల 'ఆర్థిక రాజధాని'
ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబై అంటే మహిళలు హడలెత్తిపోతున్నారు. ఈ మహానగరంలో మహిళలపై అరాచకాలు పెరిగిపోతున్నాయి. గతేడాదితో పోలిస్తే గత మూడు నెలల్లో కిడ్నాప్‌లు, రేప్‌ల సంఖ్య 165 శాతం పెరిగాయి. గణాంకాల అధ్యయనం నివేదిక ఈ వివరాలను వెల్లడించింది. ఇక ఆర్టీఐ సమాచారం మేరకు అత్యాచారాల సంఖ్య 43 శాతం పెరిగింది. ముంబైలో గత జనవరి నుంచి మార్చి వరకు 172 అత్యాచార కేసులు నమోదైనట్టు సామాజిక కార్యకర్త చేతన కొఠారి వెల్లడించారు. గతేడాది ఇదే సమయంలో 138 కేసులు నమోదయ్యాయి. గతేడాది తొలి మూడు నెలల్లో 76 కిడ్నాప్ కేసులు రాగా, ఈ ఏడాది ఆ సంఖ్య 202కు పెరిగింది. ఇదిలావుండగా, పెళ్లి పేరుతో మోసం చేసి అత్యాచారానికి పాల్పడిన కేసులు 95 శాతం ఉన్నాయని ఓ ఐపీఎస్ అధికారి చెప్పారు. 5 శాతం మాత్రమే మహిళలపై లైంగిక దాడుల కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. ఇక పిల్లల కిడ్నాప్‌ల కేసుల్లో తెలిసిన వారే నిందితులుగా మారుతున్నారని చెప్పారు. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.