చిన్న పిల్లలతో ఆస్పత్రుల కిటకిట | nemonia cases rise in the district | Sakshi
Sakshi News home page

చిన్న పిల్లలతో ఆస్పత్రుల కిటకిట

Published Wed, Aug 17 2016 11:51 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

చిన్న పిల్లలతో ఆస్పత్రుల కిటకిట - Sakshi

చిన్న పిల్లలతో ఆస్పత్రుల కిటకిట

జిల్లాలో పెరుగుతున్న నిమోనియా కేసులు
జిల్లా వ్యాప్తంగా 282 కేసుల నమోదు
వాతావరణంలో మార్పులే కారణమంటున్న వైద్యులు


ధర్మవరం అర్బన్‌: వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులు చిన్న పిల్లలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. వర్షాలు కురియాల్సిన సమయంలో భానుడి ప్రతాపం చూడటం, ఇదే సమయంలో పగటిపూట ఉక్కపోత, రాత్రిళ్లు చల్లటి వాతావరణం ఉండటం రోగాలకు కారణమవుతోంది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే చిన్నపిల్లలు విషజ్వరాలతో పాటు నిమోనియా, అస్తమా వంటి వ్యాధులకు గురవుతున్నారు. దీంతో గత పదిరోజుల నుంచి జిల్లాలో చిన్నపిల్లల ఆసుపత్రులన్ని కిక్కిరిసిపోతున్నాయి.

– సాధారణంగా ఇది సీజనల్‌ వ్యాధుల కాలం. ఈ సమయంలో విషజ్వరాలు వ్యాపించటం సహజమే. అయితే చలికాలంలో వ్యాపించాల్సిన రోగాలు ప్రస్తుతం విజృంభిస్తున్నాయి. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే చిన్నపిల్లలను నిమోనియా, అస్తమా వంటి వ్యాధులు వెంటాడుతున్నాయి.  గత సీజన్‌లో ఇదే సమయానికి నిమోనియా కేసులు పదుల సంఖ్యలో ఉండగా ప్రస్తుతం వందల సంఖ్యకు చేరుకున్నాయి.

జలుబుతో మొదలై...
తొలుత జలుబుతో మొదలై దగ్గుతో చివరకు నిమోనియాగా మారుతోంది. నిమోనియా తీవ్రత పెరగడంతో పలువురు పిల్లలు అస్తమా, ఫిట్స్‌కు గురవుతున్నారు. పగలు వేడిగా ఉండటం, రాత్రిళ్లు చల్లటి వాతావరణం ఉండటంతో పిల్లల శరీరం ఇందుకు తట్టుకోవడం లేదని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.

282 కేసులు గుర్తింపు
జిల్లా వ్యాప్తంగా 282 కేసులు అధికారికంగా నమోదు అవుతున్నా... ప్రైవేటు ఆస్పత్రుల్లో వంద సంఖ్యలో నిమోనియా బాధితులు చికిత్స పొందుతున్నారు. అయితే కొంతమంది వైద్యులు కేవలం దగ్గు, జలుబుగానే వైద్యం చేస్తున్నారు.

ఏమాత్రం అజాగ్రత్త చేయకూడదు
చిన్నపిల్లల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రికి చాలా నిమోనియా, అస్తమా కేసులు వస్తున్నాయి. ముందస్తుగా తల్లిదండ్రులు అప్రమత్తత లేకపోవడం వల్ల ప్రాణాల మీదకు వస్తోంది. కొద్దిపాటి జలుబు, దగ్గు మొదలుకాగానే జాగ్రత్త పడటం మంచిది.
– డాక్టర్‌ యుగంధర్, డిప్యూటీ డీఎంహెచ్‌వో, ధర్మవరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement