cash awards
-
అదే రాష్ట్రం అదే బడ్జెట్.. చంద్రబాబుకు సీఎం జగన్ చురకలు
-
ఇక చొక్కా చేతులు మడత పెట్టాల్సిన సమయం వచ్చేసింది: సీఎం జగన్
-
మీ సేవాభావానికి మీ అన్న సెల్యూట్
-
చంద్రబాబు జన్మభూమి కమిటీలు గంజాయి మొక్క
-
రాబోయే రోజుల్లో కాబోయే భావి లీడర్లుగా వాలంటీర్లు..
-
మీరు వాలంటీర్లు కాదు..సేవా హృదయాలు..
-
యువ సైన్యమే మన వాలంటీర్లు వ్యవస్థ
-
జగనన్న అంటే అంతులేని ప్రేమ
-
సీఎం జగన్ రాకతో దద్దరిల్లిన ఫిరంగిపురం
-
వాలంటీర్లకు సత్కారం.. సీఎం జగన్ బహిరంగ సభ@ఫిరంగిపురం
-
వాలంటీర్లే.. రేపు కాబోయే లీడర్లు: సీఎం జగన్
Updates: యువ సైన్యమే మన వలంటీర్ల వ్యవస్థ: సీఎం జగన్ వివక్ష లేకుండా ప్రతీ పేదవాడికి పథకాలు అందిస్తున్నాం వలంటీర్లు రాబోయే రోజుల్లో భావి లీడర్లు అవుతారు వలంటీర్లు సేవ సైనికులు 55 నెలలు పేదలకు సేవ చేశాం పేదల భవిష్యత్తు మార్చేందుకు యుద్ధానికి సిద్ధమా ఈ రోజు నా చెల్లెమ్మలు, తమ్ముళ్ల మధ్య ఈ కార్యక్రమం చేసుకోవటం చాలా ఆనందంగా ఉంది ప్రజల చెంతకు సంక్షేమాన్ని చేరవేసే వారధులు వలంటీర్లు మీరు వలంటీర్లు కాదు.. సేవా హృదయాలు 2 లక్షల 60 వేల మంది వలంటీర్లు నా సైన్యం గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలతో దోచుకున్నారు జన్మభూమి కమిటీ.. సచివాలయ వ్యవస్థ మధ్య చాలా తేడా ఉంది పేదలకు సేవ చేయడానికి మన వ్యవస్థలు పుట్టాయి మన వ్యవస్థల ద్వారా ప్రతీ గ్రామంలో స్కూళ్లు, ఆస్పత్రులు మారాయి ఇంటింటి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆరోగ్య సురక్ష ప్రవేళపెట్టాం గత ప్రభుత్వంలో ప్రతీ పథకానికి లంచం ఇవ్వాల్సిందే గతంలో ప్రతీ పనికి కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేది రైతులు, అవ్వాతాతలకు, అక్కాచెల్లెమ్మలకు తోడుగా వలంటీర్ల వ్యవస్థ ఉంది ఆర్బీకే వ్యవస్థ రైతన్నకు కొండంత అండగా ఉంది వలంటీర్లు సూర్యుడు ఉదయించక ముందే ఇంటి తలుపు తట్టి పెన్షన్ అందిస్తున్నారు కులం, మతం, ప్రాంతం చూడకుండా అర్హతే ప్రామాణికంగా.. ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయి చంద్రబాబు పాలనలో 39 లక్షల మందికి మాత్రమే పెన్షన్ వచ్చేది గడప గడపకు వెళ్లి పెన్షన్ ఇస్తున్న వ్యవస్థ ఎక్కడా లేదు మీ సేవాభావానికి మీ అన్న సెల్యూట్: సీఎం జగన్ గతంలో జన్మభూమి కమిటీల అరాచకాల వల్ల జనం నష్టపోయారు చంద్రబాబు జన్మభూమి కమిటీలు గంజాయి మొక్క చంద్రబాబు పాలన విషవృక్షం, మన పాలన కల్పవృక్షం మన సచివాలయ వ్యవస్థ తులసి మొక్క మన పథకాలకు వలంటీర్లు బ్రాండ్ అంబాసిడర్లు వివిధ విభాగాల్లో 2.55 లక్షల మంది వలంటీర్లకు సత్కారం సేవావజ్రాలకు రూ. 30 వేల నుంచి రూ. 45 వేలకు పెంపు సేవారత్నలకు రూ. 20వేల నుంచి రూ.30 వేలకు పెంపు సేవా మిత్రలకు రూ.10 వేల నుంచి రూ.15వేలకు పెంపు 875 మందికి సేవావజ్ర, 4,150 మందికి సేవారత్న.. 2,50, 439 మందికి సేవామిత్ర అవార్డుల ప్రదానం లంచాలు, వివక్ష వ్యవస్ధను వాలంటీర్ల బద్దలు కొట్టారు మీ నిజాయితీని గుర్తిస్తూ నాలుగేళ్లుగా బహుమతులు ఇస్తున్నాం ప్రజల కష్టాలను చూసి మన మేనిఫెస్టో పుట్టింది: సీఎం జగన్ ప్రజలకు మంచి చేస్తున్న ప్రభుత్వంపై విమర్శలు చంద్రబాబు మేనిఫెస్టో హైదరాబాద్‌లో పుట్టింది వివక్షకు చోటు లేకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలు ప్రజలను మోసం చేయడానికే చంద్రబాబు సాధ్యం కానీ హామీలు ఇస్తున్నారు చంద్రబాబు వేరే రాష్ట్రాల్లోని హామీలను కిచిడీ చేసి మేనిఫెస్టో అంటాడు బాబు హామీలకు రూ. లక్షా 26 వేల 140 కోట్లు అవుతుంది ఎలాగో ఇచ్చేది లేదు కాబట్టి .. బాబు ఏదేదో చెప్తాడు మన స్టార్ క్యాంపెయినర్లు అవ్వా, తాతలు, రైతులు: సీఎం జగన్ మన యువ సైన్యం రాబోయే రెండు నెలలు యుద్ధానికి సిద్ధం కావాలి గతంలో చంద్రబాబు ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు మన ప్రభుత్వం చేసిన మంచిని ప్రతీ ఇంటికి వెళ్లి వివరించాలి మన చొక్కా చేతులు మడత పెట్లాల్సిన సమయం వచ్చేసింది మన పాలనలో లంచాలు, వివక్ష లేకుండా పథకాలు అందుతున్నాయి చంద్రబాబు వస్తే.. చంద్రముఖీలు వస్తాయని ప్రతీ ఇంటికీ వెళ్లి చెప్పండి ఎల్లో మీడియా అసత్య ప్రచారాల మీద యుద్ధానికి సిద్ధమే 58 నెలల పాలనలో వ్యవస్థలో మార్పు వచ్చిందంటే వలంటీర్లే కారణం వలంటీర్ల వ్యవస్థ అంటే చంద్రబాబుకు కడుపుమంట: సీఎం జగన్ ఒక్క జనగ్ ఒకవైపు.. మరో వైపు దుష్టచతుష్టయం ఉంది మంచి చేశాం కాబట్టే ప్రజల్లోకి వెళ్తున్నాం మన పాలనలో పేదలకు సొంతింటి కల సాకారం చేశాం ప్రజలకు మంచి చేస్తున్న ప్రభుత్వంపై విమర్శలు చంద్రబాబు ఇస్తున్న హామీలను నమ్మకండి: సీఎం జగన్ చంద్రబాబు కాలుకదపకుండా హైదరాబాద్ ఇంట్లో కూర్చుంటారు వేరే రాష్ట్రాల్లో గెలిచిన పార్టీల హామీలు సేకరిస్తారు ఆ హామీలన్నీ కిచిడీలు చేసి కొత్త మేనిఫెస్టో అంటారు ఆ హామీలు అమలు చేసే పరిస్ధితి కూడా రాష్ట్రానికి ఉండదు ఎలాగో చేసేది మోసమే కాబట్టి హామీలు ఇచ్చేస్తున్నారు నా 8 పథకాలకు రూ.52,700 కోట్లు కావాలి నేను ఇస్తున్న ఈ స్కీమ్‌లను టచ్చేసే ధైర్యం ఎవ్వరికీ లేదు బాబు 6 హామీలు జత చేస్తే లక్షా 26 వేల కోట్లు కావాలి నేను చాలా కష్టపడితే ఏడాదికి 70 వేల కోట్లు ఇస్తున్నా మరి చంద్రబాబు ఏటా లక్షా 26వేల కోట్లు ఇవ్వగలరా ఎన్నికలయ్యాక చంద్రబాబు మేనిఫెస్టోని చెత్తబుట్టలో పడేస్తారు ఈ నిజాలన్నీ వాలంటీర్లు ఇంటింటికీ చెప్పాలి మీకు మంచి జరిగి ఉంటేనే నాకు ఓటేయండి: సీఎం జగన్ ప్రజలు మోసపోకుండా వలంటీర్లే అవగాహన కల్పించాలి చంద్రబాబుకు ఓటు వేయటం అంటే ఐదేళ్ల కింద వదిలించుకున్న చంద్రముఖిని మళ్లీ ఇంటికి పిలిపించుకోవడమే వలంటీర్లను చూస్తే చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెడతాయి బాబును నమ్మితే.. మళ్లీ జన్మభూమి కమిటీలు వస్తాయని చెప్పండి ప్రసంగం అనంతరం సీఎం జగన్ వంటీర్లకు పురస్కారాలు అందజేత.. ప్రతి శాసనసభా నియోజకవర్గంలో అత్యుత్తమ ర్యాంకు సాధించిన మొదటి ఐదుగురు వలంటీర్ల చొప్పున.. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో 875 మంది వలంటీర్లకు సేవావజ్ర అవార్డుతోపాటు సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జ్, మెడల్, రూ.45,000 చొప్పున నగదు బహుమతి అందించారు. ప్రతి మండలం లేదా మున్సిపాలిటీ పరిధిలో ఐదుగురు చొప్పున, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో 10 మంది చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 4,150 మందికి సేవారత్న అవార్డుతోపాటు సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జ్, మెడల్, రూ.30,000 చొప్పున నగదు బహుమతి అందించారు. రాష్ట్రవ్యాప్తంగా ఏడాది పాటు ఎటువంటి ఫిర్యాదులు, వివాదాలు లేకుండా పనిచేసిన మిగిలిన 2,50,439 మంది వలంటీర్లకు సేవామిత్ర అవార్డుతోపాటు సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జ్, రూ.15,000 చొప్పున నగదు బహుమతిని అందజేశారు. సేవావజ్ర, సేవారత్న, సేవామిత్ర కలిపి మూడు కేటగిరీల్లో రాష్ట్రవ్యాప్తంగా 2,55,464 మందికి మొత్తం రూ.392.05 కోట్ల నగదును బహుమతుల రూపంలో అందించారు. సేవావజ్ర, సేవారత్న, సేవామిత్ర మూడు కేటగిరీ అవార్డులకు అదనంగా వైఎస్సార్ పెన్షన్ కానుక, ఆసరా తదితర పథకాల లబ్ధిదారుల మనోభావాలను అత్యుత్తమంగా సేకరించి, జిల్లా కలెక్టర్లు ఎంపిక చేసిన 997 మంది వలంటీర్లకు వేరేగా ప్రత్యేకంగా నగదు బహుమతులను కూడా ప్రభుత్వం అందించింది. ► కార్యక్రమ వేదికపై మాజీ సీఎం దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి సీఎం వైఎస్ జగన్ నివాళులు అర్పించారు ►ఫిరంగిపురం మండలం రేపూడి చేరుకున్న సీఎం జగన్ ►వలంటీర్ల అభినందన సభలో పాల్గొననున్న సీఎం జగన్ ►వరుసగా నాలుగో ఏడాది వలంటీర్లకు ప్రోత్సాహకాలు ►వలంటీర్లకు నగదు పురస్కారాలు అందించనున్న సీఎం జగన్ ►వలంటీర్లపై మరోసారి ప్రేమను చాటుకున్న సీఎం జగన్ ►వలంటీర్లకు నగదు పురస్కారాలను పెంచుతూ నిర్ణయం ►ఫిరంగిపురం బయలుదేరిన సీఎం వైఎస్ జగన్ ►కాసేపట్లో వలంటీర్ల అభినందన సభకు హాజరు ►సంక్షేమ పథకాలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాల అమల్లో ఎలాంటి పక్షపాతం, అవినీతికి తావు లేకుండా క్షేత్ర స్థాయిలో విశేష సేవలు అందిస్తున్న వలంటీర్లను రాష్ట్ర ప్రభుత్వం గురువారం నగదు పురస్కారాలతో సత్కరించనుంది. గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. కాగా ప్రభుత్వం ఈ ఏడాది నగదు పురస్కారాలను భారీగా పెంచింది. ►ప్రతి శాసనసభా నియోజకవర్గంలో ఉత్తమ సేవలు అందించిన ఐదుగురికి సేవావజ్ర అవార్డులను అందించనుంది. వీటి కింద గత మూడేళ్లుగా రూ.30 వేల చొప్పున ప్రభుత్వం నగదు బహుమతి అందజేయగా.. ఇప్పుడు ఆ మొత్తాన్ని 50 శాతం పెంచి ఏకంగా రూ.45 వేలు చేసింది. అలాగే మండలాలు, మున్సిపాలిటీల స్థాయిలో ఉత్తమ సేవలు అందించిన ప్రతి ఐదుగురు వలంటీర్లకు సేవారత్న అవార్డులను అందించనుంది. వీటి కింద గత మూడేళ్లు రూ. 20 వేల చొప్పున నగదు బహుమతి అందజేయగా.. ఇప్పుడు ఆ మొత్తాన్ని రూ.30 వేలకు పెంచింది. ►అదేవిధంగా కనీసం ఏడాదికాలంగా పనిచేస్తూ.. ఎటువంటి ఫిర్యాదులు, వివాదాలు లేకుండా పనిచేసిన మిగిలిన వలంటీర్లందరికీ సేవామిత్ర అవార్డులు అందించనుంది. వీటి కింద గత మూడేళ్లుగా రూ.10 వేల చొప్పున నగదు బహుమతి అందజేయగా.. ఇప్పుడు ఈ మొత్తాన్ని రూ.15 వేలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెంచిన నగదు బహుమతులను తాజా పురస్కారాల ప్రదానోత్సవంలో వలంటీర్లకు అందించనుంది. 2.55 లక్షల మంది వలంటీర్లకూ అవార్డులు.. ప్రతి లబ్ధిదారు ఇంటికి వెళ్లి పింఛన్లను పంపిణీ చేయడంతోపాటు రేషన్ డెలివరీ, ఆరోగ్యశ్రీ కార్డు, ఇళ్ల పట్టాలతో సహా వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాల వివరాలను, అమలు తేదీలను లబ్ధిదారులకు వలంటీర్లు వివరిస్తున్నారు. లబ్ధిదారులతో ఆయా పథకాలకు దరఖాస్తులు చేయిస్తున్నారు. అలాగే కోవిడ్, వరదలు, విపత్తులు, ప్రమాదాల సమయంలో వలంటీర్లు వివిధ సహాయ కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొంటున్నారు. ►ఇలా విశేష సేవలు అందిస్తున్న వలంటీర్లకు నగదు పురస్కారాలు అందించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సత్కరించనున్నారు. తర్వాత ఈ నెల 22 వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని శాసనసభా నియోజకవర్గాల పరిధిలో స్థానిక ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు వలంటీర్లకు నగదు పురస్కారాలు అందించనున్నారు. ఈ కార్యక్రమాల నిర్వహణకు ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాల శాఖ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. పురస్కారాలు ఇలా.. ♦ ప్రతి శాసనసభా నియోజకవర్గంలో అత్యుత్తమ ర్యాంకు సాధించిన మొదటి ఐదుగురు వలంటీర్ల చొప్పున.. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో 875 మంది వలంటీర్లకు సేవావజ్ర అవార్డుతోపాటు సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జ్, మెడల్, రూ.45,000 చొప్పున నగదు బహుమతి అందజేస్తారు. ♦ప్రతి మండలం లేదా మున్సిపాలిటీ పరిధిలో ఐదుగురు చొప్పున, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో 10 మంది చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 4,150 మందికి సేవారత్న అవార్డుతోపాటు సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జ్, మెడల్, రూ.30,000 చొప్పున నగదు బహుమతి అందిస్తారు. ♦రాష్ట్రవ్యాప్తంగా ఏడాది పాటు ఎటువంటి ఫిర్యాదులు, వివాదాలు లేకుండా పనిచేసిన మిగిలిన 2,50,439 మంది వలంటీర్లకు సేవామిత్ర అవార్డుతోపాటు సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జ్, రూ.15,000 చొప్పున నగదు బహుమతిని అందజేయనున్నారు. ♦ సేవావజ్ర, సేవారత్న, సేవామిత్ర కలిపి మూడు కేటగిరీల్లో రాష్ట్రవ్యాప్తంగా 2,55,464 మందికి మొత్తం రూ.392.05 కోట్ల నగదును బహుమతుల రూపంలో అందిస్తారు. ♦ సేవావజ్ర, సేవారత్న, సేవామిత్ర మూడు కేటగిరీ అవార్డులకు అదనంగా వైఎస్సార్ పెన్షన్ కానుక, ఆసరా తదితర పథకాల లబ్ధిదారుల మనోభావాలను అత్యుత్తమంగా సేకరించి, జిల్లా కలెక్టర్లు ఎంపిక చేసిన 997 మంది వలంటీర్లకు వేరేగా ప్రత్యేకంగా నగదు బహుమతులను కూడా ప్రభుత్వం గురువారం అందించనుంది. ►ఈ ప్రత్యేక నగదు బహుమతి కింద మండల, పట్టణ, మున్సిపల్ కార్పొరేషన్ స్థాయిలో ఎంపికయ్యే వలంటీర్లకు ఒక్కొక్కరికి రూ.15 వేలు చొప్పున అందిస్తారు. అలాగే నియోజకవర్గ స్థాయిలో ఎంపికైన ఒక్కో వలంటీర్‌కు రూ.20 వేలు చొప్పున అందజేస్తారు. జిల్లా స్థాయిలో ఎంపికయ్యే వారికి రూ. 25 వేల చొప్పున అందజేయనున్నారు. మొత్తం 997 మంది వలంటీర్లకు ప్రత్యేక నగదు బహుమతుల రూపంలో మొత్తం రూ.1.61 కోట్లు అందిస్తారు. -
వలంటీర్లకు గుడ్ న్యూస్
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, గుంటూరు: సంక్షేమ పథకాలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాల అమల్లో ఎలాంటి పక్షపాతం, అవినీతికి తావు లేకుండా క్షేత్ర స్థాయిలో విశేష సేవలు అందిస్తున్న వలంటీర్లను రాష్ట్ర ప్రభుత్వం గురువారం నగదు పురస్కారాలతో సత్కరించనుంది. గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. కాగా ప్రభుత్వం ఈ ఏడాది నగదు పురస్కారాలను భారీగా పెంచింది. ప్రతి శాసనసభా నియోజకవర్గంలో ఉత్తమ సేవలు అందించిన ఐదుగురికి సేవావజ్ర అవార్డులను అందించనుంది. వీటి కింద గత మూడేళ్లుగా రూ.30 వేల చొప్పున ప్రభుత్వం నగదు బహుమతి అందజేయగా.. ఇప్పుడు ఆ మొత్తాన్ని 50 శాతం పెంచి ఏకంగా రూ.45 వేలు చేసింది. అలాగే మండలాలు, మున్సిపాలిటీల స్థాయిలో ఉత్తమ సేవలు అందించిన ప్రతి ఐదుగురు వలంటీర్లకు సేవారత్న అవార్డులను అందించనుంది. వీటి కింద గత మూడేళ్లు రూ. 20 వేల చొప్పున నగదు బహుమతి అందజేయగా.. ఇప్పుడు ఆ మొత్తాన్ని రూ.30 వేలకు పెంచింది. అదేవిధంగా కనీసం ఏడాదికాలంగా పనిచేస్తూ.. ఎటువంటి ఫిర్యాదులు, వివాదాలు లేకుండా పనిచేసిన మిగిలిన వలంటీర్లందరికీ సేవామిత్ర అవార్డులు అందించనుంది. వీటి కింద గత మూడేళ్లుగా రూ.10 వేల చొప్పున నగదు బహుమతి అందజేయగా.. ఇప్పుడు ఈ మొత్తాన్ని రూ.15 వేలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెంచిన నగదు బహుమతులను తాజా పురస్కారాల ప్రదానోత్సవంలో వలంటీర్లకు అందించనుంది. 2.55 లక్షల మంది వలంటీర్లకూ అవార్డులు.. ప్రతి లబ్ధిదారు ఇంటికి వెళ్లి పింఛన్లను పంపిణీ చేయడంతోపాటు రేషన్ డెలివరీ, ఆరోగ్యశ్రీ కార్డు, ఇళ్ల పట్టాలతో సహా వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాల వివరాలను, అమలు తేదీలను లబ్ధిదారులకు వలంటీర్లు వివరిస్తున్నారు. లబ్ధిదారులతో ఆయా పథకాలకు దరఖాస్తులు చేయిస్తున్నారు. అలాగే కోవిడ్, వరదలు, విపత్తులు, ప్రమాదాల సమయంలో వలంటీర్లు వివిధ సహాయ కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొంటున్నారు. ఇలా విశేష సేవలు అందిస్తున్న వలంటీర్లకు నగదు పురస్కారాలు అందించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సత్కరించనున్నారు. తర్వాత ఈ నెల 22 వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని శాసనసభా నియోజకవర్గాల పరిధిలో స్థానిక ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు వలంటీర్లకు నగదు పురస్కారాలు అందించనున్నారు. ఈ కార్యక్రమాల నిర్వహణకు ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాల శాఖ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. పురస్కారాలు ఇలా.. ♦ ప్రతి శాసనసభా నియోజకవర్గంలో అత్యుత్తమ ర్యాంకు సాధించిన మొదటి ఐదుగురు వలంటీర్ల చొప్పున.. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో 875 మంది వలంటీర్లకు సేవావజ్ర అవార్డుతోపాటు సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జ్, మెడల్, రూ.45,000 చొప్పున నగదు బహుమతి అందజేస్తారు. ♦ప్రతి మండలం లేదా మున్సిపాలిటీ పరిధిలో ఐదుగురు చొప్పున, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో 10 మంది చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 4,150 మందికి సేవారత్న అవార్డుతోపాటు సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జ్, మెడల్, రూ.30,000 చొప్పున నగదు బహుమతి అందిస్తారు. ♦రాష్ట్రవ్యాప్తంగా ఏడాది పాటు ఎటువంటి ఫిర్యాదులు, వివాదాలు లేకుండా పనిచేసిన మిగిలిన 2,50,439 మంది వలంటీర్లకు సేవామిత్ర అవార్డుతోపాటు సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జ్, రూ.15,000 చొప్పున నగదు బహుమతిని అందజేయనున్నారు. ♦ సేవావజ్ర, సేవారత్న, సేవామిత్ర కలిపి మూడు కేటగిరీల్లో రాష్ట్రవ్యాప్తంగా 2,55,464 మందికి మొత్తం రూ.392.05 కోట్ల నగదును బహుమతుల రూపంలో అందిస్తారు. ♦ సేవావజ్ర, సేవారత్న, సేవామిత్ర మూడు కేటగిరీ అవార్డులకు అదనంగా వైఎస్సార్ పెన్షన్ కానుక, ఆసరా తదితర పథకాల లబ్ధిదారుల మనోభావాలను అత్యుత్తమంగా సేకరించి, జిల్లా కలెక్టర్లు ఎంపిక చేసిన 997 మంది వలంటీర్లకు వేరేగా ప్రత్యేకంగా నగదు బహుమతులను కూడా ప్రభుత్వం గురువారం అందించనుంది. ఈ ప్రత్యేక నగదు బహుమతి కింద మండల, పట్టణ, మున్సిపల్ కార్పొరేషన్ స్థాయిలో ఎంపికయ్యే వలంటీర్లకు ఒక్కొక్కరికి రూ.15 వేలు చొప్పున అందిస్తారు. అలాగే నియోజకవర్గ స్థాయిలో ఎంపికైన ఒక్కో వలంటీర్‌కు రూ.20 వేలు చొప్పున అందజేస్తారు. జిల్లా స్థాయిలో ఎంపికయ్యే వారికి రూ. 25 వేల చొప్పున అందజేయనున్నారు. మొత్తం 997 మంది వలంటీర్లకు ప్రత్యేక నగదు బహుమతుల రూపంలో మొత్తం రూ.1.61 కోట్లు అందిస్తారు. -
జై జవాన్
► సైనికులపై ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల జల్లు ► జవాన్లు, వారి కుటుంబాల సంక్షేమం కోసం ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తాం ► మాజీ సైనికుల భార్యలకు డబుల్ పెన్షన్ ► రెండో ప్రపంచ యుద్ధ సైనికులకు పింఛన్ పెంపు ► పరమవీర చక్ర, అశోక చక్ర గ్రహీతలకు దేశంలోనే అత్యధికంగా రూ. 2.25 కోట్లు అందిస్తాం ►‘డబుల్ బెడ్రూం’లో మాజీ సైనికులకు 2% కోటా ► సైనికులు, మాజీ సైనికుల పిల్లలకు గురుకుల పాఠశాలల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని వెల్లడి ► వరంగల్‌లో సైనిక్ స్కూల్ ఏర్పాటు చేస్తాం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి చెందిన సైనికులు, వారి కుటుంబాల సంక్షేమం కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. తమ ప్రాణం, కుటుంబం కన్నా దేశ రక్షణే ప్రధానమని భావించి అహరహం శ్రమిస్తున్న సైనికులు, వారి కుటుంబాల క్షేమాన్ని సమాజం బాధ్యతగా స్వీకరించాలని, అదే వారికి నిజమైన కృతజ్ఞత అవుతుందని అన్నారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులు, ఉద్యోగుల భాగస్వామ్యంతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. అసెంబ్లీ సమావేశాలు పునఃప్రారంభమైన మంగళవారం ప్రశ్నోత్తరాలు ముగిసిన అనంతరం సైనిక సంక్షేమం అంశంపై ముఖ్యమంత్రి మాట్లాడారు. ‘‘సైనిక సంక్షేమం కోసం ఏర్పాటు చేస్తున్న ఈ నిధి కోసం నాతో పాటు మంత్రులంతా ఏటా రూ.25 వేలు విరాళంగా ఇస్తారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు రూ.10 వేలు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఒకరోజు వేతనాన్ని ఇస్తున్నారు. సైనికుల పట్ల ఆదరాభిమానాలు చూపించి విరాళాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చిన ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులకు కృతజ్ఞతలు. అలాగే మాజీ సైనికులు రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగం చేస్తే వారికి డబుల్ పెన్షన్ వస్తుంది. కానీ వారు మరణిస్తే మాత్రం ఆ సైనికుల భార్యలకు డబుల్ పెన్షన్ వర్తించడం లేదు. తెలంగాణలో డబుల్ పెన్షన్ పొందిన సైనికులు మరణిస్తే వారి భార్యలకు కూడా డబుల్ పెన్షన్ విధానాన్ని వర్తింపజేస్తాం’’అని సీఎం వివరించారు. గ్యాలంటరీ అవార్డులు పొందిన సైనికులకు రాష్ట్రం తరఫున గౌరవంగా ఇచ్చే నగదు పారితోషికాన్ని కూడా భారీ ఎత్తున పెంచుతున్నట్టు ప్రకటించారు. మొత్తం 11 రకాల పతకాలకు ఇచ్చే నగదును పెంచుతున్నట్టు తెలిపారు. ‘‘పరమ వీరచక్ర, అశోకచక్ర పతకాలు పొందిన వారికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.10 లక్షలు ప్రకటించింది. ఈ అవార్డులు పొందినవారికి పంజాబ్ ప్రభుత్వం దేశంలోనే అత్యధికంగా రూ.2 కోట్లు ఇస్తోంది. ఇకపై వారి కన్నా అదనంగా ఇప్పట్నుంచి పరమవీర చక్ర, అశోకచక్ర పొందిన తెలంగాణ బిడ్డలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.2.25 కోట్లు అందిస్తాం. మహావీరచక్ర, కీర్తిచక్ర, వీరచక్ర, శౌర్యచక్ర, సేనా మెడల్, యుద్ధసేవా పతకాలకు కూడా నగదు పారితోషికాన్ని పెంచుతున్నాం. సర్వీసులో ఉన్నప్పుడు యుద్ధంలో మరణించే సైనికులకు, అనారోగ్యం, ఇతర కారణాలతో చనిపోయే సైనికులకు కల్పించే పరిహారంలో వ్యత్యాసం ఉంది. ఇక నుంచి రాష్ట్రానికి చెందిన సైనికులు ఎలా మరణించినా ఒకే విధమైన పరిహారం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. ఇప్పటికే పది జిల్లాల్లో ఉన్న సైనిక సంక్షేమ బోర్డులను కొత్తగా ఏర్పాటయిన 21 జిల్లాల్లో కూడా ఏర్పాటు చేస్తాం. ఈ బోర్డుల ద్వారానే సైనిక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తాం. సైనికులు, మాజీ సైనికుల పిల్లలకు ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో రిజర్వేషన్లు కల్పిస్తాం. మిలటరీ పాఠశాలలకు రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు ఇస్తాం. విద్యాసంస్థల్లో స్కౌట్స్, గైడ్స్, ఎన్సీసీ శిక్షణను ప్రోత్సహిస్తాం’’అని తెలిపారు. వరంగల్‌లో సైనిక్ స్కూల్ తెలంగాణలో సైనిక్ స్కూల్ ఏర్పాటుకు కేంద్రం అంగీకరించిందని, వరంగల్‌లో దీన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సీఎం తెలిపారు. ఇందుకు సంబంధించి త్వరలోనే కేంద్రంతో ఎంవోయూ కుదుర్చుకోనున్నట్టు వెల్లడించారు. ఉద్యోగ రీత్యా సైనికులు వివిధ రాష్ట్రాలకు మారినప్పుడల్లా వారి సొంత వాహనాలకు లైఫ్ ట్యాక్స్‌లు చెల్లించాల్సి వస్తోందని, ఇక నుంచి ఏ రాష్ట్రంలో లైఫ్‌ట్యాక్స్ కట్టినా తెలంగాణలో మళ్లీ తీసుకోబోమని పేర్కొన్నారు. సైనికుల ఇళ్లకు ఆస్తి పన్ను నుంచి మినహాయింపు ఇస్తున్నామని, సైనికుల భార్యల పేరిట ఉన్న ఇళ్లకు కూడా ఇది వర్తిస్తుందని చెప్పారు. ‘‘డబుల్ బెడ్రూం ఇళ్లలో మాజీ సైనికులకు 2 శాతం కోటా ఇస్తాం. రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న వీర సైనికులు, వారి భార్యలకు ఇచ్చే పెన్షన్‌ను రూ.3 వేల నుంచి రూ.6 వేలకు పెంచుతున్నాం. స్పెషల్ పోలీస్ ఆఫీసర్లుగా పనిచేసే మాజీ సైనికోద్యోగుల వేతనాలను కూడా పెంచుతాం. వారికి నెలనెలా జీతం అందేలా చర్యలు తీసుకుంటాం. రాబోయే రోజుల్లో సైనిక సంక్షేమం కోసం మరిన్ని చర్యలు తీసుకునేందుకు రాష్ట్రస్థాయిలో సైనిక సలహా మండలి ఏర్పాటు చేస్తున్నాం. ఈ మండలితో చర్చించి రాష్ట్రంలోని సైనికులు, మాజీ సైనికులు, వారి కుటుంబాలు మెరుగైన జీవితాలు గడిపేందుకు అన్ని చర్యలు తీసుకుంటాం’’అని సీఎం హామీనిచ్చారు. -
ఇంటి స్థలం ఇచ్చేది లేదు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర క్రీడాకారులను ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం కొత్త పాలసీని రూపొందించింది. వివిధ స్థాయిలలో గెలిచిన ఆటగాళ్లకు భారీ స్థాయిలో నగదు పురస్కారాలు ఇచ్చే విధంగా నిబంధనలను అమల్లోకి తెచ్చింది. ప్రభుత్వం సోమవారం దీనికి సంబంధించి జీఓ నం. 1 జారీ చేసింది. దీని ప్రకారం ఇకపై క్రీడాకారులు ఏ స్థాయిలో విజయం సాధించినా ఇంటి నిర్మాణానికి స్థలం గానీ ఇతరత్రా భూమి గానీ కానుకగా ఇవ్వరు. నిబంధనల ప్రకారం నగదు పురస్కారం మాత్రమే అందజేస్తారు. అయితే అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లో 2000 నుంచి అమల్లో ఉన్న మొత్తాలను భారీగా పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేతకు రూ. 25 లక్షలు ఉండగా, దానిని రూ. 2 కోట్లకు పెంచారు. రజతానికి రూ. 1 కోటి, కాంస్యానికి రూ. 50 లక్షలు ఇవ్వనున్నారు. టీమ్ ఈవెంట్ల విషయంలో కూడా ప్రత్యేక నిబంధనలు విధించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పారాలింపిక్స్, స్పెషల్ ఒలింపిక్స్‌లో పతకం సాధించినవారితో పాటు చెస్ క్రీడలో గెలిచినవారికి కూడా నగదు ఇవ్వనున్నారు. ఇక నాన్ ఒలింపిక్/గ్రామీణ క్రీడలను కూడా ప్రోత్సహించేందుకు ప్రదర్శనను బట్టి రూ. 1 లక్ష నుంచి రూ. 5 లక్షల వరకు ఇస్తారు. ముఖ్యమంత్రి విచక్షణపై ఆధారపడి అంతకంటే ఎక్కువ ఇచ్చే అవకాశం కూడా ఉంది. విజయం సాధించిన ఆటగాడు గత రెండేళ్లుగా తాను ఎవరి వద్ద శిక్షణ పొందాడో చెబితే ఆ కోచ్ (తెలంగాణకు చెందిన వారైతేనే)కు కూడా నగదు పురస్కారం దక్కుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొంత మంది క్రీడాకారులు తమ స్థాయిలో ఉన్న పరిచయాలతో గుర్తింపు లేని టోర్నీలకు కూడా ప్రభుత్వం నుంచి భారీ మొత్తాలు పొందారనే విమర్శలు వినిపించాయి. ఇప్పటి తాజా నిబంధనల కారణంగా అన్నీ స్పష్టంగా ఉండటంతో ఇకపై అలాంటివాటికి అవకాశం ఉండదు. కొత్త పాలసీ ప్రకారం వ్యక్తిగత నగదు పురస్కారాలు (స్వర్ణ, రజత, కాంస్యాలకు) ఒలింపిక్స్ (రూ. 2 కోట్లు, 1 కోటి, 50 లక్షలు; పాల్గొంటే 5 లక్షలు) ఒలింపిక్ క్రీడాంశంలో వరల్డ్ చాంపియన్‌షిప్ (రూ. 50, 30, 20 లక్షలు) ఆసియా క్రీడలు (రూ. 30, 20, 10 లక్షలు) కామన్వెల్త్ క్రీడలు (రూ. 25, 15, 10 లక్షలు) జాతీయ క్రీడలు (రూ. 5, 3, 2 లక్షలు) ‘శాఫ్’ క్రీడలు (రూ. 3, 2, 1 లక్షలు) పారాలింపిక్స్ (రూ. 5, 3, 2 లక్షలు) స్పెషల్ ఒలింపిక్స్ (రూ. 3, 2, 1 లక్షలు) చెస్‌లో ఇంటర్నేషనల్ గ్రాండ్ మాస్టర్ (ఐజీఎం) అయితే రూ. 3 లక్షలు; ఇంటర్నేషనల్ మాస్టర్ (ఐఎం), ఇంటర్నేషనల్ ఉమెన్ మాస్టర్ (ఐడబ్ల్యూఎం) అయితే రూ. 1 లక్ష.