Updates:
యువ సైన్యమే మన వలంటీర్ల వ్యవస్థ: సీఎం జగన్
- వివక్ష లేకుండా ప్రతీ పేదవాడికి పథకాలు అందిస్తున్నాం
- వలంటీర్లు రాబోయే రోజుల్లో భావి లీడర్లు అవుతారు
- వలంటీర్లు సేవ సైనికులు
- 55 నెలలు పేదలకు సేవ చేశాం
- పేదల భవిష్యత్తు మార్చేందుకు యుద్ధానికి సిద్ధమా
- ఈ రోజు నా చెల్లెమ్మలు, తమ్ముళ్ల మధ్య ఈ కార్యక్రమం చేసుకోవటం చాలా ఆనందంగా ఉంది
- ప్రజల చెంతకు సంక్షేమాన్ని చేరవేసే వారధులు వలంటీర్లు
- మీరు వలంటీర్లు కాదు.. సేవా హృదయాలు
- 2 లక్షల 60 వేల మంది వలంటీర్లు నా సైన్యం
- గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలతో దోచుకున్నారు
- జన్మభూమి కమిటీ.. సచివాలయ వ్యవస్థ మధ్య చాలా తేడా ఉంది
- పేదలకు సేవ చేయడానికి మన వ్యవస్థలు పుట్టాయి
- మన వ్యవస్థల ద్వారా ప్రతీ గ్రామంలో స్కూళ్లు, ఆస్పత్రులు మారాయి
- ఇంటింటి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆరోగ్య సురక్ష ప్రవేళపెట్టాం
- గత ప్రభుత్వంలో ప్రతీ పథకానికి లంచం ఇవ్వాల్సిందే
- గతంలో ప్రతీ పనికి కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేది
- రైతులు, అవ్వాతాతలకు, అక్కాచెల్లెమ్మలకు తోడుగా వలంటీర్ల వ్యవస్థ ఉంది
- ఆర్‌బీకే వ్యవస్థ రైతన్నకు కొండంత అండగా ఉంది
- వలంటీర్లు సూర్యుడు ఉదయించక ముందే ఇంటి తలుపు తట్టి పెన్షన్ అందిస్తున్నారు
- కులం, మతం, ప్రాంతం చూడకుండా అర్హతే ప్రామాణికంగా.. ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయి
- చంద్రబాబు పాలనలో 39 లక్షల మందికి మాత్రమే పెన్షన్ వచ్చేది
- గడప గడపకు వెళ్లి పెన్షన్ ఇస్తున్న వ్యవస్థ ఎక్కడా లేదు
మీ సేవాభావానికి మీ అన్న సెల్యూట్: సీఎం జగన్
- గతంలో జన్మభూమి కమిటీల అరాచకాల వల్ల జనం నష్టపోయారు
- చంద్రబాబు జన్మభూమి కమిటీలు గంజాయి మొక్క
- చంద్రబాబు పాలన విషవృక్షం, మన పాలన కల్పవృక్షం
- మన సచివాలయ వ్యవస్థ తులసి మొక్క
- మన పథకాలకు వలంటీర్లు బ్రాండ్ అంబాసిడర్లు
- వివిధ విభాగాల్లో 2.55 లక్షల మంది వలంటీర్లకు సత్కారం
- సేవావజ్రాలకు రూ. 30 వేల నుంచి రూ. 45 వేలకు పెంపు
- సేవారత్నలకు రూ. 20వేల నుంచి రూ.30 వేలకు పెంపు
- సేవా మిత్రలకు రూ.10 వేల నుంచి రూ.15వేలకు పెంపు
- 875 మందికి సేవావజ్ర, 4,150 మందికి సేవారత్న.. 2,50, 439 మందికి సేవామిత్ర అవార్డుల ప్రదానం
- లంచాలు, వివక్ష వ్యవస్ధను వాలంటీర్ల బద్దలు కొట్టారు
- మీ నిజాయితీని గుర్తిస్తూ నాలుగేళ్లుగా బహుమతులు ఇస్తున్నాం
ప్రజల కష్టాలను చూసి మన మేనిఫెస్టో పుట్టింది: సీఎం జగన్
- ప్రజలకు మంచి చేస్తున్న ప్రభుత్వంపై విమర్శలు
- చంద్రబాబు మేనిఫెస్టో హైదరాబాద్‌లో పుట్టింది
- వివక్షకు చోటు లేకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలు
- ప్రజలను మోసం చేయడానికే చంద్రబాబు సాధ్యం కానీ హామీలు ఇస్తున్నారు
- చంద్రబాబు వేరే రాష్ట్రాల్లోని హామీలను కిచిడీ చేసి మేనిఫెస్టో అంటాడు
- బాబు హామీలకు రూ. లక్షా 26 వేల 140 కోట్లు అవుతుంది
- ఎలాగో ఇచ్చేది లేదు కాబట్టి .. బాబు ఏదేదో చెప్తాడు
మన స్టార్ క్యాంపెయినర్లు అవ్వా, తాతలు, రైతులు: సీఎం జగన్
- మన యువ సైన్యం రాబోయే రెండు నెలలు యుద్ధానికి సిద్ధం కావాలి
- గతంలో చంద్రబాబు ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు
- మన ప్రభుత్వం చేసిన మంచిని ప్రతీ ఇంటికి వెళ్లి వివరించాలి
- మన చొక్కా చేతులు మడత పెట్లాల్సిన సమయం వచ్చేసింది
- మన పాలనలో లంచాలు, వివక్ష లేకుండా పథకాలు అందుతున్నాయి
- చంద్రబాబు వస్తే.. చంద్రముఖీలు వస్తాయని ప్రతీ ఇంటికీ వెళ్లి చెప్పండి
- ఎల్లో మీడియా అసత్య ప్రచారాల మీద యుద్ధానికి సిద్ధమే
- 58 నెలల పాలనలో వ్యవస్థలో మార్పు వచ్చిందంటే వలంటీర్లే కారణం
వలంటీర్ల వ్యవస్థ అంటే చంద్రబాబుకు కడుపుమంట: సీఎం జగన్
- ఒక్క జనగ్ ఒకవైపు.. మరో వైపు దుష్టచతుష్టయం ఉంది
- మంచి చేశాం కాబట్టే ప్రజల్లోకి వెళ్తున్నాం
- మన పాలనలో పేదలకు సొంతింటి కల సాకారం చేశాం
- ప్రజలకు మంచి చేస్తున్న ప్రభుత్వంపై విమర్శలు
చంద్రబాబు ఇస్తున్న హామీలను నమ్మకండి: సీఎం జగన్
- చంద్రబాబు కాలుకదపకుండా హైదరాబాద్ ఇంట్లో కూర్చుంటారు
- వేరే రాష్ట్రాల్లో గెలిచిన పార్టీల హామీలు సేకరిస్తారు
- ఆ హామీలన్నీ కిచిడీలు చేసి కొత్త మేనిఫెస్టో అంటారు
- ఆ హామీలు అమలు చేసే పరిస్ధితి కూడా రాష్ట్రానికి ఉండదు
- ఎలాగో చేసేది మోసమే కాబట్టి హామీలు ఇచ్చేస్తున్నారు
- నా 8 పథకాలకు రూ.52,700 కోట్లు కావాలి
- నేను ఇస్తున్న ఈ స్కీమ్‌లను టచ్‌చేసే ధైర్యం ఎవ్వరికీ లేదు
- బాబు 6 హామీలు జత చేస్తే లక్షా 26 వేల కోట్లు కావాలి
- నేను చాలా కష్టపడితే ఏడాదికి 70 వేల కోట్లు ఇస్తున్నా
- మరి చంద్రబాబు ఏటా లక్షా 26వేల కోట్లు ఇవ్వగలరా
- ఎన్నికలయ్యాక చంద్రబాబు మేనిఫెస్టోని చెత్తబుట్టలో పడేస్తారు
- ఈ నిజాలన్నీ వాలంటీర్లు ఇంటింటికీ చెప్పాలి
మీకు మంచి జరిగి ఉంటేనే నాకు ఓటేయండి: సీఎం జగన్
- ప్రజలు మోసపోకుండా వలంటీర్లే అవగాహన కల్పించాలి
- చంద్రబాబుకు ఓటు వేయటం అంటే ఐదేళ్ల కింద వదిలించుకున్న చంద్రముఖిని మళ్లీ ఇంటికి పిలిపించుకోవడమే
- వలంటీర్లను చూస్తే చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెడతాయి
- బాబును నమ్మితే.. మళ్లీ జన్మభూమి కమిటీలు వస్తాయని చెప్పండి
ప్రసంగం అనంతరం సీఎం జగన్ వంటీర్లకు పురస్కారాలు అందజేత..
- ప్రతి శాసనసభా నియోజకవర్గంలో అత్యుత్తమ ర్యాంకు సాధించిన మొదటి ఐదుగురు వలంటీర్ల చొప్పున.. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో 875 మంది వలంటీర్లకు సేవావజ్ర అవార్డుతోపాటు సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జ్, మెడల్, రూ.45,000 చొప్పున నగదు బహుమతి అందించారు.
- ప్రతి మండలం లేదా మున్సిపాలిటీ పరిధిలో ఐదుగురు చొప్పున, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో 10 మంది చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 4,150 మందికి సేవారత్న అవార్డుతోపాటు సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జ్, మెడల్, రూ.30,000 చొప్పున నగదు బహుమతి అందించారు.
- రాష్ట్రవ్యాప్తంగా ఏడాది పాటు ఎటువంటి ఫిర్యాదులు, వివాదాలు లేకుండా పనిచేసిన మిగిలిన 2,50,439 మంది వలంటీర్లకు సేవామిత్ర అవార్డుతోపాటు సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జ్, రూ.15,000 చొప్పున నగదు బహుమతిని అందజేశారు.
- సేవావజ్ర, సేవారత్న, సేవామిత్ర కలిపి మూడు కేటగిరీల్లో రాష్ట్రవ్యాప్తంగా 2,55,464 మందికి మొత్తం రూ.392.05 కోట్ల నగదును బహుమతుల రూపంలో అందించారు.
- సేవావజ్ర, సేవారత్న, సేవామిత్ర మూడు కేటగిరీ అవార్డులకు అదనంగా వైఎస్సార్ పెన్షన్ కానుక, ఆసరా తదితర పథకాల లబ్ధిదారుల మనోభావాలను అత్యుత్తమంగా సేకరించి, జిల్లా కలెక్టర్లు ఎంపిక చేసిన 997 మంది వలంటీర్లకు వేరేగా ప్రత్యేకంగా నగదు బహుమతులను కూడా ప్రభుత్వం అందించింది.
► కార్యక్రమ వేదికపై మాజీ సీఎం దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి సీఎం వైఎస్ జగన్ నివాళులు అర్పించారు
►ఫిరంగిపురం మండలం రేపూడి చేరుకున్న సీఎం జగన్
►వలంటీర్ల అభినందన సభలో పాల్గొననున్న సీఎం జగన్
►వరుసగా నాలుగో ఏడాది వలంటీర్లకు ప్రోత్సాహకాలు
►వలంటీర్లకు నగదు పురస్కారాలు అందించనున్న సీఎం జగన్
►వలంటీర్లపై మరోసారి ప్రేమను చాటుకున్న సీఎం జగన్
►వలంటీర్లకు నగదు పురస్కారాలను పెంచుతూ నిర్ణయం
►ఫిరంగిపురం బయలుదేరిన సీఎం వైఎస్ జగన్
►కాసేపట్లో వలంటీర్ల అభినందన సభకు హాజరు
►సంక్షేమ పథకాలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాల అమల్లో ఎలాంటి పక్షపాతం, అవినీతికి తావు లేకుండా క్షేత్ర స్థాయిలో విశేష సేవలు అందిస్తున్న వలంటీర్లను రాష్ట్ర ప్రభుత్వం గురువారం నగదు పురస్కారాలతో సత్కరించనుంది. గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. కాగా ప్రభుత్వం ఈ ఏడాది నగదు పురస్కారాలను భారీగా పెంచింది.
►ప్రతి శాసనసభా నియోజకవర్గంలో ఉత్తమ సేవలు అందించిన ఐదుగురికి సేవావజ్ర అవార్డులను అందించనుంది. వీటి కింద గత మూడేళ్లుగా రూ.30 వేల చొప్పున ప్రభుత్వం నగదు బహుమతి అందజేయగా.. ఇప్పుడు ఆ మొత్తాన్ని 50 శాతం పెంచి ఏకంగా రూ.45 వేలు చేసింది. అలాగే మండలాలు, మున్సిపాలిటీల స్థాయిలో ఉత్తమ సేవలు అందించిన ప్రతి ఐదుగురు వలంటీర్లకు సేవారత్న అవార్డులను అందించనుంది. వీటి కింద గత మూడేళ్లు రూ. 20 వేల చొప్పున నగదు బహుమతి అందజేయగా.. ఇప్పుడు ఆ మొత్తాన్ని రూ.30 వేలకు పెంచింది.
►అదేవిధంగా కనీసం ఏడాదికాలంగా పనిచేస్తూ.. ఎటువంటి ఫిర్యాదులు, వివాదాలు లేకుండా పనిచేసిన మిగిలిన వలంటీర్లందరికీ సేవామిత్ర అవార్డులు అందించనుంది. వీటి కింద గత మూడేళ్లుగా రూ.10 వేల చొప్పున నగదు బహుమతి అందజేయగా.. ఇప్పుడు ఈ మొత్తాన్ని రూ.15 వేలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెంచిన నగదు బహుమతులను తాజా పురస్కారాల ప్రదానోత్సవంలో వలంటీర్లకు అందించనుంది.
2.55 లక్షల మంది వలంటీర్లకూ అవార్డులు..
ప్రతి లబ్ధిదారు ఇంటికి వెళ్లి పింఛన్లను పంపిణీ చేయడంతోపాటు రేషన్ డెలివరీ, ఆరోగ్యశ్రీ కార్డు, ఇళ్ల పట్టాలతో సహా వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాల వివరాలను, అమలు తేదీలను లబ్ధిదారులకు వలంటీర్లు వివరిస్తున్నారు. లబ్ధిదారులతో ఆయా పథకాలకు దరఖాస్తులు చేయిస్తున్నారు. అలాగే కోవిడ్, వరదలు, విపత్తులు, ప్రమాదాల సమయంలో వలంటీర్లు వివిధ సహాయ కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొంటున్నారు.
►ఇలా విశేష సేవలు అందిస్తున్న వలంటీర్లకు నగదు పురస్కారాలు అందించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సత్కరించనున్నారు. తర్వాత ఈ నెల 22 వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని శాసనసభా నియోజకవర్గాల పరిధిలో స్థానిక ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు వలంటీర్లకు నగదు పురస్కారాలు అందించనున్నారు. ఈ కార్యక్రమాల నిర్వహణకు ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాల శాఖ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.
పురస్కారాలు ఇలా..
♦ ప్రతి శాసనసభా నియోజకవర్గంలో అత్యుత్తమ ర్యాంకు సాధించిన మొదటి ఐదుగురు వలంటీర్ల చొప్పున.. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో 875 మంది వలంటీర్లకు సేవావజ్ర అవార్డుతోపాటు సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జ్, మెడల్, రూ.45,000 చొప్పున నగదు బహుమతి అందజేస్తారు.
♦ప్రతి మండలం లేదా మున్సిపాలిటీ పరిధిలో ఐదుగురు చొప్పున, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో 10 మంది చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 4,150 మందికి సేవారత్న అవార్డుతోపాటు సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జ్, మెడల్, రూ.30,000 చొప్పున నగదు బహుమతి అందిస్తారు.
♦రాష్ట్రవ్యాప్తంగా ఏడాది పాటు ఎటువంటి ఫిర్యాదులు, వివాదాలు లేకుండా పనిచేసిన మిగిలిన 2,50,439 మంది వలంటీర్లకు సేవామిత్ర అవార్డుతోపాటు సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జ్, రూ.15,000 చొప్పున నగదు బహుమతిని అందజేయనున్నారు.
♦ సేవావజ్ర, సేవారత్న, సేవామిత్ర కలిపి మూడు కేటగిరీల్లో రాష్ట్రవ్యాప్తంగా 2,55,464 మందికి మొత్తం రూ.392.05 కోట్ల నగదును బహుమతుల రూపంలో అందిస్తారు.
♦ సేవావజ్ర, సేవారత్న, సేవామిత్ర మూడు కేటగిరీ అవార్డులకు అదనంగా వైఎస్సార్ పెన్షన్ కానుక, ఆసరా తదితర పథకాల లబ్ధిదారుల మనోభావాలను అత్యుత్తమంగా సేకరించి, జిల్లా కలెక్టర్లు ఎంపిక చేసిన 997 మంది వలంటీర్లకు వేరేగా ప్రత్యేకంగా నగదు బహుమతులను కూడా ప్రభుత్వం గురువారం అందించనుంది.
►ఈ ప్రత్యేక నగదు బహుమతి కింద మండల, పట్టణ, మున్సిపల్ కార్పొరేషన్ స్థాయిలో ఎంపికయ్యే వలంటీర్లకు ఒక్కొక్కరికి రూ.15 వేలు చొప్పున అందిస్తారు. అలాగే నియోజకవర్గ స్థాయిలో ఎంపికైన ఒక్కో వలంటీర్‌కు రూ.20 వేలు చొప్పున అందజేస్తారు. జిల్లా స్థాయిలో ఎంపికయ్యే వారికి రూ. 25 వేల చొప్పున అందజేయనున్నారు. మొత్తం 997 మంది వలంటీర్లకు ప్రత్యేక నగదు బహుమతుల రూపంలో మొత్తం రూ.1.61 కోట్లు అందిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment