Cash-free treatment
-
హెల్త్ కార్డులకు కార్పొ‘రేటు’ పోటు
నగదు రహిత చికిత్సకు నో అంటున్న ప్రధాన ఆసుపత్రులు సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం ప్రవేశపెట్టిన నగదు రహిత చికిత్స ఉద్యోగులకు పెద్దగా ఉపయోగపడడం లేదు. హెల్త్ కార్డులు జారీచేసినా పాత పద్ధతిలోనే ముందుగా డబ్బులు చెల్లిస్తూ చికిత్స చేయించుకుంటున్నారు. ఆ తర్వాత మెడికల్ బిల్లులు సమర్పించి రీయింబర్స్మెంట్ పొందేందుకు అవస్థలు పడుతున్నారు. రాష్ట్రంలో 12 ప్రధాన ఆసుపత్రులు ఈ నగదు రహిత ఆరోగ్య కార్డుల ఉద్యోగుల చికిత్సకు అంగీకరించకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఆ ఆసుపత్రులకే చాలా మంది ఉద్యోగులు ఎగబడుతున్నారు. అయితే ప్యాకేజీలు తమకు సరిపోవని... కనీసం 25 శాతం పెంచాలని ఆ కార్పొరేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు కోరుతున్నాయి. దీన్ని ప్రభుత్వం అంగీకరించడం లేదు. ఈ నేపథ్యంలో ఆరోగ్యకార్డుల ద్వారా,పాత పద్ధతిలోనూ చికిత్సకు ప్రభుత్వం అంగీకరించింది. దీన్ని ఈ నెలాఖరు వరకు కొనసాగించిన ప్రభుత్వం... ఇదే విధానాన్ని మరో 3 నెలలు పొడిగిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. ఆరోగ్యశ్రీ ట్రస్టు పరిధిలోకి ఉద్యోగుల నగదు రహిత ఆరోగ్య కార్డులను ప్రభుత్వం ఇటీవలే తీసుకొచ్చింది. దాదాపు 230 ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులు ఉద్యోగుల నగదు రహిత చికిత్సకు ఒప్పుకున్నాయి. అయితే 12 ప్రధాన కార్పొరేట్ ఆసుపత్రులు దీనికి అంగీకరించడంలేదు. ఆరోగ్యశ్రీ కింద పేదలకు చికిత్స కాబట్టి సామాజిక బాధ్యతగా ప్యాకేజీలు తక్కువగా ఉన్పప్పటికీ తాము అంగీకరించామని... భారీగా వేతనాలున్న ఉద్యోగులకూ ఈ ప్యాకేజీనే అమలు చేయడం సాధ్యంకాదంటున్నాయి. అందువల్ల వీటికి 25 శాతం పైగా పెంచాలని కోరుతున్నాయి. ఒకవేళ ప్యాకేజీ సొమ్మును పెంచితే అన్ని ఆసుపత్రులకూ అమలు చేయాల్సి ఉంటుందని ప్రభుత్వం భయపడుతుంది. సమస్యకు ఉద్యోగ సంఘాల మూడు పరిష్కారాలు 1. కేంద్ర ఉద్యోగులకు ఇచ్చే ప్యాకేజీని అమలు పరచడం 2. నిమ్స్ ఆసుపత్రుల్లో మిలీనియం బ్లాక్ ప్యాకేజీని అమలు చేయడం 3. బీమా సంస్థల ప్యాకేజీని అమలు చేయడం -
నగదు రహిత వైద్యంపై తొలగని ప్రతిష్టంభన
ఆస్పత్రులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో మంత్రి చర్చలు 3న మళ్లీ భేటీ సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగుల నగదు రహిత వైద్య చికిత్సపై నెలకొన్న ప్రతిష్టంభన ఇంకా వీడలేదు. దీనిపై ఏపీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల ప్రతినిధులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ బుధవారం తన నివాసంలో చర్చలు జరిపినా ఓ కొలిక్కి రాలేదు. పథకానికి కార్పొరేట్ ఆస్పత్రులు సహకరించాలని మంత్రి కామినేని కోరారు. ప్యాకేజీ రేట్లు, ఓపీ సేవలు, మందుల సరఫరా లాంటి విషయాల్లో తమకు ఇబ్బందులున్నాయని ఈ సందర్భంగా ప్రైవేట్ ఆస్పత్రులు ప్రతినిధులు మంత్రికి తెలిపారు. హెల్త్ కార్డులు ఇచ్చినా ఇప్పటికీ నగదు చెల్లించి వైద్యం చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొందని ఉద్యోగ సంఘాల నేతలు వాపోయారు. ఈ నేపథ్యంలో జనవరి 3వ తేదీన మరోసారి సమావేశం నిర్వహించాలని మంత్రి నిర్ణయించారు. జనవరి నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ పథకం అమలు కావాల్సిందేనని స్పష్టం చేశారు. దేశంలో ఇలాంటి పథకం ఏ రాష్ట్రంలోనూ అమలు కావడం లేదన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు సహకరించాలని కోరారు. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ రమణమూర్తి, రెవెన్యూ ఉడ్యోగుల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ ఎన్జీవో విజయవాడ శాఖ అధ్యక్షుడు సాగర్, సహకార శాఖ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఫణి పేర్రాజు, యూటీఎఫ్ అధ్యక్షుడు ఐ.వెంకటేశ్వరరావు తదితరులు మంత్రితో చర్చల్లో పాల్గొన్నారు. వాజ్పాయ్కి భారతరత్నపై హర్షం మాజీ ప్రధాని వాజ్పేయి, మదన్మోహన్ మాలవీయలకు భారతరత్న పురస్కారం ప్రకటించడంపై మంత్రి కామినేని హర్షం ప్రకటించారు. -
ఓపీ ఆసుపత్రుల్లో అసౌకర్యం
ఉద్యోగులకు, పెన్షనర్లకు ఓపీ ఆసుపత్రులను కేటాయించడం హర్షణీయమే. కానీ రాష్ట్రంలోని ఏ ప్రభుత్వాసుపత్రీ సక్రమంగా నడుస్తున్న దాఖలాలు లేవు. సరైన వైద్య పరికరాలు, సాధనాలు, మందులు ఉండవు. పైగా మధ్యా హ్నం 2 గంటల నుంచి, సాయంకాలం 4 గంటల వరకు ఓపీని నిర్వహించడం వల్ల జిల్లాల్లోని దూర ప్రాంతాల నుంచి రోగులు వచ్చి వెళ్లడం చాలా కష్టం. దీంతో పెన్షనర్లకు మరింత వ్యయ ప్రయాసలు తప్ప మేలు లేదు. ఇక ప్రైవేట్ ఆసుపత్రులలో ఈ పరీక్షలకు 13 జిల్లాల వారికి 3 జిల్లాలలో చూపించు కోవడానికి మాత్రమే అనుమతించారు. నగదు రహిత వైద్యమందించడానికి, అన్ని జిల్లాలలోనూ, జిల్లా హెడ్క్వార్ట ర్స్లోనూ, ఇతర ప్రాంతాల్లో ప్రైవేట్ ఆసుపత్రులకు అనుమ తినివ్వాలి. రాష్ట్రం మొత్తం మీద ఉద్యోగులు, పెన్షనర్లు ఏడెని మిది లక్షల మంది ఉంటారు. వారి నుండి రూ. 90లు, రూ.120ల చొప్పున ఈ నెల నుండి వసూలు చేస్తున్నారు. ప్రతి నెలా కోట్ల మొత్తం ప్రభుత్వానికి వస్తుంది. కాబట్టి ఆరోగ్యశ్రీలా కాకుండా ఇన్పేషెంట్లకు హోదాకు తగిన రీతిలో వైద్య సదుపాయం అందించేలా ఉండాలి. - వై.శ్యామలాదేవి కాకినాడ, తూర్పుగోదావరి జిల్లా