ఉద్యోగులకు, పెన్షనర్లకు ఓపీ ఆసుపత్రులను కేటాయించడం హర్షణీయమే. కానీ రాష్ట్రంలోని ఏ ప్రభుత్వాసుపత్రీ సక్రమంగా నడుస్తున్న దాఖలాలు లేవు. సరైన వైద్య పరికరాలు, సాధనాలు, మందులు ఉండవు. పైగా మధ్యా హ్నం 2 గంటల నుంచి, సాయంకాలం 4 గంటల వరకు ఓపీని నిర్వహించడం వల్ల జిల్లాల్లోని దూర ప్రాంతాల నుంచి రోగులు వచ్చి వెళ్లడం చాలా కష్టం. దీంతో పెన్షనర్లకు మరింత వ్యయ ప్రయాసలు తప్ప మేలు లేదు. ఇక ప్రైవేట్ ఆసుపత్రులలో ఈ పరీక్షలకు 13 జిల్లాల వారికి 3 జిల్లాలలో చూపించు కోవడానికి మాత్రమే అనుమతించారు.
నగదు రహిత వైద్యమందించడానికి, అన్ని జిల్లాలలోనూ, జిల్లా హెడ్‌క్వార్ట ర్స్‌లోనూ, ఇతర ప్రాంతాల్లో ప్రైవేట్ ఆసుపత్రులకు అనుమ తినివ్వాలి. రాష్ట్రం మొత్తం మీద ఉద్యోగులు, పెన్షనర్లు ఏడెని మిది లక్షల మంది ఉంటారు. వారి నుండి రూ. 90లు, రూ.120ల చొప్పున ఈ నెల నుండి వసూలు చేస్తున్నారు. ప్రతి నెలా కోట్ల మొత్తం ప్రభుత్వానికి వస్తుంది. కాబట్టి ఆరోగ్యశ్రీలా కాకుండా ఇన్‌పేషెంట్లకు హోదాకు తగిన రీతిలో వైద్య సదుపాయం అందించేలా ఉండాలి.
- వై.శ్యామలాదేవి కాకినాడ, తూర్పుగోదావరి జిల్లా
ఓపీ ఆసుపత్రుల్లో అసౌకర్యం
Published Wed, Dec 17 2014 4:16 AM | Last Updated on Sat, Sep 2 2017 6:16 PM
Advertisement
Advertisement