cash shortages
-
నగదు కొరతతో అప్పుల ఊబిలోకి రైతులు
- తగిన చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను కోరిన టీపీసీసీ బృందం - రైతుల సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్యం: ఉత్తమ్ సాక్షి, హైదరాబాద్: బ్యాంకుల్లో నగదు కొరత వల్ల రైతులు అప్పుల ఊబిలోకి పోతున్నారని, రైతును ఆదుకోవడానికి తగిన చర్యలను తీసుకోవాలని గవర్నర్‌కు టీపీసీసీ బృందం విజ్ఞప్తి చేసింది. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో నేతల బృందం గవర్నర్‌ను రాజ్‌భవన్‌లో శనివారం కలిసింది. రైతుల సమస్యలు, నగదు కొరత, నకిలీ విత్తనాల వంటి వాటిపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని వివరిం చారు. ప్రతిపక్షనేతలు కె.జానారెడ్డి, షబ్బీర్ అలీ, పీఏసీ చైర్పర్సన్ గీతారెడ్డి, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, కేంద్ర మాజీమంత్రి బలరాం నాయక్, మాజీ మంత్రులు డీకే అరుణ, దానం నాగేందర్, టీపీసీసీ కిసాన్‌సెల్ అధ్యక్షుడు కోదండ రెడ్డి, మండలిలో కాంగ్రెస్ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి తదితరులు బృందంలో ఉన్నారు. అనంతరం ఉత్తమ్ మాట్లాడుతూ మూడేళ్లుగా ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని, తమ సొంత ఖాతాల్లోని డబ్బును కూడా తీసుకునే పరిస్థితి లేకుండా పోయిందని పేర్కొన్నారు. కూలీలకు ఉపాధి హామీ జీతాలివ్వడం లేదని విమర్శించారు. రుణమాఫీ 4 విడతల్లో చేయడం వల్ల రైతుకు ఎలాంటి ప్రయోజనం కలగలేదని, వడ్డీమాఫీ పథకంగా మారిపోయి బ్యాంకులకు ఉపయోగపడిందని విమర్శించారు. రైతుల పంటరుణాలపై వడ్డీభారం ప్రభుత్వమే భరిస్తుందని ఆరు నెలల క్రితం సీఎం కేసీఆర్ అసెంబ్లీలోనే హామీ ఇచ్చారని ఉత్తమ్ గుర్తుచేశారు. అయినా అమలు కాలేదన్నారు. నకిలీ విత్తనాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడుతున్న కాంగ్రెస్ నేతలను అక్రమ కేసుల్లో ఇరికించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. వరంగల్‌లో టీఆర్ఎస్ కార్పొరేటర్ హత్య కేసులో స్థానిక కాంగ్రెస్ నేత రాజేందర్‌రెడ్డిని అక్రమంగా ఇరికిస్తున్నారని, దీనిపై డీజీపీతో మాట్లాడినట్లు చెప్పారు. కేసు నుంచి రాజేందర్‌రెడ్డి పేరును తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కేసును సీబీసీఐడీకి అప్పగించాలని డిమాండ్ చేశారు. పొంగులేటి మాట్లాడుతూ.. డ్రగ్స్ కేసులో సంబంధమున్న వారందరిపై కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. -
మళ్లీ నగదు కష్టాలు
- ఏటీఎంల వద్ద నోక్యాష్ బోర్డులు - బ్యాంకులలో తగ్గిన నిల్వ - ఆర్బీఐ చిల్లిగవ్వ విదల్చని వైనం - 712 ఏటీఎంలకు పనిచేస్తున్నవి 150 - బ్యాంకు డిపాజిట్లకు ప్రజలు అనాసక్తి - స్వల్పంగానే నగదురహిత లావాదేవీలు మళ్లీ నగదు కష్టాలు మొదలయ్యాయి. ఏటీఎంల వద్దకు వెళ్లి నిరాశతో వెనుదిరుగుతున్నారు. నెల రోజులుగా ఆర్బీఐ చిల్లిగవ్వ కూడా విదిల్చకపోవడంతో బ్యాంకుల్లో నగదు కొరత నెలకొంది. జిల్లా వ్యాప్తంగా 596 బ్యాంకు శాఖల్లో రూ.488.99 కోట్లు మాత్రమే నగదు నిల్వ ఉంది. ఆర్బీఐ నుంచి నగదు రాకుంటే నగదు కష్టాలు పెరిగే ప్రమాదం ఉంది. 712 ఏటీఎంలలో 150 ఏటీఎంలకు మించి పనిచేయడం లేదు. అవి కూడా అరకొరగా పనిచేస్తున్నాయి. చిన్న బ్యాంకుల్లో నగదు నిల్వలు లేకపోవడంతో ఏటీఎంలను తాత్కాలికంగా మూసివేశారు. ఖాతాదారులు నగదు డిపాజిట్ చేసేందుకు అనాసక్తి చూపుతున్నారు. దీంతో నగదు కొరత ఏర్పడుతోంది. నగదు రహిత లావాదేవీలు నామమాత్రంగా కొనసాగుతుండడంతో నగదు కష్టాలు మొదటికొచ్చాయి. తిరుపతి (అలిపిరి): జిల్లాలో నగదు కట కట ప్రారంభమయ్యింది. గతేడాది నవంబర్‌లో పెద్ద నోట్ల రద్దు ప్రకటన తరువాత రెండు నెలల పాటు జిల్లాలో నగదు కష్టాలతో ప్రజలు అవస్థలు పడ్డారు. ఈఏడాది ఆరంభం తర్వాత నుంచి నగదు కష్టాల నుంచి పోయాయి. ఆర్బీఐ బ్యాంకులకు దశలవారీగా నగదు పంపిణీ చేస్తూ వచ్చింది. నగదు రహితం పేరుతో జూన్‌లో ఆర్బీఐ పైసా కూడా విదల్చ లేదు. ఫలితంగా బ్యాంకులో నగదు నిల్వలు పడిపోయాయి. ప్రస్తుతం 40 జాతీయ బ్యాంకుల పరిధిలో 596 బ్యాంకు శాఖలున్నాయి. వీటిలో రూ.488.99 కోట్లు మాత్రమే నిల్వ ఉంది. జూలై మొదటి వారంలో బ్యాంకుల్లో నగదు విత్‌డ్రా చేసే వారి సంఖ్య అధికంగా ఉంటుంది. ఇలానే కొనసాగితే రెండు వారాల్లో నగదు పూర్తిగా ఖాళీ అయ్యే ప్రమాదముందని తెలుస్తోంది. ఏటీఎంలలో నో మనీ.. జిల్లాలో 712 ఏటీఎం కేంద్రాలుంటే 150కు మించి పనిచేయడం లేదు. వాటిలో కూడా గంటల వ్యవధిలో నగదు ఖాళీ అవుతోంది. దీంతో ఏటీఎం కేంద్రాలకు వెళ్లే ఖాతాదారులకు అవస్థలు తప్పడం లేదు. చిన్న బ్యాంకు శాఖలు ఏటీఎం కేంద్రాలను నిర్వహించలేక తాత్కాలికంగా మూసివేశాయి. తిరుపతి, చిత్తూరు, మదనపల్లి, పుత్తూరు, పుంగనూరు వంటి ప్రాంతా ల్లో ఎస్బీఐ, ఆంధ్రాబ్యాంక్, కరూర్ వైశ్యాబ్యాంక్, యూనియన్ బ్యాంక్ శాఖలకు చెందిన ఏటీఎంలలో నగదు లేక బోసిపోయాయి. సోమవారం మధ్యాహ్నం ఎస్బీఐ శాఖలకు చెందిన ఏటీఎంలో నగదు అందుబాటులోకి తీసుకొచ్చారు. కొద్దిసేపట్లోనే నగదు ఖాళీ అయిపోయింది. నగదు డిపాజిట్లకు అనాసక్తి ఖాతాదారులు బ్యాంకుల్లో నగదు దాచుకోవడానికి ఆసక్తి చూపడం లేదు. బ్యాంకుల నుంచి నగదు విత్‌డ్రా చేసుకుంటున్నారే గాని డిపాజిట్ చేయడం లేదు. దీంతో బ్యాంకులో రొటేషన్ ఆగిపోయింది. మూడుసార్లకు మించి నగదును డిపాజిట్, విత్‌డ్రాలు చేస్తే సేవా పన్ను విధిస్తామని బ్యాంకులు ప్రకటించిన నేపథ్యంలో బ్యాంకుల్లో నగదు దాచుకోవడానికి ప్రజలు ముందుకు రావడం లేదు. నామమాత్రంగా నగదు రహితం.. నగదు కష్టాల నుంచి గట్టేక్కడానికి నగదు రహితం ఒక్కటే శరణ్యమని అధికారులు చెప్పుకొచ్చారు. బ్యాంకర్లు కూడా దీనినే పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా చేసే లావాదేవీల్లో ఖాతాదారులు దారుణంగా మోసపోతున్నాడు. స్వైపింగ్ ద్వారా కొనుగొలు చేసే ఖాతాదారులకు రూ.100కి రూ.1.20 సర్వీసు ట్యాక్స్ పడుతోంది. మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్, మొబైల్ వాలెట్ ద్వారా చెల్లింపులు చేస్తే కంటికి కనిపించకుండా సర్వీసు చార్జీల పేరుతో నగదు ఖాతాల్లోనుంచి మాయమవుతుండడంతో ప్రజలు నగదు రహితం జోలికి వెళ్లడానికి భయపడుతున్నారు. బ్యాంకుల్లో నగదు కొరత జిల్లా బ్యాంకుల్లో నగదు కొరత వాస్తవమే. ఏటీఎంలు పరిమితిగా> పనిచేస్తున్నాయి. ఆర్బీఐ నుంచి నగదు రావాల్సివుంది. నెల రోజులుగా జిల్లాకు ఆర్బీఐ నగదును పంపిణీ చేయలేదు. దీంతో బ్యాంకుల్లో తాత్కాలిక నగదు కొరత ఏర్పడింది. వారం రోజుల్లో నగదు చేరే అవకాశం వుంది. –లక్ష్మీనారాయణ, డీజీఎం,లీడ్ బ్యాంక్, తిరుపతి -
అమ్మో.. ఒకటో తారీఖు
► బ్యాంకుల్లో నగదు నిల్ ► రేపటి నుంచి అమల్లోకి జీఎస్టీ ► ఆందోళనలో వ్యాపారులు ► మధ్య తరగతి ప్రజల్లో అయోమయం నెల్లూరు (సెంట్రల్) : పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో బ్యాంకులను నగదు కొరత వెంటాడుతోంది. మరోవైపు వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అమల్లోకి రాబోతోంది. ఈ పరిస్థితుల్లో జూలై 1వ తేదీ అటు వ్యాపారులను.. ఇటు సామాన్య, మధ్య తరగతి ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. హోటల్స్, మందులు, ఎరువులు, వస్త్రాల వ్యాపారులు జీఎస్టీ ప్రభావాన్ని తలచుకుని బెంబేలెత్తుతున్నారు. ఆ పన్నులను తమపైనే రుద్దుతారని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. ఎటు తిరిగి ఎటొచ్చినా ఆ ప్రభావం సామాన్య, మధ్య తరగతి ప్రజలతోపాటు చిరు వ్యాపారులపై పడుతుందనేది కలవరం రేపుతోంది. బ్యాంకుల్లో నగదు లేదు జిల్లాలో 424 ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు న్నాయి. వీటికి అనుబంధంగా 486 వరకు ఏటీఎంలు పని చేస్తున్నాయి. బ్యాంకుల్లో లావాదేవీలు నడవాలంటే రోజుకు కనీసం రూ.100 కోట్లు అవసరం. అంటే నెలకు రూ.3 వేల కోట్ల నగదును బ్యాంకులు సమకూర్చుకోవాల్సి ఉంటుంది. కాగా, పెద్దనోట్లు రద్దయిన తరువాత ఆర్బీఐ నుంచి జిల్లాకు నామ మాత్రంగానే కొత్త నోట్లు వస్తున్నాయి. ప్రతినెలా 1–5వ తేదీల మధ్య జీతాలు, పింఛన్ తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జూన్‌లోనూ నగదు కష్టాలు తలెత్తాయని బ్యాంకర్లు చెబుతున్నారు. జిల్లాలో 75 శాతం ఏటీఎంలు పనిచేయలేదు. ఈ పరిస్థితుల్లో వచ్చేనెల 1న నగదు ఎలా సర్దుబాటు చేయాలో అర్థం కావడం లేదని బ్యాంకర్లు పేర్కొంటున్నారు. జీఎస్టీ అమలుతో ఆందోళన మరోవైపు జీఎస్టీని తలచుకుని వస్త్ర వ్యాపారులు కలవరపడుతున్నారు. ముందెన్నడూ లేనివిధంగా పన్ను విధిస్తుండటంతో ఆవేదనకు గురవుతున్నారు. ఈ భారాన్ని ఎలా మోయాలో అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు. హోటల్స్‌దీ అదే తీరు హోటల్స్‌పై జీఎస్టీ ప్రభావం అధికంగానే ఉండబోతోంది. ఇప్పటివరకు ఉన్న 5 శాతం పన్నును 18 శాతానికి పెంచనుండటంతో అటు వ్యాపారులు, ఇటు వినియోగదారులు ఆందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా గ్రామీణులు వివిధ పనుల నిమిత్తం తరచూ పట్టణాలకు వస్తుంటారు. వారంతా ఏదో ఒక హోటల్‌కు వెళ్లి భోజనం లేదా టిఫిన్ చేయాల్సిన పరిస్థితి. ఇప్పటికే హోటళ్లలో ధరల వల్ల భోజనం చేయాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి. జీఎస్టీ అమల్లోకి వస్తే ధరలు మరింత పెరుగుతాయి. ఎరువుల పైనా.. జిల్లాలో ఎక్కువ మంది వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. ఎరువులపై ప్రస్తుతం ఉన్న 5 శాతం పన్ను జీఎస్టీ అమల్లోకి వస్తే 12 శాతానికి పెరుగుతుంది. రైతులు ఇకపై 7 శాతం అదనంగా పన్ను భారం మోయాల్సి వస్తుంది. టిక్కెట్ కొనకుండానే సినిమా కనిపిస్తుంది ఉరుకులు పరుగుల జీవితం గడుపుతున్న వారు వారాంతం లేదా మాసాంతంలో సిని మా చూడటం ద్వారా రిలీఫ్ అవుతుంటారు. ఇప్పటికే ధరల బాదుడుతో అల్లాడుతున్న ప్రేక్షకులకు ఇకపై సినిమా మరింత భా రం కానుంది. టికెట్ ధరలపై 28 శాతం జీఎస్టీ భారం పడబోతోంది. కుటుంబ సభ్యులతో కలిసి సిని మాకు వెళ్లాలంటే రూ.వెయ్యి సరిపోని పరిస్థితి. -
క్యాష్‌లెస్ కష్టాలు
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు జరిగి ఇప్పటికి ఐదు నెలలు దాటినా నగదు కొరత కష్టాలు తీరలేదు. అదీగాక గత రెండు నెలలుగా నగదు కొరత మరింత ఎక్కువైనట్లు తాజా సర్వేలో వెల్లడైంది. ‘గత రెండు నెలలుగా పరిస్థితి మరింత దిగజారింది. గత వారంలో హైదరాబాద్‌లోని ఏటీఎంల చుట్టూ తిరిగిన 83 శాతం మంది నోటు కళ్లజూడకుండానే వెనుదిరగాల్సి వచ్చింది. మహారాష్ట్రలోని పుణేలో కూడా 69 శాతం మందిది ఇదే పరిస్థితి’ అని లోకల్ సర్కిల్స్ సిటిజెన్ ఎంగేజ్మెంట్ ప్లాట్‌ఫాం జరిపిన సర్వేలో వెల్లడైంది. దేశవ్యాప్తంగా 11 నగరాల్లో.. సుమారు 10 వేల మందిపై ఈ సంస్థ సర్వే జరిపింది. ఏటీఎంలతో హైదరాబాద్‌వాసులే ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు సర్వేలో తేలింది. బ్యాంకులు 4 నగదు ఉపసంహరణల తర్వాత చార్జీలు విధిస్తున్న నేపథ్యంలో పెద్ద మొత్తంలో డబ్బును డ్రా చేస్తున్నట్లు చాలా మంది తెలిపారు. ఇక ఢిల్లీలో 11% మంది ఇబ్బందులు ఎదుర్కొనట్లు సర్వేలో వెల్లడైంది. -
పసిడి రేటు మరింత తగ్గే అవకాశం!
అంతర్జాతీయంగా బలహీన ట్రెండ్, దేశీయంగా నగదు కొరతతో జ్యుయలర్లు.. రిటైలర్ల నుంచి డిమాండ్ తగ్గుదల వంటి అంశాలతో పుత్తడి ధరలు వరుసగా మరో వారమూ నష్టాల్లోనే ముగిశాయి. వారాంతంలో అంతర్జాతీయంగా పసిడి కాస్త పుంజుకున్నప్పటికీ.. దేశీయంగా మాత్రం నష్టాలు తప్పలేదు. రాబోయే రోజుల్లో అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ మరింత వేగంగా వడ్డీ రేట్లు పెంచే అవకాశమున్నందున డాలర్ బలపడి.. స్వల్పకాలికంగా పసిడి, వెండి రేట్లు మరింతగా క్షీణించే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు పేర్కొన్నారు. ఢిల్లీ బులియన్ మార్కెట్లో పసిడి ధర గతవారం రూ.130 మేర తగ్గింది. ఆభరణాల బంగారం పది గ్రాముల రేటు వారం మొదట్లో రూ. 27,750 వద్ద ప్రారంభం కాగా ఆఖరున క్రితం వారం ముగింపుతో పోలిస్తే రూ. 130 నష్టంతో రూ. 27,650 వద్ద క్లోజయ్యింది. అలాగే మేలిమి బంగారం ధర కూడా రూ. 27,900 వద్ద ప్రారంభమై దాదాపు రూ. 130 నష్టంతో రూ. 27,800 వద్ద ముగిసింది. వెండి కేజీ ధర కీలకమైన రూ. 39,000 కన్నా దిగువన రూ. 38,810 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా పసిడి ఔన్సు (31.1 గ్రాములు) రేటు 1,132 డాలర్ల స్థాయిలో ఉంది.