cash transaction
-
స్టార్టప్స్ కోసం ప్రత్యేక బ్యాంకు సేవలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్టార్టప్ కంపెనీలకు ఖాతా ప్రారంభం, నగదు లావాదేవీల నిర్వహణ, ఇతరత్రా సేవలందించేందుకు హెచ్డీఎఫ్సీ బ్యాంకు ప్రత్యేక బ్రాంచీలను ఏర్పాటు చేసింది. బుధవారమిక్కడ గచ్చిబౌలిలో స్మార్టప్ జోన్‌ను ప్రారంభించిన సందర్భంగా హెచ్డీఎఫ్సీ సౌత్ హెడ్ మధుసూదన్ హెగ్డే విలేకరులతో మాట్లాడారు. దేశంలోని ప్రధాన నగరాల్లో 30 ప్రాంతాల్లో 65 స్మార్టప్ జోన్లను ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 660, హైదరాబాద్‌లో 225 స్టార్టప్స్ ఖాతాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. రెండో దశలో హైటెక్‌సిటీ, మాదాపూర్ బ్రాంచీల్లో, ఈనెల 15న విశాఖపట్నంలో స్మార్టప్ జోన్లను ప్రారంభిస్తామని పేర్కొన్నారు. 6 నెలల్లో 15 సెంట ర్లను ఏర్పాటు చేయడం లక్ష్యమని చెప్పారు. -
ఇకపై ఎస్బీఐ లావాదేవీలపై చార్జీల మోతే
న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ఇటీవల విధించిన కొత్త చార్జీలు నేటి(జూన్ 1) నుంచి అమలు చేయనుంది. ఎటీంఎం, ఆన్లైన్ క్యాస్ ట్రాన్సాక్షన్లపై బాదుడు షురూ అయినట్టే. మొబైల్ యాప్ 'ఎస్బీఐ బ్యాంక్ బడ్డీ'తో నగదు విత్ డ్రా, తదితరాలకు కొత్త చార్జీలు అమలులోకి వచ్చాయి. దీంతో ఇకనుంచి నగదు ఉపసంహరణ, చెల్లింపులపై ఇక చార్జీల మోత మోగనుంది. ఇటీవల సవరించిన ఎస్బీఐ నిబంధనల ప్రకారం ప్రతి నెలా తొలి నాలుగు లావాదేవీలు మాత్రమే ఖాతాదారులకు ఉచితం. ఆపై జరిపే ప్రతి లావాదేవీపై రూ.50 సేవా పన్నును వసూలు చేయనుంది. ఇక ఎస్బీఐ ఏటీఎంల్లో కార్డు ద్వారా నగదు విత్‌డ్రా చేస్తే రూ.10, ఇతర బ్యాంకు ఎటీఎం నుంచి విత్‌డ్రా చేస్తే రూ.20 వడ్డించనుంది. ఇక సాధారణ సేవింగ్స్ ఖాతాలపై ఎనిమిది ఉచిత ఏటీఎం లావాదేవీలు (ఎస్బీఐ ఏటీఎంలలో 5, ఇతర ఏటీఎంలలో 3) కొనసాగుతాయి. నాన్ మెట్రో, మెట్రో నగరాల్లో 10 లావాదేవీలు ఉచితం. ఈ ఉచిత లావాదేవీల తరువాత, ఎస్బీఐ బ్యాంకు ఏటీఎంను వాడి డబ్బు తీసుకుంటే రూ. 50 వసూలు చేస్తుంది. దీంతోపాటు నెలకు రూ.50 వేలకు మించి చెల్లింపులు జరిపే వారి నుంచి 5 శాతం టీడీఎస్ వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక కొత్త చెక్ బుక్ కావాలంటే రూ. 30 (10 చెక్కులు), రూ. 75 (25 చెక్కులు), రూ. 150 (50 చెక్కులు)కి తోడు అదనంగా సర్వీస్ టాక్స్ చెల్లించాల్సిందే. ఆన్లైన్ ట్రాన్సాక్షన్లపై కూడా అదనపు చార్జీలను వసూలు చేయనుంది. ఐఎంపీఎస్, యూపీఐ, ఐయూఎస్ఎస్‌డీల ద్వారా రూ.లక్ష వరకు లావాదేవీలపై సేవా పన్ను కాక అదనంగా రూ.5 చెల్లించాల్సిందే. రూ. లక్ష నుంచి 2 లక్షల మధ్య లావాదేవీలపై రూ.15, రూ.2 లక్షల నుంచి 5లక్షల లావాదేవీలపై రూ.25 అదనంగా వడ్డించనుంది. మరోవైపు చిరిగిన నోట్ల మార్పిడిపై కూడా బ్యాంకులు అదనపు చార్జీలు వసూలు చేయనున్నాయి. పాడైపోయిన నోట్లను మార్చుకోవాలని వెళితే, ఆ మొత్తం రూ. 5 వేల కన్నా ఎక్కువ లేదా 20 నోట్లు ఉంటే, ఒక్కో నోటుకు రూ. 2 ప్లస్ సర్వీస్ చార్జ్ ని బ్యాంకు వసూలు చేస్తుంది. -
బ్యాంకుకెళ్తే బాదుడే..!!
-
బ్యాంకుకెళ్తే బాదుడే..!!
⇒ నగదు లావాదేవీలపై పరిమితులు ⇒ నెలలో 4 దాటితే రూ. 150 వడ్డన ⇒ హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంకుల్లో అమల్లోకి న్యూఢిల్లీ: బ్యాంకుల్లో ఉచిత నగదు లావాదేవీల సంఖ్యను కుదిస్తూ హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ, యాక్సిస్ తదితర ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజాలు బుధవారం నుంచి పరిమితులను అమల్లోకి తెచ్చాయి. నెలలో నాలుగు నగదు లావాదేవీలు (డిపాజిట్లు, విత్‌డ్రాయల్స్) దాటితే రూ. 150 వడ్డించడం మొదలుపెట్టాయి. పొదుపు, శాలరీ అకౌంట్లకు వీటిని వర్తింపచేస్తున్నట్లు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఒక సర్క్యులర్‌లో తెలిపింది. దీని ప్రకారం ఒక నెలలో పొదుపు ఖాతాలకు సంబంధించి హోమ్ బ్రాంచ్‌లలో నాలుగు నగదు లావాదేవీలు ఉచితంగా నిర్వహించుకోవచ్చు. అవి దాటితే ప్రతి అదనపు లావాదేవీపై రూ. 150 చెల్లించాల్సి ఉంటుంది. ఇక థర్డ్ పార్టీ నగదు లావాదేవీలకు సంబంధించి రోజుకు రూ. 25,000 పరిమితి ఉంటుంది. బేసిక్ నో–ఫ్రిల్స్ ఖాతాల్లో గరిష్టంగా నాలుగు విత్‌డ్రాయల్స్ ఉచితంగా ఉంటాయి. నగదు డిపాజిట్లకు ఫీజులేమీ వర్తించవు. ఐసీఐసీఐ: ఐసీఐసీఐ బ్యాంక్ వెబ్సైట్ ప్రకారం.. హోమ్ బ్రాంచ్‌లో నెలలో తొలి నాలుగు లావాదేవీలు ఉచితం. అవి దాటితే ప్రతి రూ. 1,000కి రూ. 5 చొప్పున.. కనిష్టంగా రూ. 150 చార్జీలు ఉంటాయి. థర్డ్ పార్టీ లిమిట్ రోజుకు రూ. 50,000గా ఉంటుంది. నాన్–హోమ్ బ్రాంచ్‌లలో నెలలో తొలి నగదు లావాదేవీ ఉచితం. అటుపైన ప్రతి రూ. 1,000కి రూ. 5 చార్జీ. కనిష్టంగా రూ. 150 చార్జీలు వర్తిస్తాయి. అటు క్యాష్ డిపాజిట్ మెషీన్లలో కూడా తొలి నగదు డిపాజిట్ ఉచితం. ఆ తర్వాత రూ. 1,000కి రూ. 5 చొప్పున చార్జీలు ఉంటాయి. యాక్సిస్ బ్యాంక్..: విలువపరంగా రూ. 10 లక్షల దాకా తొలి అయిదు నగదు లావాదేవీలు (డిపాజిట్లు, విత్‌డ్రాయల్స్) ఉచితం. దాటితే ప్రతి వెయ్యి రూపాయలకు రూ. 5 లేదా రూ. 150 (ఏది ఎక్కువైతే అది) మేర చార్జీలు వర్తిస్తాయి. -
హెచ్డీఎఫ్సీ బాదుడు షురూ!
ముంబై: నగదు లావాదేవీలను నిరుత్సాహపరిచే క్రమంలో దేశంలో రెండవ పెద్ద ప్రైవేట్ బ్యాంకు హెచ్డీఎఫ్సీ బ్యాంకు కీలక నిర్ణయం తీసుకుంది. వినియోగదారుల సేవిగ్ ఖాతాల నగదు లావాదేవీలపై చార్జీల బాదుడుకు సిద్ధమైంది. ఈ చార్జీలను భారీగా పెంచేందుకు నిర్ణయించింది. మార్చి 1 నుంచి ఈ పెంచిన చార్జీలు అమల్లోకి వస్తాయని బ్యాంకు అధికారి శుక్రవారం మీడియాకు తెలిపారు. బ్యాంకు అధికారిక వెబ్ సైట్ వివరాల ప్రకారం...థర్డ్‌పార్టీ ట్రాన్సాక్షన్స్‌ను రూ.25 వేలకు కుదించింది. ఇప్పటివరకూ ఈ పరిమితి రోజుకు రూ.50 వేలు. అలాగే ఫ్రీ ట్రాన్సాక్షన్స్‌ను అయిదు నుంచి నాలుగుకి తగ్గించింది. నాన్-ఫ్రీ ట్రాన్సాక్షన్స్ పై కూడా చార్జీల మోత మోగనుంది. లిమిట్ దాటిన లావాదేవీలపై చార్జీలను 50 శాతం 150 శాతం దాకా బాదేయనుంది. హోం బ్రాంచ్ ట్రాన్సాక్షన్స్ పై కూడా పరిమితులను విధించింది. విత్ డ్రాయల్స్ అయినా డిపాజిట్స్ అయినా ఇకపైన రూ.2 లక్షల వరకే పరిమితిం. ఆ తరువాత కనీసం చార్జీ రూ.150 ఫీజుగాను, లేదా వెయ్యికి రూ.5 లు గానీ చెల్లించాల్సింది ఉంటుంది. థర్డ్ పార్టీ ( హెచ్డీఎఫ్సీ బ్యాంకు కాక ఇతర) లావాదేవీలపై కూడా ఇదే చార్జీలను వసూలు చేయనుంది. -
హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఫీజుల బాదుడు
నగదు లావాదేవీలపై భారీగా పెంపు ముంబై: డిజిటల్ లావాదేవీలకు ఊతమిచ్చే దిశగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తాజాగా సేవింగ్స్ ఖాతాలకు సంబంధించి నగదు లావాదేవీలపై ఫీజులను భారీగా పెంచాలని నిర్ణయించింది. మార్చ్ 1 నుంచి నిర్దిష్ట లావాదేవీల చార్జీలను భారీగా పెంచాలని, ఇతరత్రా లావాదేవీల్లో నగదు పరిమాణంపై పరిమితులు విధించాలని, మరికొన్ని లావాదేవీలపై కొత్తగా చార్జీలు ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు బ్యాంక్ వర్గాలు తెలిపాయి. రోజులో థర్డ్ పార్టీ లావాదేవీలపై రూ. 25,000 పరిమితి, శాఖల్లో ఉచిత నగదు లావాదేవీల సంఖ్యను అయిదు నుంచి నాలుగుకి తగ్గుతాయని పేర్కొన్నాయి. ఉచితం కాని లావాదేవీలపై ఫీజులను 50 శాతం మేర పెంచుతూ రూ. 150కి చేర్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. హోమ్ బ్రాంచ్‌లలో మొత్తం డిపాజిట్లు, విత్‌డ్రాయల్స్ ఉచిత లావాదేవీలను రూ. 2 లక్షలకు పరిమితం చేసినట్లు పేర్కొన్నాయి. పరిమితి దాటిన పక్షంలో కనిష్టంగా రూ. 150 లేదా ప్రతి వెయ్యికి రూ. 5 చొప్పున చెల్లించాల్సి వస్తుంది. పెద్ద నోట్ల రద్దు దరిమిలా వివిధ చార్జీలను తొలగించడం వల్ల మూడో త్రైమాసికంలో ఫీజుల రూపంలో ఆదాయాలు మందగించి, లాభాల వృద్ధి గడిచిన పద్దెనిమిదేళ్లలో అత్యంత తక్కువ స్థాయిలో నమోదైన నేపథ్యంలో ఫీజుల పెంపు ప్రాధాన్యం సంతరించుకుంది. -
రూ. 3 లక్షలు పైబడిన నగదు లావాదేవీలను నిషేధించాలి
నల్లధనం నియంత్రణపై సుప్రీం కోర్టుకు సిట్ నివేదిక న్యూఢిల్లీ: దేశంలో నల్లధనాన్ని అరికట్టేందుకు రూ. 3 లక్షలు పైబడిన నగదు లావాదేవీలపై నిషేధం విధించాలని, ఏ ఒక్కరూ రూ. 15 లక్షలకు మించి నగదు నిల్వ ఉంచకుండా చూడాలని నల్లధనంపై వేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం సుప్రీం కోర్టుకు నివేదించింది. ఈ మేరకు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎంబీ షా నేతృత్వంలోని దర్యాప్తు బృందం సర్వోన్నత న్యాయస్థానానికి తన ఐదో నివేదిక సమర్పించింది. దేశంలో పెద్ద మొత్తంలో లెక్కల్లో చూపని సంపద నగదు రూపంలో చలామణి అవుతోందని వెల్లడించింది. నగదు లావాదేవీలకు సంబంధించి వివిధ దేశాల్లో అమల్లో ఉన్న చట్టాలను, వివిధ కేసుల్లో న్యాయస్థానాల పరిశీలనలు, మార్గదర్శకాలను పరిశీలించిన తరువాత నగదు లావాదేవీలపై గరిష్ట పరిమితి ఉండాలనే నిర్ణయానికి వచ్చినట్లు సిట్ అధికారిక ప్రకటనలో పేర్కొంది. రూ. 3 లక్షలు పైన నగదు లావాదేవీలను నిషేధించి, అటువంటి లావాదేవీలు చెల్లవని చట్టం చేయాలని సూచించిం ది. దర్యాప్తు సంస్థల సోదాల్లో కొన్నిసార్లు పెద్ద మొత్తంలో నగదు లభిస్తోందని, నగదు నిల్వపై పరిమితి విధించినపుడే నల్లధనం నిల్వలను అరిక ట్టే అవకాశం ఉంటుందని తెలిపింది. రూ. 15 లక్షలు గరిష్ట నగదు నిల్వ పరిమితిగా సూచించింది. ఒకవేళ ఎవరైనా వ్యక్తి గానీ సంస్థ గానీ అంతకు మించి నగదు నిల్వ ఉంచుకోవాలనుకుంటే ఆప్రాం తంలోని ఐటీ కమిషనర్ నుంచి అనుమతి తీసుకోవాలని అభిప్రాయపడింది. పన్ను చెల్లింపునకు గడువు పెంపు నల్లధనానికి సంబంధించి ఒకే విడత ఆదాయ వెల్లడి పథకం కింద వెల్లడించిన ఆస్తులకు పన్ను, అపరాధ రుసుమును విడతల వారీగా చెల్లించేందుకు కేంద్రం అనుమతిచ్చింది. శిక్ష నుంచి తప్పించుకునేందుకు లెక్కల్లో చూపించని ఆదాయంలో 45 శాతం పన్ను, సర్‌చార్జ్, పెనాల్టీ రూపంలో చెల్లించాలని కేంద్ర ఆర్థికశాఖ వెల్లడించింది. నల్లధనం వెల్లడికి ఈ ఏడాది సెప్టెంబర్ 30 తుది గడువుగా వెల్లడించిన ప్రభుత్వం అక్కడి నుంచి మరో రెండు నెలలలోపు పన్ను చెల్లించాలని పేర్కొంది. కాని వెల్లడించిన ఆస్తులకు మూడు విడతల్లో 2017, సెప్టెం బర్ 30లోపు పన్ను, సర్‌చార్జ్, అపరాధ రుసుం చెల్లించ వచ్చని తాజాగా మినహా యింపు ఇచ్చింది. తొలి విడతగా ఈ ఏడాది నవంబర్ 30 లోపు విధించిన మొత్తం పన్ను, సర్‌చార్జ్, పెనాల్టీలో 25 శాతం చెల్లించాలని, రెండో విడతగా 2017, మార్చి 31 లోపు 25 శాతం చెల్లించాలని తెలిపింది. మిగతా 50 శాతం 2017, సెప్టెంబర్ 30 లోగా చెల్లించాలని ఆర్థిక శాఖ తెలిపింది. -
ప్రీ-పెయిడ్ కార్డ్ పరిమితి రెట్టింపు
* రూ.లక్షకు పెంచిన ఆర్బీఐ * గిఫ్ట్ కార్డ్ కాలపరిమితి కూడా పెంపు ముంబై: వ్యవస్థలో నగదు లావాదేవీల తగ్గింపు దిశగా బుధవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మరో కీలక చర్య తీసుకుంది. ప్రీ-పెయిడ్ కార్డ్ (ప్రీ-పెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రమెంట్-పీపీఐ) పరిమితిని ప్రస్తుత రూ.50 వేల నుంచి రూ. లక్షకు పెంచింది. దీనితోపాటు గిఫ్ట్ కార్డుల గరిష్ట కాలపరిమితిని ఏడాది నుంచి మూడేళ్లకు పెంచుతున్నట్లు ఒక ప్రకటనలో ఆర్బీఐ పేర్కొంది. పూర్తి స్థాయిలో కేవైసీ (నో యువర్ కస్టమర్) నిబంధనలకు అనుగుణంగా ఉన్న అకౌంట్ల నుంచి అకౌంట్‌దారులు కోరిన విధంగా వారిపై ఆధారపడినవారికిగానీ లేదా కుటుంబ సభ్యులకు కానీ ఎన్ని పీపీఐలు జారీ చేయడానికైనా బ్యాంకులకు ఆర్బీఐ అనుమతి ఇచ్చింది. అయితే ఒక వ్యక్తికి ఒక కార్డును మాత్రమే జారీ చేయాల్సి ఉంటుంది. దఫాకు రూ.10,000, నెలకు రూ.25,000 మించి ఈ పరిమితి ఉండరాదని కూడా స్పష్టం చేసింది. విదేశీయుల విషయంలో... కాగా దేశంలో పర్యటిస్తున్న ప్రవాస భారతీయులు (ఎన్ఆర్ఐ), విదేశీయులకు రూపాయి డినామినేటెడ్ (రూపాయిలో చెల్లుబాటు అయ్యే విధంగా) నాన్-రీలోడబుల్ పీపీఐల జారీకి సైతం రిజర్వ్ బ్యాంక్ అనుమతి మంజూరు చేసింది. కాగా ఎక్స్ఛేంజ్ హౌస్‌లు లేదా ఆర్బీఐ గుర్తింపు పొందిన మనీ ట్రాన్స్‌మీటర్స్ భాగస్వామ్యంతో కూడా ఎన్ఆర్ఐ లేదా విదేశీయులకు పీపీఐలు జారీ చేసే వీలుంది. ప్రి పెయిడ్ కార్డ్ అంటే... కొంత మొత్తాన్ని ముందుగా బ్యాంకులో డిపాజిట్ చేసి తీసుకునే క్రెడిట్ కార్డ్ లాంటిదే ప్రి పెయిడ్ కార్డు. క్రెడిట్ కార్డులో అయితే ఆ కార్డు బ్యాంకు నిర్దేశించే క్రెడిట్ లిమిట్ వరకూ వాడుకోవచ్చు. ప్రి పెయిడ్ కార్డ్‌లో ఎంతైతే ముందుగా డిపాజిట్ చేస్తారో ఆ మొత్తాన్నే వాడుకోవాలి. సాధారణంగా ఖర్చుల నియంత్రణ కోసం ఈ కార్డులను వాడతారు. టీనేజర్లకు తల్లిదండ్రులు ఇలాంటి కార్డులను ఇస్తారు. వాళ్లు ఇష్టమొచ్చినట్లు ఖర్చు చేయకుండా ఉండటానికి క్రెడిట్ కార్డులకు బదులుగా ఈ కార్డులను ఇస్తారు. కాగా, కొంత మొత్తాన్ని డిపాజిట్ చేసిన డెబిట్ కార్డును గిఫ్ట్కార్డుగా వ్యవహరిస్తారు. ఇవి జారీ చేసే బ్యాంకులు, సంస్థలను బట్టి వివిధ డినామినేషన్లలో లభిస్తాయి. ఎవరికైనా నగదు బహుమతులుగా ఇవ్వడానికి వీటిని జారీ చేస్తారు. కార్డు డినామినేషన్ మేరకు మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంటుంది.