
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్టార్టప్ కంపెనీలకు ఖాతా ప్రారంభం, నగదు లావాదేవీల నిర్వహణ, ఇతరత్రా సేవలందించేందుకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ప్రత్యేక బ్రాంచీలను ఏర్పాటు చేసింది. బుధవారమిక్కడ గచ్చిబౌలిలో స్మార్టప్ జోన్‌ను ప్రారంభించిన సందర్భంగా హెచ్‌డీఎఫ్‌సీ సౌత్ హెడ్ మధుసూదన్ హెగ్డే విలేకరులతో మాట్లాడారు. దేశంలోని ప్రధాన నగరాల్లో 30 ప్రాంతాల్లో 65 స్మార్టప్ జోన్లను ఏర్పాటు చేశామన్నారు.
ఇప్పటికే దేశవ్యాప్తంగా 660, హైదరాబాద్‌లో 225 స్టార్టప్స్ ఖాతాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. రెండో దశలో హైటెక్‌సిటీ, మాదాపూర్ బ్రాంచీల్లో, ఈనెల 15న విశాఖపట్నంలో స్మార్టప్ జోన్లను ప్రారంభిస్తామని పేర్కొన్నారు. 6 నెలల్లో 15 సెంట ర్లను ఏర్పాటు చేయడం లక్ష్యమని చెప్పారు.